ఆఖరుకు "గ్యాస్ ట్రబుల్ " ప్రచారానికి కూడా "ఆమె " యేనా ?!!!.
పై ఫొటో చూడండి . ఇది మనిషిలో ఉన్న గ్యాస్ ట్రబుల్ సమస్యకు నివారణ కొరకు ఉద్దేశించబడిన ప్రకటన . గ్యాస్ ట్రబుల్ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. స్త్రీ పురుషులు ఇరువురిని బాగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి . అయితే దాని నివారణ కోసం మా మందులు వాడండి అని చెప్పే కంపెనీలకు మాత్రం పురుషులును తమ ప్రచారాల్లో వాడుకోవటం సుతారాము ఇంష్టం ఉండదు అనుకుంటా . అందుకే పై న చూపిన చిత్రం తాలూకు అడ్వేర్టైజ్ కంపెనీ వారు తమ గ్యాస్ ట్రబులు మందులు ప్రచారానికి స్త్రీ నే ఎంచుకున్నారు . ఆ ప్రచార చిత్రం లో కూడా స్త్రీ గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నట్లు కనిపించడం లేదు . ఎందుకంటే బాధను ప్రతిఫలించే ముఖం ను వారు మూసేసారు కాబట్టి . ఇప్ప్పుడు ఎవరికైనా ఆమె ఛాతీని (?) పట్టుకున్న చేతులు , క్రింద ఇచ్చిన వ్యాక్యాలు చదివి "ఓహో ఇది గ్యాస్ ట్రబుల్ ప్రచార ప్రకటన " అని అనుకోవాలి . అయితే వినియోగదారుడైన సగటు ప్రేక్షకుడిని ఆకర్షించే అంశం మాత్రం ఇందులో కనపడుతుంది . అలా కనపడటం కోసమే "ఆమె " అంట