ఇక నుండి విటులకు ఎయిడ్స్ తగులు కుంటుందో లేదో కాని సెక్షన్ 370 A మాత్రం తగులుకుంటుంది!!!!?
నిన్న మన హైకోర్టు వారు బ్రహ్మాండమైన తీర్పు ఒకటి ఇచ్చారు. ఆ తీర్పు దెబ్బతో వ్యభిచార గృహాలకు వెళ్ళె విటులకు కష్ట కాలం మొదలు అయినట్లే. విటుడిగా కేసులో ఉన్న వ్యక్తిది విచిత్ర పరిస్తితి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు అయింది సదరు విటుడి గారి పరిస్తితి.టూకీగా కేసు వివరాలు ఏమిటంటె హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనిలో నిర్వహిస్తున్న ఒక బ్రోతల్ హౌస్ మీద దాడి చేసిన పోలిసులు ఇద్దరు నిర్వాహకులు, ఒక విటుడిని పట్టుకుని వారి మీద కేసులు పెట్టారు. అయితే గృహ నిర్వాహకులు మీద పెట్టిన సంబందిత చట్టం లోని సెక్షన్లు కరెఖ్తువే అయినప్పటికి , విటుడి మీద పెట్టిన సెక్షన్ అతను చేసిన నేరానికి సంబందించింది కాదు. అందుకే ఆతను దైర్యంగా తనను కేసు నుండి విముక్తం చేయాలని హైకోర్టువారిని ఆశ్రయించాడు . విటుడు కోరుకున్నట్లే అతన్ని సదరు సెక్షన్ నుంచి విముక్తం చేసినప్పటికి , సెక్షన్ 370 A అఫ్ I P C క్రింద విచార