ప్రక్రుతి కన్నెర్ర చేస్తే,ఆంద్రా అయినా, అమెరికా అయినా ఒకటే.
మనుషులకు, ఇతర జంతుకోటికి ఒకటే బేదం,అది జ్ణానం. ఈ ఒక్క జ్ణానమే మనిషి తను సర్వ శక్తి మంతుడు అనే బావం కలగజేసి తను సాదించిన అట్టి శాస్త్ర జ్ణానం తో చివరకు ప్రక్రుతినే జయించగలను అనే స్తితికి వచ్చాడు.తాను ఎంత గొప్పవాడైనప్పటికి, స్రుష్తి కర్తను కానని,తాను స్రుష్టిలో అన్నిటితో పాటు బాగమేనని మనిషి గ్రహించి ప్రక్రుతికి అనుకూలంగా నడుచుకోవడం ఇటు మనిషికి అటు తక్కిన జీవకోటికి ఉత్తమం. ఎంత జ్ణానం కలిగి ఉన్నామన్నది కాదు,ఏం చేస్తే ప్రక్రుతి మాత కరుణ కలిగి హాయిగా జీవిస్తాం అనే దిశగా మన చర్యలు ఉండాలి. ఉదాహరణకు ఈ ప్రక్రుతి వైపరీత్యాలకు "గ్లోబల్ వార్మింగ్"కారణమని తెలి...