Posts

Showing posts with the label T.T.D.model Temples

దేవాలయాలు కంపెనీలు లాంటివా? బ్రాంచీలు పెట్టడానికి !

Image
                                                                                                                                                                                           తిరుమల తిరుపతి దేవస్తాన అధికారులకు ఈ మద్య భక్తి ఎక్కువవుతున్నట్లుంది. స్వామివారి మోడల్ దేవాలయాలు దేశం నలుమూలల ఏర్పాటు చెయ్యాలని బావిస్తున్నారట! బగవంతుడి మీద భక్తో, లేక వేరే మతలబులు ఏమన్నా ఉన్నాయేమో తెలియదు కాని స్వామివారి సొమ్మును ఏదో రకంగా ఖర్చు రాసేదామనే చూస్తుంటారు. మరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కలలో కనపడి తనకు నలు దిక్కుల గుళ్ళను కట్టమని వీరిని అడిగాడా? ఎందుకు వీరికంత మంచి బుద్ది పుట్టింది. !                  తిరుమల అనేది ఒక పవిత్ర క్షేత్రం. ఆళ్వారుల దర్శనం  ప్రకారం సూర్యమండలం నుండి  ఒక దివ్య తేజస్సు తిరుమల మీదకు ప్రసరించిందని, కాబట్టి అది తిరు(పవిత్ర)+ మలై (కొండ) అని వారు శ్లాఘించారు. మన పురాణాల ప్రకారం శ్రీనివాసుడు పద్మావతి పరిణయం తర్వాత, లక్శ్మీ దేవి తో జరిగిన సంవాదం చేత ఆ కొండపైనే శిల గా మారాడని చెపుతారు. ఏది ఏమైనా తిరుమల కేవళం విగ్రహ అర్చనా రీత్యా కాక ఆ కొండ ప్రాంతమంతా ఒక అలౌకిక ఆ