విదేశి "స్వస్తత ప్రార్థనలు" కు కళ్లొస్తాయి, కాళ్లొస్తాయి, కాన్సర్ కూడా తగ్గుద్ది అంటే పట్టించుకోని విజ్ణానులకు హిందూ "చేప ప్రసాదం" మీద అంత కోపం ఎందుకు?
చట్టం అనేది అన్ని కులాలకు, మతాలకు సమానం గా వర్తిస్తుంది అని మన రాజ్యాంగం చెపుతుంది. మరి మన బత్తిన సోదరులు ఇచ్చే చేప ప్రసాదం వల్ల ఉబ్బసం తగ్గడం అనేది హంబగ్ కాబట్టి ఆ కార్యక్రమానికి ప్రబుత్వ పరంగా ఏ సహాకారం ఇవ్వ రాదని కోరుతూ గత రెండు మూడెండ్ల నుండి కక్ష కట్టినట్లు "జన విజ్ణాన వేదిక వారు "చేప ప్రసాదం" పంపీణీ కార్యక్రమానికి తీవ్ర అడ్డంకులు కలిగిస్తున్నారు. దీని మీద అంద్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్తానం ఒక అభిప్రాయం వెలిబుచ్చినప్పటికి, దానిని వారు ఖాతరు చేస్తున్నట్లు...