ఆంద్రా అసెంబ్లీ ని అల్లలాడిస్తున్న ఒక్క "ఆడ ధీర " !!
ఆమె గారి పేరు రోజా ! పేరుకే రోజా యే కాని ,ముట్టుకోక ముందే కసక్కున దిగుతాయి ముళ్ళు లాంటి మాటలు. ఆమె గారు రాజకీయ రంగ ప్రవేశం చేయకముందు చలన చిత్ర రంగం లో తనదైన హావబావ శైలి తో రాటు దేలిన నటి మణి కాబట్టి, ఆ అనుభవం రాజకీయ రంగానికి పనికి వచ్చింది. ఆమె గారు అసెంబ్లీలో మాట్లాడే మాటలు లో మాటర్ ఉన్నా లేకపోయినా , హవాబావాలు తో అధికార పార్టి సబ్యులను కట్టడి చేస్తూ ప్రతి పక్షానికి ఆనందం చేకూర్చడం లో సపలిక్రుతురాలు అవుతుంది ఈ మాజీ నటీ మణి. ఆమె ను ఎదుర్కోవడానికి మగ సభ్యులకు మహా ఇబ్బంది అనుకుంటే అధికార పార్టిలోని మహిళా సభ్యులకు కూడా ఆమె నోట్లో నోరు ...