గురుగ్రహ సంచారం ఆదారంగా, మన దేశంలోని ఆ యా పుణ్య నదుల పుష్కరాలు నిర్వహిస్తుంటారు. గురుడు ఒక రాసి నుండి మరొక రాసికి మారే సమయం ని పవిత్ర ఘడియలుగా యెంచి, ఒక్కొక్క రాసికి ఒక్కొక్క నదీ పుష్కరంగా నిర్ణయించి భక్తులు ఆ యా నదులలో పవిత్ర స్తానాలు ఆచరించడం రివాజు. అలా ఈ సంవత్సరం గురుడు మిదున రాసి లోకి ప్రవేశించే సమయం ని సరస్వతీ నదీ పుష్కరంగా పిలుస్తారు. ఈ శుబ ఘడియలు మె 31 నుండి జూన్ 11 వరకు,ఉంటాయి. కాబట్టి ఈ పన్నెండు రోజులు సరస్వతీ నదిలో పుష్కరస్తానాలు చేసి దన్యులవుతారు భక్తులు.
ఇంతవరకు బాగానే ఉంది. కాని స్వరస్వతీ నది పుష్కరాన్ని మన రాష్ట్రంలో గోదావరి ప్రవహిస్తున్న కాలేశ్వర క్షేత్రంలో నిర్వహించడం ఎంత వరకు సమంజసం? అక్కడ సరస్వతి నది అంతర్వాహిని గా ఉందన్న ఒక పుక్కిట వాదం ఆదారంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంత మాత్రం బావ్యం కాదు అని నా అభి ప్రాయం. అసలు సరస్వతీ నది దక్షిణ బారతానికి సంబందించ్దే కాదు అనడం లో ఎవరికీ బేదాబిప్రాయాలు లేవు. ఆ నది రుగ్వేద కాలం లో ఒక మహా నదిగా ఉండి కాల క్రమేపి అంతర్వాహినిగా మారిందని చెపుతారు.
అలా అంతర్వాహిణిగా కూడా ఆ నదీ పుష్కరాలు జరపాల్సిన చోటు కూడా ఉత్తర బారతం లోని, బద్రీనాద్ సమీపం లోని "మన" అనే గ్రామం వద్దనే. అక్కడే పుష్కారాలు జరుపుతున్నారు. కాని మన రాష్ట్రం లోని ఏ అధికార వర్గ నిర్ణయం ననుసరించి ఈ విదంగా అసంబద్దమైన పుష్కర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో అర్థం కావడం లేదు. మతాచారలకు కూడా ఒక పద్దతి ఉంటుంది. ఏదో పర్యాటక అభివ్రుద్ది కోసమో, ఇతర విషయాలను ద్రుష్టిలో పెట్టుకునో, పద్దతులను విస్మరిస్తే చివరకు మతాచారం అంటే "మనీ మతలబ్" ఆచారాలుగా మిగిలిపోతాయి.
సరస్వతి నది ఉనికిని కొంత మంది చరిత్రకారులు ఒప్పుకోవటం జరిగింది ప్రస్తుతం సరస్వతి నది జన్మ స్తానం బద్రీ నాద్ క్షేత్రం దగ్గరలోని "మాన" అనే గ్రామం వాద ప్రవహిస్తున్న నది అని చాలమంది అభిప్రాయం. రుగ్వేద కాలం నాటికి ఈ నది పెద్దదిగా ఉన్నప్పటికి కాలంతర మార్పుల చేత తన జన్మ స్తానం నుండి కొంత దూరం ప్రవహించాక, గంగ, యమున , నదులతో అంతర్వాహినిగా మారి అలాహాబాద్ వద్ద త్రివేణి సంగమం గా దర్శనమిస్తుందని నమ్మకం. అంతే కాని మన రాష్ట్రం లోని కాలేశ్వరానికి ఈ నదికి సంబందం ఉందని ఏ పురాణాలు, ధర్మ శాస్త్రాలు చెప్పలేదు.సరస్వతి నదికి సంబందించిన కొన్ని పొటోలు మరియు సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది. చూడండి. (పొటోలు "మై యాత్ర డైరీ.బ్లాగ్ స్పాట్. వారి సౌజన్యంతో)
 |
"మాన "అనే గ్రామం దగ్గర సరస్వతి నది జన్మ స్తానం |
 |
అందమైన "మాన" గ్రామం |
 |
"మాన" గ్రామం దగ్గరలోని విశేషాలు తెలిపే సూచిక |
 |
"మాన" గ్రామం దగ్గరలో సరస్వతి నది |
 |
"మాన" గ్రామం వద్దనున్న ఇండియా సరిహద్దులో చివరి దుకాణం |
 |
"మాన" గ్రామం వద్దనున్న "భీమ్ పూల్" |
 |
"మాన" గ్రామం వద్దనున్న గణేశ్ గుహ |
 |
"మాన" గ్రామం వద్దనున్న వ్యాస మహరుషి
గుహ |
 |
"మాన" గ్రామం వద్దనున్న వసుందర ట్రెక్కింగ్ పర్వతం |
Comments
Post a Comment