ఆమ్ ఆద్మీకి ఒక చొట అంటితే , కేజ్రీవాల్ లాంటి వారికి మూడు చోట్ల అంటుద్దట !

                                                           


పదిమందిలోకి వచ్చాక పట్టు విడుపుల దోరణితో వ్యవహరించాలి. అలా పట్టు విడుపులు లేకుండా మంకు పట్టు కు పోయే వాడు ఏమి సాదించలేడు .అందుకే మన పెద్దలు ఒక మాట అంటూ ఉంటుంటారు. తెలివిలేనోడికి ఒక చోట అంటితే అతి తెలివి గలవాడికి మూడు  చోట్ల అంటుద్ది అని. ఈ  సూత్రం కేజ్రివాల్ కి వర్తిస్తుందా అని అనిపిస్తుంది అతని వ్యవహార శైలి చూస్తుంటే!

  డిల్లీ రాష్ట్ర ఎన్నికలలో ప్రజలు ఎవరికీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వక పోవడం ఒక గందరగోళ పరిస్తితిని సృష్టిస్తుంది . తాము కేజ్రీవాల్ కి మద్దతు ఇవ్వమని కాంగ్రెస్ అంటుంటుటే , తాము అటు కాంగ్రెస్ , ఇటు B.J.P  లకు సమాన దూరం లో ఉంటామని ఆంఆద్మీ పార్టీ అదినేత కేజ్రీవాల్ అంటున్నారు. ఈ దోరణీ గమనించి తాము ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దంగా లేమని అతి పెద్ద పార్టిగా ఆవిర్భవించిన B.J.P  అంటుంది. అంటే గవర్నర్ పాలన లో డిల్లీ ఉండబోతుందబ్న్న మాట! మరి డిల్లీ ప్రజలు తీర్పు దిక్కుమాలినదవుతుందా?
  కేజ్రీవాల్ గారి ఆదర్శం అవినీతి నిర్మూలన . అటు కాంగ్రెస్ కానీ, ఇటు B.J.P  కానీ రెండో ఒక తాను లో ముక్కలే అని అయన గారి అభిప్రాయం. అందుకే ఆ ఇద్దరితో కలిసే పనిచేసేదే లేదంటునాడు . మరి ప్రజలు ఏమో ఈయన పార్టీ కంటే ఎక్కువ సీట్లు B.J.P  కి కట్ట బెట్టారు. దేశంలో ఈయన , ఈయన పార్టీ తప్పా తక్కిన వారంతా అవినీతి పరులే అనుకుంటే మరి ప్రజల తీర్పును ఎలా అర్దం చేసుకోవాలి. ప్రజలు అదికార కాంగ్రెస్ విదానాలు నచ్చక ప్రత్యామ్నాయం ఎన్నుకున్నారు అనేది స్పష్టం అవుతుంది. మరి వారి తీర్పును మన్నించి B.J.P  ,ఆంఆద్మీ పార్టీలు కలసి పని చెయ్య వలసిన  అవసరం లేదా?

  ప్రపంచ ఆర్దిక,సామాజిక  తత్వవేత మార్క్స్ అంతటి వారే శత్రువు తో కలసి పని చెయ్యడం అనివార్యం అంటారు. ప్రాదమిక  శత్రువు(బడా బూర్జువ)ను ను ఎదుర్కునే విదానం లో చిన్న శత్రువుల(పెట్టీ బూర్జువ) తో కలసి పనిచెయ్యాలని ఒక తెలివైన పద్దతి చెప్పారు.కాబట్టి మహా అవినితివంతమైన కాంగ్రెస్ ను దుంప నాశనం చెయ్యడానికి , వారికంటే నయమయిన B.J.P  వారితో కలసి పని చెయ్యడం కార్యసాదకుల  లక్షణం . మరి అలాంటి పద్దతిలో కూడా  తానూ పని చెయ్యను అని కేజ్రీవాల్ అనుకుంటే డిల్లీ ప్రజలకు మల్లీ ఎన్నికలు తప్పవు! ఈ  లోపు ఎదో ఒక ఆరోపణలో కేజ్రీవాల్ ను ప్రతిపక్షం వారు ఇరికించకా మానరు . అ దెబ్బ తో ప్రజ లకు అయన పాలనా  పటుత్వం మిద ప్రజలకు నమ్మకం సన్నగిల్లితే, లేదూ  BJ P వారే కేంద్రం లోకి అదికారం లోకి వస్తే , ఇప్పుడొచ్చినన్ని సీట్లు తర్వాతి ఎలెక్షన్లలో "ఆంఆద్మీ పార్టీకి రావు. అప్పుడు ఆ పార్టీ  చరిత్ర కూడా ఒక సామెత అవుతుంది. అదే " ఆమ్ ఆద్మీకి ఒక చొట అంటితే , కేజ్రీవాల్ లాంటి వారికి మూడు  చోట్ల అంటుద్దట ! ".

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం