ఒక్క రాత్రిలో 2 గాంగ్ రేప్ లు ఒకే స్త్రీ మీద జరగటానికి కారణ మేమిటి?
డిల్లీ లో జరిగిన నిర్భయ ఉదంతం , తద్వారా అమలులోకి వచ్చిన "నిర్భయ" చట్టం అంటే మ్రుగాళ్ళకు అసలు ఖాతరు లేనట్లే అనిపిస్తుంది. అలాగే కొంత మంది స్త్రీలు కూడా జరుగుతున్న పరిణామాలు గమనించి అయినా తమ జాగర్తలో తాము ఉండటానికి కూడ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు అనిపిస్తుంది. ఇదే పరిస్తితులు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా అత్యాచార కేసులు ను కూడా , అవినీతి కేసులు మాదిరి రోటీన్ కేసులు గా బావించే స్తాయికి భారతీయ సమాజం దిగజారిపోతుంది . మొన్న పుద్దుచెర్రిలో జరిగిన జంట గాంగ్ రేప్ కేసులు ఉదంతం విన్నాకా ఇది తద్యం అనిపిస్తుంది. పుదుచెర్రిలో ,కరికాల్ అనే ప్రాంతంలో మొన్న క్రిష్టమస్ రోజున ఒక 20 సంవత్సరాల అమ్మాయిని కేవలం గంటల వ్యవదిలో రెండు గాంగ్ లకు చెందిన 7 గురు మ్రుగాళ్ళు రేప్ చేసారట. ఆ అమ్మాయి ఒక కంప్యూటర్ ఫరం లో పని చేసే ఉద్యోగిని అట. ఆ అమ్మాయి తన స్నేహితురాలితో కలసి , ఆ స్నేహిహితురాలు బాయ్ ప్రెండ్ దగ్గరకు వెళ్ళారట. ఆ బాయ్ ప్రెండ్ వయస్సు 17 సంవత్సరాలట. వారు జాలీ గా రాత్రి వేళ సైట్ సీయింగ్ కి వెళ్లి, అక్కడ అ స్నేహితురాలు తనకు ఒంట్లో బాగో లేదు అంటే , ఆ బ...