R.K న్యూస్ చానల్ విషయం లో కూడా "మనవు" చెప్పిందే నిజమయింది!.

                                                             
    
నేను మొన్న 21 వ తారీఖున ఇదే బ్లాగులో R.K  న్యూస్ చానల్ వారి ఊదరగొట్టే ప్రసారాలను గూర్చి ఒక విషయం చెప్పడం జరిగింది. అదే నిజమని రుజువు చేసేలా నిన్న A.B.N  చానల్ వారు సదరు R.K  న్యూస్ చానల్  వారీ బ్లాక్మెయిలింగ్ ప్రసారాల తీరును విమర్శిస్తూ "చ.. చ.. చానల్  అనే పేరుతో ప్రసారం చేసిన కార్యక్రమం ద్వారా బహిర్గతమైంది.

  నేను R.K  న్యూస్ చానల్ గురించి "న్యూస్ చానల్  వారు గత 3 రోజులుగా , ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఏల్చూరి గారి గురించి ఒక కదనం ప్రసారం చేస్తున్నారు. ఒక వేళా వైద్యానికి వచ్చే స్త్రీలతో , వైద్యశాలలో అయన అసబ్యంగా ప్రవర్తిస్తుంటే తగిన సాక్ష్యాదారాలతో చానల్ వారు సంబండిత వైద్య విభాగ అధికారులకు తెలియ చేసి అతని గుర్తింపు సర్టిపికేట్ ను రద్దు చేయించవచ్చు. అంతే కానీ వరుసగా చెప్పిందే చెప్పి ఊదరగొట్టడం లో అసలు ఉద్దేస్యం చానల్ రేటింగ్ కోసమైనా కావాలి, లేదా అది ఆపడానికి తగిన ప్రతిపలం కోసం ఆశిస్తూ అయినా ఉండాలి." అని చెప్పడం జరిగింది. పూర్తీ టపా కోసం ఈ  లింక్ ను క్లిక్ చేసి చూడవచ్చు (ఆ ఆయుర్వేద వైద్యుడి చేతిలో మోసపోయిన R.K న్యూస్ చానల్ సంబందిత మహిళలు ఎవరు?http://ssmanavu.blogspot.in/2013/12/rk.html). 

      ఇదే విషయం మీద నిన్న A.B.N  చానల్ వారు ప్రసారం చేసిన కార్యక్రమం చూసాకా మీడీయాని అడ్డం బెట్టుకుని బ్లాక్మెయింలింగ్ లకు పాల్పడుతూ ,ఆ చానల్ వారు ఎంత అడ్డగోలు పనులు చేస్తున్నారో అర్దమవుతుంది. సమాజంలో తప్పులు చేసే వారు ఉండవచ్చు. కానీ ఆ తప్పులను ఎత్తి  చూపుతూ ప్రజలను , అధికారులను అలెర్ట్ చెయ్యడం మీడియాకు  పద్దతి.దానీ కోసం సంబందిత వ్యక్తులను వివరణ కోరీ దానిని కూడా  ప్రజలకు తెలియ చేయాల్సిన బాద్యత మీడీయా మీద ఉంది. ఎవరైనా నేరాలు చేస్తే ,దాని మీద చర్యలు తీసుకోవడానికి తగిన విదానాలు ఉన్నాయి. అంతే కానీ మీడియా చేతిలో ఉంది కదా అని, పద్దతులు పాటించకుండా , ఇతరుల స్వేచ్చను భంగపరుస్తూ ప్రైవేట్ ప్రాంతాలు లోకి సహితం ప్రవేశించడం,వారిని డబ్బు కోసం బ్లాక్మెయిల్ చెయ్యడం కోసం ఏవో ఊదరగొట్టే ప్రోమోలు ప్రసారాలు చెయ్యడం, అవతలి వారు బెదిరిపోయో, లేక అనవసర గొడవతో తమ వ్యాపారాలు లేక వృత్తులు దెబ్బ తీసుకోవడం ఎందుకులే అని , ఎంతో కొంత ముట్ట చెప్పడం , దానితో మరింత రెచ్చి పోయి అదే విదానం తమ వ్రుత్తి గా మార్చుకోవడం అనేది ఏ మాత్రం క్షమించ రానిది. సమాజానికి తప్పులు చేసే వారికంటే కూడా  , ఆ తప్పు లను ఎత్తి చూపుతూ ,బ్లాక్మెయిలింగ్ చేస్తూ డబ్బులు గుంజేవారు  మరింత ప్రమాదకారులు .

   సాదారణంగా మీడియాతో పెట్టుకోవాలంటే ఒక స్తాయిలో ఉన్న వారికైనా సాద్యం కాదు. చట్ట పరంగా చర్యలు తీసుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. పరువు మర్యాదలు, బ్రాండ్ ఇమేజ్ గురించి ఆలోచించే వారు సాద్యమైనంత వరకు మీడీయాతో గొడవ పెట్టుకోవడానికి ఇష్ట పడరు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్లు ,ఒక చానల్ వారు చేస్తున్న తప్పులను ఎదుర్కోవాలంటే మరొక చానల్ సహకారం అవసరం. అప్పుడే బాదితులు సమగ్రంగా విషయం ప్రజలు ముందు ఉంచగలుగుతారు. లేకుంటే అంతా వన్ సైడ్ హియరింగ్ అవుతుంది. ఈ  విషయం లో చొరవ తీసుకుని , తోటీ చానల్  వారు చేస్తున్న తప్పులను ఖండిస్తో , బాదితులకు సహకరిస్తున్న ABN  చానల్ వారిని అభినందించక తప్పదు.

  R.K  న్యూస్ చానల్ అక్రమాలు గురించి ABN  చానల్ లో  ప్రసారం అయిన "చ.. చ.. చానల్ " కార్యక్రమంని  ఈ  క్రింది వీడియో  లింక్ లో చూడండి .

 
                         

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన