వందమంది దేవయాని లను వివస్త్ర లను చేసినా , అమెరికా అమెరికాయే, కాంట్రాక్ట్ కాంట్రాక్టే !
దేవయాని ! మన పురాణ గాధలలోని రాక్షస గురువులు అయిన శుక్రాచార్యుల వారీ కుమార్తె పేరు అది. ఆ పేరును ముంబాయికి చేందిన I.A.S ఆపిసర్ గారైన ఉత్తమ్ కోబ్రగాదె గారు తన కుమార్తెకు పెట్టుకున్నారు. ఆ అమ్మాయే ఇప్పుడు బారత, అమెరికా మద్య చెలరేగిన దౌత్య సంబందాల వివాదాలకు కేంద్ర బిందువు.
దేవయాని కోబ్రగాదె U.S లోని న్యూ యార్క్ లో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో డిప్యూటి కాన్స్యుల్ జనరల్ గా పని చేస్తుంది. దేవయానీ పుట్టి , పెరిగిందీ ముంబై లోనే . మరాఠీ తో పాటూ ఆమె ఇంగ్లీష్, హిందీ , జర్మనీ బాషలలో అసామాన్యమైన పట్తుందని అంటారు . సివిల్స్ రాసి ఐఎఎఫ్ అధికారిగా ఆమె భాద్యతలు చేపట్టింది 1999 లో . పాకిస్తాన్ , ఇటలీ , జర్మనీ దేశాల్లోని భారత రాయబార కేంద్రాల్లో పనిచేసారు . . ఐఎఫ్ఎస్ అధికారిణి అయిన దేవయాని అమెరికాలోని భారత కాన్సులేట్ లో సహాయ అధికారి. ఆమెకు వచ్చే జీతం భారతీయ కరెన్సీలో సుమారు 4 లక్షల రూపాయలు. తన ఇంట్లో పనులు చూసుకోడానికి ఆయాగా నియమించుకున్న మహిళకు ఆమె ఇవ్వాల్సిన జీతం అమెరికన్ నిబంధనల ప్రకారం అయితే అక్షరాలా 2.80 లక్షల రూపాయలు. అంటే దాదాపు మూడొంతుల జీతాన్ని ఆమె తన పనిమనిషికే ఇచ్చేయాలి. అలా ఇచ్చేస్తే ఇక ఆమె దైనందిన జీవితానికి మిగిలేది ఏమీ ఉండదు. అందుకే దాదాపుగా అమెరికాలో ఉండేవాళ్లు ఎవరైనా సరే పనిమనుషుల విషయంలో అగ్రిమెంటులో చూపించే అంకె ఒకటైతే వాస్తవంగా ఇచ్చేది వేరే ఉంటుంది. ఇది అక్కడ సర్వ సాధారణం కూడా. కానీ, దేవయాని ఇంట్లో పనిమనిషిగా వెళ్లిన మహిళ తనకు డబ్బులు సరిపోవడం లేదని, వారాంతపు సెలవుల్లో వేరే ఉద్యోగం చేసుకుంటానని చెప్పింది. అందుకు వీసా నిబంధనలు అంగీకరించవని, ఇబ్బంది అవుతుందని దేవయాని చెప్పగా, ఆమె చెప్పా పెట్టకుండా ఇంటినుంచి వెళ్లిపోయి, నేరుగా న్యాయవాదులను సంప్రదించి కేసు పెట్టింది. అయితే అప్పటికే ఆమె వ్యవహార శైలితో విసిగిపోయిన దేవయాని, ఢిల్లీలో ఆమెపై కేసు పెట్టగా.. అధికారులు సదరు పనిమనిషిని వెనక్కి వచ్చేయాల్సిందిగా ఆదేశించారు.పని మనిషిపై డిల్లీ హై కోర్టు ఒక ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇచ్చింది కూడా . దానీ ప్రకారం బారత జాతీయతకు చేందిన సంగీతా రిచర్డ్స్ తన పని కాంట్రాక్ట్ గురించి విదేశాలలో ఏ కోర్టుల్లోను దేవయాని మీద కేసులు వేయరాదు. కానీ అమెరికన్ గవర్నమెంట్ కావాలనే ఈ పనిమనిషి వెనుక ఉండి, ఆమెను భారత చట్టాల నుండి రక్షించడానికి సర్వ విదాల ప్రయత్నిస్తుంది.
దానీ కోసం అమెరికాలో ఉండే అందరు చేసే పనిమనుషుల అగ్రిమెంట్ లో ఉల్లంగనలు, అలాగే పని మనిషి వీసా కోసం ఏదో తప్పుడు అపిడవిట్లు ఇచ్చిందన్న కుంటి సాకుతో దేవయాని ని టెక్నికల్ గా అంటే తన పిల్లలు ను స్కూల్ వద్ద దింపదానికి వచ్చిన సమయం చూసి అక్కడ అరెస్ట్ చేసింది. ఆపీసులో అరెస్ట్ చెయ్యడానికి నిబందనలు అడ్డు వస్తాయి అనే ఉద్దేశ్యం తోనే అమెరికా అధికారులు ఆ పని చేసారు. ఆ తర్వాత ఆరుగంటల పాటు దేవయానీ ని మాదక ద్రవ్యాల స్మగ్లర్ల తో పాటు ఉంచి , వారిని శొదించినటే ఆమె ను వివస్త్రను చేసి అంగాంగ కుహరాలో వెతికారట. దానితో పని మనిషిని పెట్టుకున్న నేరానికి ఆ భారతీయ మహిళ మాన మర్యాదలు కుంచించుకు పోయి, ఆమె ప్రాణం ఎంతో విలవిలలాడి పోయింది. దీని మీద బారత జాతీ ఒక్క సారిగా బగ్గుమనే సరికి మన ప్రభుత్వం ఉలికిపడి లేచి అమెరికా విదానాన్ని తీవ్రంగా ఖండిస్తూ , తక్షణం దేవయాని మీద కేసులు ఉపసంహరించుకుని , క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అలగే ఐ దేశం లోని అమెరికా దౌత్యాదికారులకు ఇస్తున్న ప్రాదాన్యతలు తగ్గించింది. ఆ దెబ్బతో అమెరికా దారికొస్తుంది అనుకుంది.
కానీ ప్రపంచానికే అన్న అని విర్రవీగుతున్న అమెరికా, ఇండియా డిమాండ్ ను గడ్డి పోచ క్రింద లెక్క కట్టింది. దేవయాని మీద ఎట్టి పరిస్తితుల్లోను కేసులు ఉపసంహరీహించమని , క్షమాపణ చెప్పే పనే లేదని తెగేసి చెప్పింది. ఇలా భారత జాతీయతకు చెందిన పని మనిషి హక్కుల కోసం బారత్ తో అమెరికా వివాదాలు తెచ్చుకుంటుంది అనుకుంటే పొరపాటే . తన శత్రువులను మట్టు పెట్టడానికి , ఇతర దేశాల సార్వబౌమాది పత్యాన్ని సైతం దిక్కరించే అమెరికాకు , చట్టాల పట్ల గౌరవం ఉంటుందనుకోవడం పొరపాటే. అయితే దీనివెనుక ఏవో గూడాచార సంబందమైన విషయం ఉందని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఆ పని మనిసి అత్తా మామలు U.S ఎంబసీలోనే పని చేస్తారట. ఆ అత్తామామలు, భర్త ఒత్తిడిమేరకు U.S పోలిసులు ఇండియన్ మహీళాదీ కారి మీద ఈ దురాగతాలకు ఒడిగట్టినట్లు తెలుస్తుంది. అంటే తమ ఉద్యోగుల బందువును రక్షించడానికి బారత్ తో దౌత్య వివాదాలకు సైతం బరి తెగించారు అమెరికా అధికారులు.చివరకు తాత్కాలిక వీసా ఇచ్చి ఆ పనిమనిషి కుటుంబాన్ని అమెరికాకు తరలించింది. మరీ దీనికి భారత దేశం స్పందన ఎలా ఉండాలి?
ఏదో ప్రజలు ఉద్వేగాలు చల్లబరచడానికి కేంద్ర సర్కార్ డాంబికం ప్రదర్శించింది తప్ప, అమెరికాకు జాతి నిరసనను పూర్తీ స్తాయిలో చూపడానికి ఇష్టపడుతున్నట్లు లేదు. ఉంటే నిన్న ప్రదానమంత్రి గారీ ఆద్వర్యంలో సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినేట్ కమిటీ సీ-1302 విమానాల కొనుగోళ్ళు కోసం 4 వేల కోట్లు విలువ చేసే కాంట్రాక్ట్ ను అమెరికాకు ఇస్తుందా? ఎంత సిగ్గు చేటు! కనీసం తమ దౌత్య వివాదాన్ని చూపించి అయినా కొన్నీ రోజులు ఆగలేక పోయిందా? అమెరికా లాంటి అగ్ర దేశాల పొగరు అణచడానికి మన చేతిలో ఉన్న బలమైన ఆయుదం "కన్స్యూమరిజం" . అమెరికా కంపెనీల కు చెందిన ఉత్పత్తులను 120 కోట్ల జనాబా ఉన్న భారత్ లంటి దేశం నిరాకరిస్తే అది ఖచ్చితంగా ప్రబావం చూపుతుంది.ఆ దెబ్బకి ఎలా అమెరికా దిగిరాదో చూడవచ్చు. ఆ దిశగా ఆలోచించవలసిన ప్రభుత్వాలు, అది మానేసి తగుడునమా అని , వివాదం ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి 4 వేళ కోట్ల రక్షణ కాంట్రాక్ట్ ని ఉపయోగించుకోగ పోగా ,అమెరికాకు బేషరత్ గా కట్టబెట్టడానికి కారణం అందులో కొంతమందికి వచ్చే కమీషన్ల కకుర్తా? స్వలింగ సంపర్కుల హక్కుల కోసం ఆరాటపడే ప్రభుత్వ పెద్దలకు జాతి పరువు విదేశాలలో తీస్తుంటే ఏమనిపించటం లేదా? విదేశి చట్టాలను స్వదేశియుఅకు వర్తింపచేస్తుంటే వాటిని నిరోదించడానికి అన్నీ రకాల అవకాశాలను వినియొగించుకోవలసిన అవసరం లేదా? అమెరికా దురంహాకార ప్రదర్శన ఇదే మొదటిసారి కాదు. మన మాజీ రాష్ట్రపతి గారినే అవమానించిన ఘనత వారిది. అటువంటి వారికి భారత్ అంటే ఏమిటో చెప్పవలసిన సమయం ఆసన్నమయింది.
లేదూ , ఇవ్వన్నీ మనకు అనవసరం, వందమంది దేవయాని లను వివస్త్ర లను చేసినా , అమెరికా అమెరికాయే, కాంట్రాక్ట్ కాంట్రాక్టే అనుకుంటే మీ నేత్రుత్వాలు జాతికి అవసరమా,కాదా అనేది భారత ప్రజలు నిర్ణయించే గడువు దగ్గర్లోనే ఉందనేది ప్రబుత్వ పెద్దలు మరచి పోరాదు.
Comments
Post a Comment