శాస్త్రీయ వైద్యులు, చనిపోయాడు అని ప్రకటించిన వ్యక్తిలో "చలనం " ప్రసాదించి బ్రతికించిన ":భగవంతుడు "!!!

                                                                   
         

                                                మన సంప్రాదాయంలో , చనిపోయిన వ్యక్తుల పట్ల ఆచరించే క్రియలలో ముఖ్యమైనది "దింపుడు కళ్ళాలు " కార్యక్రమం . శవయాత్ర జరుగుతున్నప్పుడు , ఆ బాటలో 2 లేక మూడు సార్లు అక్కడక్కడ  శవాన్ని దించి , శవం చెవిలో బిగ్గరగా అతని పేరును ఉచ్చరిస్తారు . దీని ముఖ్య ఉద్దేస్యం ఏమిటంటే  చని పోయిన వ్యక్తిలో ఇంకా ఎక్కడైనా కోన ఊపిరి కొట్టుకుంటూ ఉంటె , తన సమీప బందువుల పిలుపుతో అది ఉత్తేజితమై , ఆ వ్యక్తీ తిరిగి బ్రతుకుతాడు అనే ఆశ . దానినే దింపుడు కళ్ళాలు ఆశ అంటారు . ఈ ఆశావహ సాంప్రాదాయం ఎంత సశాస్త్రీయ మైనదో తెలిపే ఉదంతం ఈ  మద్య వరంగల్ జిల్లా , మరిపెడ మండలం వీరారం గ్రామం లో జరిగింది . అదేమిటో చూడండి .

  వీరారం గ్రామం కి చెందిన బానోత్ ధర్మా అనే వ్యక్తీ ప్రమాద వశాత్తు బావిలో పడి ప్రాణాపాయ స్తితిలో ఉండగా , అతనిని కుటుంభ సభ్యులు , ఖమ్మం లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు అట . అక్కడి ఘనమైన శాస్త్రీయ వైద్యులు, వారి దగ్గర 40,000 పీజు గుంజి వైద్యం చేసాక , "అతను ఏమి చేసినా బ్రతకడం కష్టం,  ఆక్సిజెన్ ఆపుచేస్తే 5 నిమిషాల్లో చనిపోతాడు, ఇక ఇంటికి తీసుకు వెళ్లి పొండి " అని ఆక్సిజెన్ తీసి వేసారట . బందువులు అంతా బాదతో అతని చలన రహిత శరీరాన్ని తీసుకుని ఇంటి ముఖం పట్టారు. అక్కడ వీరారం గ్రామంలో అతని దహన క్రియల కోసం కట్టెలు కూడా సిద్దం చేసారు. ధర్మా ను తీసుకువసున్న వాహనం ఊళ్లోకి  రాగానే  , ఒక్క సారిగా ధర్మా శరీరంలో కి చలనం వచ్చి కదలడం ప్రారంబించాడు అట . దానితో నివ్వ్వేరానందాలు పొందిన అతని బందువులు మెరుగైన వైద్యం కోసం అతనిని వరంగల్ MGm హస్పిటల్ కు తరలించారు . ప్రస్తుతం ధర్మా ఆరోగ్యం కుదుట పడి మల్లీ మామూలు  మనిషి అయ్యాడు . ఒక వేళ ఆ భగవంతుడు ధర్మాలో చ ఆ టైం కి ధర్మాలో చలనం కలిగేలా చేయకపోతే , శాస్త్రీయ వైద్యుల సర్టి పికెట్ పుణ్యమా అని సజీవ దహనం చేయబడి ఉండె వాడు . ఈ విదంగా డాక్టర్లు చంపిన వ్యక్తిని బగవంతుడు బ్రతికించినట్లు అయింది .

 ఇప్పుడు చెప్పండి . శాస్త్రీయ వైద్యులు సర్టిపై చేసింది నిజమే అయితే , ధర్మా బ్రతకడం " దేవుని అద్భుతాల్లో " ఒకటి కావాలి . ఒక వేళ  శాస్త్రీయ వైద్యులు చెప్పింది అబద్ద మైతే , సంప్రాదాయ "దింపుడు కళ్ళాలు " పరిక్షా ప్రక్రియ, శాస్త్రీయ మైన విదానాల్లో ఒకటి కావాలి. ఏతా వాతా తేలేది ఏమిటంటే మన సాంప్రాదాయ విదానాలులో చాలా వాటిలో సైన్స్ ఉంది. దానిని తెలుసుకోకుండా వాటిని గుడ్డిగా వ్యతిరేకించే విజ్ఞాన వాదులం అని విర్రవీగే వారిలో సైన్స్ తప్పా సెన్స్ ఉండదు .   మూడ నమ్మకాలు అని అనుకుంటున్న వాటిలో శాస్త్రీయంగా నిరూపించే రోజులు రాబోతున్నాయి  . అందాక కులం చేత , దనం చేత విర్రవీగే వారి సరసన విజ్ఞానం చేత విర్రవీగే వారు  కూడా  చేరి ఆనందించనివ్వండి .మరింత సమాచారం కొరకు క్రింది వీడియోను క్లిక్ చేయండి .

                     

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.