Posts

Showing posts with the label religious freedom

స్వామీ పరిపూర్ణానంద ప్రతిపాదిత "హిందూ ధార్మిక కౌన్సిల్ " కు కేవలం ప్రశ్నించే హక్కు ఇచ్చినంత మాత్రానా దేవాలయ వ్యవస్థ బాగుపడి పోతుందా ?

Image
                                 మన తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మం కి సంబంధించినంత వరకు పీఠాధిపతులకి , స్వామీజీలకు, బాబాలకు కొదువేమి లేదు . కానీ ఉమ్మడి రాష్ట్రాల్లోని దేవాలయాలు సుమారు 33,000 పై చిలుకు ఉన్నప్పటికీ అందులో 31,000 దేవాలయాలు లోని దేవుళ్ళు దూపదీప నైవేద్యాలు లేక అనాధలుగా మిగిలిపోతే ,దానికి తరుణోపాయం చెప్పే వారు లేరు. ఒక పక్క పాత దేవాలయాలలో దేవుళ్ళకే దిక్కులేకపోతే,మరొక పక్క లక్షలు, కోట్లు వెచ్చించి కొత్త దేవాలయాలను అదే ఊళ్లలో నిర్మిస్తుంటే ,ఇదెంతవరకు సమంజసం ?అని అడిగిన నాధుడు లేదు.                                                      హిందూ ధర్మం ప్రకారం "దేవాలయ నిర్మాణం " అనేది సప్త సంతానం లో ఒకటి. అంటే దేవాలయాలు నిర్మించే వారు వ్యక్తులు కానీ, గ్రామాలు కానీ ,ఆ దేవాలయ నిర్వహణకు అయ్యే ఖర్చు స్వయంగా దగ్గరుండి చూచుకోవడమో , లేక అందుకు అయ్యే వ్యయం భరించగలిగే విధంగా తగిన ఆస్తులు అవి సమకూర్చగలిగితేనే దేవాలయ నిర్మాణం చేపట్టాలి  . అలా కాకుండా ఊళ్ళో ఉన్న పాత దేవాలయాలు ఆలనా పాలనా పట్టించుకోకుండా , ఎవరో దాతలు డబ్బులు ఇచ్చారని ఊరంతా చందాలు వేసుకుని , పది రోజులు సంబురాలు చే

, రామోజి ఫిల్మ్ సిటీ కి ఉన్న స్వేచ్చ, రామాలయానికి లేదా?

Image
                                                                      రామోజి ఫిల్మ్ సిటీ కి ఉన్న స్వేచ్చ, రామాలయానికి లేదా?    అంటె                                                             లేదని చదువు రాని పామరుడైనా డంకా బజాయించి చెపుతాడు. ఇందులో మొదటిది లౌకిక ఆనందాన్నిచ్చే వినొదాత్మక కేంద్రమయితే, రెండవది అలౌకిక ఆనందాన్నిచ్చే ఆద్యాత్మిక క్షేత్రం  .  ఈ రెండు కేంద్రాల మనుగడకు డబ్బు అవసరం అనేది ఎవరూ కాదనరు.కాని ఆ ఆర్థిక వనరుల స్వబావం మాత్రం వేరు.   ఆద్యాత్మిక క్షేత్రాల నిర్వహణకు పూర్వ కాలంలో రాజులు, దనవంతులైన వ్యవస్తాపక కుటుంబాల వారు భూరి విరాళాలతో పాటు, మాన్యాలు ఇచ్చి పోషించే వారు. భక్తులుకు, బాటసారులకు దేవాలయాలు ఉచిత అన్న దానం, ఇతర సేవలు ఒసగేవి. కాని ఇప్పటి రోజులలో అసలు ప్రభుత్వం నుండి ఒక్క నయా పైసా కూడా తీసుకునే వీలు దేవస్తానాలకు లేదు, కారణం మనది లౌకిక రాజ్యం కాబట్టి, మత సంస్తలకు రాజ్య సొమ్మును ఖర్చుపెట్టడాని మన రాజ్యాంగం ఒప్పుకోదు. కేవలం భక్తుల దాత్రుత్వం మీదే దేవాలయాల మనుగడ నడుస్తుంది.   ఇక పోతే పెత్తనం విషయానికి వస్తే గవర్నమెంటే పెద్ద కొడుకు. పేరుకే ట్రస్ట్ బోర్డులు.

ఖమ్మంలో "కరుణగిరి"కి 2000 ఎకరాలు ఇవ్వగల్గిన,రెడ్డిగారు, 36 ఎకరాలు "స్తంబాద్రి నరసింహుడికి" ఇవ్వలేకపోయారు!

Image
                                                                            ఖమ్మం లోని నరసింహా స్వామీ గుట్ట దేవాలయం                                                                                                                                      ఖమ్మం! ఈ పేరు స్తంభాద్రి అనే గుట్ట వలన వచ్చిందంటారు. మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలో అత్యంత చెత్యన్య వంతమైన జిల్లాగా ఖమ్మం జిల్లా కు పేరుందని మురిసి పోతుంటారు జిల్లా వాసులు. కాని అదే జిల్లాకి ముఖ్యపట్టణమైన ఖమ్మం నడి బొడ్డులో ఒక ఘోరమైన అన్యాయం "ఖమ్మం" పట్టణానికి పేరు రావడానికి కారణమైన "స్తంబాద్రి" గుట్ట మీద వెలసిన’ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయానికి  కి జరిగితే అడిగే దిక్కు లేకుండా పోయింది. కారణం బహూశా ఇక్కడంతా "ఎర్ర చైతన్యమే" తప్పా మత చైతన్యం లేక పోవడం కావచ్చు. ఏదైనా హిందూ మతానికి కాని మత సంస్తకి కాని అన్యాయం జరిగినపుడు, ఏ అర్.ఎస్. ఎస్. వాళ్ళో,బి.జె.పి వాళ్ళొ, అందోళన చెస్తే తప్పా, మతం అంటే "అంట రాని తనం" గా బావించే "ఎర్ర పార్టీల వారు పట్టించుకోరు. మరి ఖమ్మం జిల్లాలో "ఎర్ర పార్టిల&quo

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

Image
                                                                                                     నో ! నెవ్వర్ ! అటువంటి దీనావస్త, సెక్యులర్ దేశం అని ఘనంగా ప్రకటించుకున్నఇండియాలోని మైనార్టీ మతస్తులకు  ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే తాజా గణాంకాల ప్రకారం దేశ జనాభాలో 2. 3% ఉన్న వారి  చర్చ్ లు,  గత 50 యేండ్లలో   దేశంలోనే  అతి పెద్ద వ్యవసాయేతర భూములు కలిగిన భూస్వామి గా మారడం ఒక కారణమైతే , గవర్న్మెంట్ తర్వాత అతి పెద్ద ఉపాది కల్పనా యజమానిగా మారడం రెండవ కారణం. వారి బడ్జెట్ ఇంచుమించు మన ఇండియన్ నేవి వార్షిక బడ్జెట్ కి సమానం అంటే వారి స్తితి ఎంత డామినేట్ గా  ఉందో అలోచించుకోవచ్చు.                                                                                          మరి కేవలం 3% లోపు ఉన్న వారి చర్చ్ లు అంత సుసంపన్నంగా ఉంటె , 76% ఉన్న హిందూ దేవాలయాల పరిస్తితి ఎలా ఉండాలి ? పోనీ ఎలా ఉందో తెలుసా? దేవాలయాల్లో పని చేసే  అర్చకులు , ఉద్యోగులు  ట్రెజరీ జీతాల కోసం రోడ్లెక్కే అంత దౌర్బాగ్య స్తితిలో ఉంది . భారత రాజ్యాంగం ప్రకారం మత సంస్తలు మీద రాజ్యం యొక్క అదికారం పరిమితంగా ఉండాలి. ఒక్క దేశ ర

గోవుల్ని కాపాడమంటే,అసలు ఆవుల్నే మాయం చేస్తున్న అధికార్లు!

                                                                           అసలు మనకు  భక్తి  లేదు! ఉంటే ఇలా మన దేవాలయ వ్యవస్త బ్రష్టు పట్టి పోదు. హిందువులంటే మంచివారు. ఉదారులు,నీతిని అవినీతిని ఒకే రీతిగా చూడగల సమ వాదులు. అందుకే ఎండోమెంట్ అధికార్లుకి హిందూ బక్తులు అంటే బొత్తిగా బెరుకు లేకుండా పోయింది కాబోలు. లేకుంటే నిన్న కాక మొన్న సింహా చలం అప్పన్న స్వామీ సన్నిదిలో "గోశాలలోని" గోవులు సుమారు వంద దాకా ఒక్క సారిగా మరణిచాయని,భక్తులు అందోళన చెందితే వాటి నివారణకు చర్యలు తీసుకుంటామని సాక్షాతు ఎండోమెంట్ మినిస్టర్,అత్యున్నత సమీక్షా సమావేశమనంతరం ప్రకటించి , నలబై ఎనిమిది గంటలు గడవక ముందే,ఆలయ అధికారి ఇంత ఘోరానికి తలపెడతాడా?    మొన్న రాత్రి సింహాచలం దేవస్తానానికి భక్తులు సమర్పించిన పన్నెండు గోవులను, ఆలయ సూపరింటెండేంట్ ప్రోత్సాహాంతో, ఏడుగురు వ్యక్తులు అక్రమంగా తరలిస్తుంటే స్తానికులు పట్టుకుని పోలిసులకు అప్పగిస్తే, ఆ సూపరింటెండేంట్ ని సస్పెండ్ చేసి విచారణకూ అదేశించారట ఆలయ కార్యనిర్వహణాది కారి. ఈ ఉదంతం  భక్తుల మనోబావాలను ఎంతగా గాయపరుస్తుందో వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఎండోమెంట్ అధి

గోవుల్ని కాపాడలేని వారు, గోవిందుని ఆస్తులు కాపాడగలరా?

                                                                                                                               ఈ రోజు మన దేవాదాయ శాఖా మంత్రి గారి స్టేట్మెంట్ చూస్తే చాల ఆశ్చర్యం వేసింది. సింహా చలం అప్పన్న సాక్షిగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యానికి, చేతకాని తనానికి గుర్తుగా దేవస్తాన గోశాల లోని  గోవులు మరణిస్తే, ఇక రాష్ట్రంలో  దేవాలయల గోశాలలో ఉన్న గోవుల్ని కాపాడడం తమ డిపార్ట్మెంట్ వల్ల కాదని తేలుస్తూ,సదరు గోవుల్ని కాపాడడానికి స్వచ్చంద సంస్తలు ముందుకు రావల్సిందిగా విజ్ణప్తి చేసారు మన రాష్ట్ర దేవాదాయ దర్మాదాయ శాఖామాత్యులు! ఈ విషయంలో నిజాన్ని నిజయీతిగా ఒప్పుకున్నందుకు మంత్రి గారికి రాష్ట్రంలోని హిందువులంతా దన్యవాదాలు తెలపాలి.    ఏదైనా సరే ఆదాయం వచ్చేవాటికి ఎండొమేంట్ డిపార్ట్మెంట్ వారు పెద్దకొడుకుల్లాగా ముందుకొస్తారు. భక్తుల ఆద్వర్యంలో సమర్దవంతంగా నిర్వహించబడుతున్న మత సంస్తలైనా సరే, చాటు మాటు రాజకీయాలను ప్రేరెపించి సంస్తలను ఎండోమెంట్ పరిదిలోకి తీసుకు వచ్చే దాక నిద్రపోరు ఘనమైన అదికార్లు. కాని అదే డిపార్ట్మెంట్ వారు ఆదాయం లేని గుళ్ళను కనీసం కన్నెత్తి చూడరు స