నది ఒడ్డున ఉన్న తరువులుకి, పరాయి ఇంట్లో ఉన్న తరుణులుకి తప్పదు ముప్పు!
ఈ కొటేషన్ చెప్పింది ఎవరో తెలుసా అర్దశాస్త్ర రచయిత కౌటిల్యుడు లేక చాణక్యుడు.మొన్న వచ్చిన "కేదార్ నాద్" వరద విపత్తు చూస్తుంటే ఆయన ఏ నాడో చెప్పిన సూక్తులు అక్షర సత్యాలు అనిపిస్తున్నాయి. పై దానిలో రెండవ వ్యాక్య సంగతి ఎలా ఉన్నా మొదటిది మాత్రం నిజం ! నిజం!
నది ఒడ్డున ఎంత గొప్ప చెట్లు ఉన్నా అవి ఏదో ఒకనాడు కొట్టుక పోక తప్పదు. ఈ సూత్రం కేవళం చెట్లకే కాక అన్ని రకాల కట్టడాలకు వర్తిస్తుంది. అందుకే మొన్న ఉత్తారాఖాండ్ వరదలకు నది ప్రకన ఉన్న పెద్ద పెద్ద బవంతులు పేకమేడల్లా కూలిపోయాయి.అంతే కాదు అపార ప్రాణ నష్టం సంబవించింది. టూరిజం డెవలప్మెంట్ పేరుతో ఆద్యాత్మిక క్షేత్రాలను వ్యాపార క్షేత్రాలుగా మారుస్తూ, అడ్డగోలుగా నదీ పరివాహక ప్రాంతాలో కట్టడాలకు అనుమతులిస్తున్న రాష్ట్ర సర్కారులు, ఉత్తరాకాండ్ వరద్ ప్రళయ ఉదంతంతోనన్నా కళ్ళుతెరిస్తే మంచిది. ఈ సర్కారులో ఉండేవాల్లకి కౌటిల్యుడి నీతి గురించి ఎలాగూ చదువుకోలెదు సరే, కనీసం పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్పేది అయినా చెవికెక్కించుకోక పోతే ఎలా?
మేమంత గొప్పవాళ్లం, ఇంతగొప్పవాళ్లం అని విర్రవిగడం కాదు. ప్రళయగర్జన చేసే ప్రక్రుతిని మనిషి ఏమి చెయ్యళేడు,అంతా అయ్యాక వరద నష్టం అంచనాలు వెయ్యడం తప్పా!కాని విజ్ణాన శాస్త్రం మీద పట్టు ఉందనే వారు కనీసం రెండు రోజులు ముందుగా నైనా రాబోయే విప్పత్తు ని కనిపెట్టలేక పోయారా? కనిపెడితే ఇంత ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదుగా. ఈ విషయంలో మనిషి అల్పత్వం మరో సారి రుజువైంది.
ఇకపోతే ఈ విషయంలో ఆ దేవుడు కూడా నిందార్హుడే! నిన్ను చూడటానికి వచ్చే బక్తుల పైన ఇంత కనికరం లేనివాడివి అయావు ఏమిటి శివయ్యా? నీ నెత్తి మీద గంగమ్మ శివాళ్లు చూడలేక కళ్ళు మూసుకున్నావు కదూ. అందుకే నీకు అంటక తప్పదు వరద బురద(చిత్రం చూడండి). మానవ వెర్రిని శిక్షించాను అని సంబరపడుతున్నావా? నీకు మాత్రం ఏమి ఒరిగింది? నీ చుట్టూ బురద! ఒక సంవత్సరం పాటు నీ గుడి బంద్ అట! ఈ విదంగా ఏడాదిదాక నీ భక్తులను చూసే చూసే బాగ్యం నీకు లేదు కదయా! అయ్యో విది ఎంత విచిత్రమయినది.ఒక్క దెబ్బతో అటు బక్తుడికి ఇటు బగవంతుడికి ఇక్కట్లు స్రుష్టించింది!
trees on a river bank, a woman in another man's home, and kings without counsellors go with out doubt to swift destruction. .... Chaanakya
Comments
Post a Comment