రామాయణ కాలం లో స్త్రీ కి దొరికిన రక్షణ, ఆధునిక కాలం లో ఉందా?
అదునిక నాగరికతకు మూలమయిన ప్రాశ్చ్యాత్య సంస్క్రుతి మీద మోజున్నవారు, మాట మాటకు మన సంస్క్రుతి తప్పు పట్టాలని చూసే విదేసి బావజాల సమర్దకులకు, స్త్రీల ఆదునిక స్వేచా వాదం గురీంచి గొప్పలు పొయే వారికి ప్రస్తుతం స్త్రీల మీద జరుగుతున్న లైంగిక దాడులుకు ఆదునిక సంస్క్రుతి ఒక కారణం గా సాంప్రదయవాదులు పేర్కొనటం రుచించటం లేదు. అందుకే సందు దొరికితే చాలు మన సాంప్రాదాయ సంస్క్రుతి మూలలను ప్రశ్నించడమే కాక అపహాస్యం చెయ్యాలని చూస్తున్నారు.
నిన్న ఒక మార్కీస్ట్ పండితుడు మాట్లాడుతూ, రామాయణం లో సీతను అడవులకు పంపడం ఏమి సంస్క్రుతి అంటూ నోరు పారేసుకోవడమే కాక, మన సంస్క్రుతిని ప్రశ్నించాల్సిందే అని అన్నాడు.ఈ విషయమ్ లో నాదొకటే ప్రశ్న నేటి స్త్రీలను దుస్తులు లేకుండా ప్రదర్సిస్తూ, సొమ్ము చెసుకుంటుంటే నిరోదించలేని మీరు రామాయణం కాలం నాటి సంస్క్రుతిని గూర్చి మాట్లాడే నైతిక అర్హత ఉందా? ముందు కళ్లెదుట జరుగుతున్న దానిని వదలి వెనుకటి దాని గురించి ఏడ్వడం ఎందుకు?
అసలు రామయణ కాలం నాడు స్త్రీలకు దొరికిన రక్షణ ఈ కాలంలో దొరుకుతుందా? ఆ నాడు సీతమ్మ తల్లిని అడవిలో వదిలినా వాల్మీకి కాపాడి రక్షణ ఇచ్చాడు. ఈ కాలం లొ మొన్న డిల్లీలో, జన సమర్దం ఉన్న కాంక్రీట్ అరణ్యంలో రేప్ కు గురి కాబడిన అమ్మాయిని వేడుక చూసినట్టు చూసారే కాని బట్టలు లేకుండా చలికి వణుకుతున్న ఆ అబాగ్యురాలికి కనీసం ఒక గుడ్డ ముక్క కప్పడానికి చేతులు రాని జనమ్ ఉన్న మన సమాజం ఒక సమాజమా? మనం మనుషులు మా? ఈ అదునిక సంస్క్రుతి గురించేనా చంకలు ఎగరేస్తుంది? చీ,చీ.....అదునికులమని చెప్పుకునే మనదీ ఒక బ్రతుకేనా....
(6/1/ 2013 Post Republished.)
Comments
Post a Comment