హాంపట్..ఆమెను చంపి,అతడిని 13 వ అంతస్తు నుండి తోసేసి చంపిన ఆ భూతం ఏవరో తెలుసా!?
దెయ్యం! భూతం! కాష్మోరా!మోహినీ! పిశాచీ! కొరివి దెయ్యం! ఇవ్వన్నీ మనిషిని ఆవహించి వారిని ఉన్మాదులను చేసే మానసిక రోగాల పేర్లు. కానీ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ ఉన్మాదానికి గురైన వారికి ఎటువంటి విద్యా అర్హత లేని మంత్రగాళ్ళు, భూత వైద్యులు, పకీర్లు ఈ ఉన్మాదాన్ని వదిలిస్తున్నారు. దెయ్యం పట్టి చనిపోయిన వారు ఉన్నట్లు ఉదంతాలు లేవు అనుకుంటా!కానీ కాష్మోరా ను మించిన భయంకర బూతం ఇప్పుడు యువతను ఆవహించి వారి ప్రాణాలను వారే తీసుకునేటట్లు చేస్తుంది. ఈ భూతం పుట్టేది ఎందులో తెలుసా? నవ నాగరిక జీవన విదానం లో!ఈ భూతం ఎవరిని ఆవహిస్తుందో తెలుసా? చదుకోని వారి జోలికి అసలు పోలెదు. చదువుకున్న వారి లోనే తిష్ట వేసి వారు చచ్చే వరకు వేదిస్తుంది. వీరికి భూతం పట్టిందని వీరికి తెలియదు, వీరీ చుట్టూ ఉండే నవ నాగరీకులకు తెలియదు. తీరా వారు చని పోయాక మాత్రం" పిచ్చోళ్ళు! ఇంత చిన్న విషయానికే చని పోతారా!" అని ఒక నిట్టూర్పు విడుస్తారు. మరి ఇప్పట్టికైనా ఆ భూతం ఏదో గ్రహించారా? దాని పేరే "స్ట్రెస్". మానసిక ఒత్తిడి.నేడు పదహారేళ్ల పాటు చదువుకుని ,