ఒంట్లో "దెయ్యం " వెళ్ళగొడతానని ,ఇంట్లోనే "రేప్ " చేసి పోయిన "దెయ్యం "మాంత్రికుడు!!
దెయ్యాలు మీద నమ్మక్కం ఉన్న వారికి , దెయ్యం అనేది భూత వైద్యులు మాట తప్పా,ఎవరి మాట వినదని బహు నమ్మఖ్ఖమ్ .దీనినె మూడ నమ్మక్కం అంటారు అంతో ఇంతో సైన్స్ తెలిసిన వారు ."దెయ్యమ్, భూతం అనే బావనలు ఒక రకమైన మానసిక సమస్యలు,వాటికి పరిష్కారం చూపగలిగేది ఆధునిక వైద్య పద్దతులు మాత్రమె "అని విజ్ఞాన బాబులు ఎంత చెప్పినా ,అజ్ఞాన జనం అంగీకరించటానికి సిద్దంగా లేరు . కారణం వారిలోని విజ్ఞాన లేమి కావచ్చు ,లేకుంటే భూత వైద్య ప్రక్రియల ద్వారా లబ్ది పొందిన వారి అనుభవాలు కావచ్చు . ఎది ఎమైనా దెయ్యం అనేది ఒక నెగటివ్ బావన .ఆ బావనను మనసు నుండి తొలగించడమే భూత వైద్యుడైన ,ఆధునిక మానసిక వైదుడైన చేయాల్సిన పని . పెద్ద పెద్ద పూజా సెటింగ్ లతో కూడిన పూజలు చేస్తూ ,మనిషిలోని దెయ్యం అనబడే "నెగటివ్ పీలింగ్ "ని పోగొట్...