"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?
Courtesy :From Bapu Cartoons మన పూర్వికులు చెప్పిన నీతి శాస్త్రాను సారం ఉత్తములైన భార్యా భర్తల లక్షణాలు క్రింది విదంగా ఉంటాయి . (1) శ్లో॥ కార్యేషు యోగీ, కరణేషు దక్షః రూపేచ కృష్ణః క్షమయా తు రామః భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (ఉత్తమ భర్త లక్షణాలు ) కార్యేషు యోగీ : పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. కరణేషు దక్షః కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి. రూపేచ కృష్ణః రూపంలో కృష్ణుని వలె ఉండాలి. క్షమయా తు రామః ఓర్పులో రామునిలాగా ఉండాలి. భోజ్యేషు తృప్తః భార్య వండినదాన్ని సంతృప్తిగా భుజించాలి. సుఖదుఃఖ మిత్రం సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. ఈ ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ భర్త కొనియాడబడతాడు. (2). శ్లో॥ కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,