సరస్వతి నది పుష్కరాలు జరిగే "మాన" గ్రామం లోని విశేషాలు చూడండి!
గురుగ్రహ సంచారం ఆదారంగా, మన దేశంలోని ఆ యా పుణ్య నదుల పుష్కరాలు నిర్వహిస్తుంటారు. గురుడు ఒక రాసి నుండి మరొక రాసికి మారే సమయం ని పవిత్ర ఘడియలుగా యెంచి, ఒక్కొక్క రాసికి ఒక్కొక్క నదీ పుష్కరంగా నిర్ణయించి భక్తులు ఆ యా నదులలో పవిత్ర స్తానాలు ఆచరించడం రివాజు. అలా ఈ సంవత్సరం గురుడు మిదున రాసి లోకి ప్రవేశించే సమయం ని సరస్వతీ నదీ పుష్కరంగా పిలుస్తారు. ఈ శుబ ఘడియలు మె 31 నుండి జూన్ 11 వరకు,ఉంటాయి. కాబట్టి ఈ పన్నెండు రోజులు సరస్వతీ నదిలో పుష్కరస్తానాలు చేసి దన్యులవుతారు భక్తులు. ఇంతవరకు బాగానే ఉంది. కాని స్వరస్వతీ నది పుష్కరాన్ని మన రాష్ట్రంలో గోదావరి ప్రవహిస్తున్న కాలేశ్వర క్షేత్రంలో నిర్వహించడం ఎంత వరకు సమంజసం? అక్కడ సరస్వతి నది అంతర్వాహిని గా ఉందన్న ఒక పుక్కిట వాదం ఆదారంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంత మాత్రం బావ్యం కాదు అని నా అభి ప్రాయం. అసలు సరస్వతీ నది దక్షిణ బారతానికి సంబందించ్దే కాదు అనడం లో ఎవరికీ బేదాబిప్రాయాలు లేవు. ఆ నది రుగ్వేద కాలం లో ఒక మహా నదిగా ఉండి కాల క్రమేపి అంతర్వాహినిగా మారిందని చెపుతారు. అలా అంతర్వాహిణిగా కూడా ఆ నదీ పుష్కరాలు జరపాల్స...