పాతిక మందిలో లేని సమైక్యతా ,5 కోట్ల మందిలో ఉందనడం ఆత్మ వంచన కాదా ?

                                                           


ఇన్నాళ్ళు సీమాంద్రా కాంగ్రెస్ వారందరూ సమైఖ్య వాదులని యావత్  భారత దేశ ప్రజలను  తమ మోసపు మాటలతో మబ్య పెడుతూ వస్తున్న , సీమాంద్రా కాంగ్రెస్ నాయకుల భండారం , నిన్నట్టి అవిశ్వాస తీర్మాన నోటిసుతో బట్ట బయలు అయింది. భారత పార్లమెంటులో సిమాంద్రా ప్రాంతం నుంఛి 25 పార్లమెంటు సీట్లు ఉంటే, తెలంగాణా నుంచి 17 సీట్లు ఉన్నాయి. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనేది కేవలం రాజకీయ పరమైనది. దానికి ప్రజల మనోబావాలు తో పని లేదు . ఒకవేళా మెజార్టీ లేదా నిర్దిష్ట ప్రమాణాలు  తో కూడిన   ప్రజల మనోబావాలు పరిగణనలోకి తీసుకోవాలి అని రాజ్యాంగం లో పొందుపరచబడి ఉన్నట్లైతే , ఈ  రోజు తెలుగు ప్రజలు కు ఇన్నీ డ్రామాలు చూడాల్సిన అగత్యం ఉండేది కాదు. కానీ ఇటువంటి రోజు వస్తుందని ఆ నాటి రాజ్యాంగ నిర్మాతలు ఆలోచించి ఉండరు. ఈ  నాటి రాజ్యాంగ నిర్మాతలకు అంత ఆలోచనా చేసే బుద్దితో పాటు తీరిక కూడా లేదు. అందుకే సినిమాల్లో ఐటం  సాంగ్ లాగ తెలంగాణా అంశం కేంద్ర మంత్రి వర్గ తీర్మానాల్లో "టేబుల్ ఐటం " అయింది. దీనితో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కేవలం సోనియా గాందీగారి "బర్ట్ డే గిప్ట్" లాంటిదే తప్పా , అంతకు మించిన ప్రాదాన్యత కాంగ్రెస్ సర్కార్ ఇవ్వటం లేదని అర్దం అవుతుంది. ఇస్తే ఏ నాడో రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సీమాంద్రా M.P  లను పార్టి నుండి బహిష్కరించేవారే! అలా చెయ్యకుండా ఇప్పుడు తమ పీటం క్రిందకు నీళ్లు తెచ్చుకునే పరిస్తితి కల్పించారు.

   ఇకపోతే 'మేం సీమాంద్రా ప్రజలు తరపున పోరాడుతున్న  నాయకులు అందరు సమైక్యతా అంద్రాకు కట్టు బడి ఉన్నాం' అని సీమాంద్రా నాయకులు ఇన్నాళ్ళు దేశం లోని ప్రజలను, రాజకీయ పార్టీలను మబ్యపెడుతో వచ్చారు. కానీ నిన్న లోక్సభ స్పీకర్ కు అవిశ్వాస తీర్మానం నోటిస్ ఇచ్చిన వారు మూడు పార్టీలనుంది మొత్తం కలిపి 13 మందే. అంటే సీమాంద్రాలో  సగం మంది M.P  లు కేంద్ర మంత్రులతో సహా , రాష్ట్ర సమైక్యతకు కట్టుబడి లేరని, సోనియా గాంది గారి అభీష్టానికే వారు తల ఒగ్గుతున్నారని అర్దం అవుతుంది. మరి వారిలోనే సమక్యత లేనపుడు తెలంగాణా నాయకులను ఆడి పోసుకుంటూ , వారి దిష్టి బొమ్మలను తగులబెట్టే నైతిక అర్హత సీమాంద్రా నాయకులకు కానీ, ప్రజలకు కానీ ఎక్కడుంది? సాక్షాతూ చిరంజీవి గారు, P.C.C  అద్యక్షులు బొత్స సత్యనారాయణ గారు అవిశ్వాసం పెట్టడం తప్పు అని పబ్లిక్ గా స్టేట్మెంట్ లు ఇచ్చాకా వారి మద్దతు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు లేదని తెలంగాణా ప్రజలు ఎలా నమ్ముతారు? ఆ విదంగా తెలంగాణా లోని 17మంది M.P  లు సీమాంద్రాలోని 12 మండి  M.P.  లు కలసి మొత్తం 29 మంది M.P  లు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉంటే , తమ రాజకీయ పైరవీలు, డబ్బుతో దేశం లోని ఇతర పార్టీల M.P  లను ప్రబావితం చేసి కాంగ్రెస్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్  ద్వారా , అవసరమైతే ప్రబుత్వాన్ని కూల్చివేసి అయినా రాష్ట్ర విబజన ఆపుచేస్తే దానివలన సీమాంద్రా ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటే అంత కంటే అవివేకం మరొకటి ఉండదు.

 మంచో, చెడో , సీమాంద్రా నాయకుల ద్వంద విదానాలు వల్ల  కావచ్చు, తెలంగాణా ఏర్పాటు ఖాయమైపోయింది . ఎవరికైనా పెడతామంటే ఆశ , కొడతామంటే బయం! ఇన్నాల్లు తెలంగాణా ప్రజలు కోరుకున్నది వారికి దక్కుతుంటే , ఇప్పుడు ఏ రూపం లో దానిని ఆపినా అది రెండు ప్రాంతాల ప్రజల  మద్య ఉన్న వైష్యమాలను శాస్వతం చెస్తాయి. సమైక్యతా అనేది తెలంగాణా ప్రజలనుండి వస్తే సక్సెస్ అవుతుంది తప్ప , సీమాంద్రా ప్రజలు అందరూ డిమాండ్ చేసినా అది సక్సెస్ ఎలా అవుతుంది? రాష్ట్ర విభజనను ఆపి తెలంగాణా లో తుపాకుల నీడలో తెలంగాణా ప్రజలు బ్రతకాలని సీమాంద్రా నాయకులు కోరుక్లుంటున్నారా? ఎందుకు ఇటువంటి మతి లేని రాజకీయాలు చేస్తున్నారు? మొదట అంగీకార పత్రాలు ఇచ్చి తెలంగాణా కు సై  అన్న వారే , ఇప్పుడు ప్రబుత్వాలను పడగొట్టడానికి సై  అంటుంటే , తెలంగాణా ప్రజల ద్రుష్టిలో వారు ద్రోహులుగానే మిగిలిపోతారు. ఒకవేళ అదే దైవ నిర్ణయం అయితే కానివ్వండి. తెలుగుప్రజలు అందరూ అన్నదమ్ములు ఉండాలని ఆశించేవారు ఇలాంటి పనులు చేస్తారని తెలంగాణా లోని సీమాంద్రా సెటిలర్లు కూడా ఊహించరు .

    ఇప్పటికైనా తెలుగు  మేదావులు సరి అయిన ఆలోచన చేసి ఇరు ప్రాంత ప్రజల మనో బావాలను గాయపరచని విదంగా రాజకీయ పరిష్కారం కనుగొంటే మంచిది.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!