ఇక నుండి విటులకు ఎయిడ్స్ తగులు కుంటుందో లేదో కాని సెక్షన్ 370 A మాత్రం తగులుకుంటుంది!!!!?
నిన్న మన హైకోర్టు వారు బ్రహ్మాండమైన తీర్పు ఒకటి ఇచ్చారు. ఆ తీర్పు దెబ్బతో వ్యభిచార గృహాలకు వెళ్ళె విటులకు కష్ట కాలం మొదలు అయినట్లే. విటుడిగా కేసులో ఉన్న వ్యక్తిది విచిత్ర పరిస్తితి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు అయింది సదరు విటుడి గారి పరిస్తితి.టూకీగా కేసు వివరాలు ఏమిటంటె
చింతామణి నాటకంలో ఒక పద్యం ఉంటుంది. " ఇంట రంభ వంటి భార్యలు ఉండ సాని కొంపలందు తిరుగు చవట లారా " అని .ఈ దెబ్బతో చట్టం ద్రుష్టిలో విటులు చవటలు కాదు కాని ఏకంగా పెద్ద క్రిమినల్స్ అయిపోతారు. "సాని కొంపలకు వెళ్లొద్దు , అక్కడ ఎయిడ్స్ లాంటివి తగులు కుంటే ఇంటిల్లాపాది నరకం అనుభవించాల్సి వస్తుంది "అని ఎంత చెప్పినా వినిపించుకోని కామ రాజులకు ఈ తీర్పు చెంప పెట్టులాంతిదే అని చెప్పవచ్చు. ఎందుకంటె ఇక నుండి వేశ్యా గృహాలకు వెళ్ళె విటులకు ఎయిడ్స్ తగులు కుంటుందో లేదో కాని సెక్షన్ 370 A మాత్రం తగులుకుంటుంది!!!!?
Comments
Post a Comment