కోట్ల మంది ప్రజల కోరికను కాదని , అసద్దుద్దిన్ గారి కోరికను తీర్చు తుందా పిరోజ్ గాందీ గారి కోడలు!?
ఎంకి పెండ్లి సుబ్బి చావు కొచ్చిందట. అలా ఉంది ఈ పిరోజ్ గాందీ గారో కోడలు వ్యవహరం. ఆవిడ గారీ పుట్టిన రోజు బహుమతిగా తెలంగాణా ఇచ్చేద్దామనే తలంపుతోనే హడావుడిగా అంత పెద్ద వ్యవహారాన్ని కూడా ఒక "టేబుల్ ఐటం " గా మార్చివేసి కూరలు పంపకం లాగా పంచి వెస్తుంది.
అసలు రాయల తెలంగాణా ఎవరు అడిగారు? మొదట్నుంచి ఈ ప్రతిపాదన చేస్తూ వచ్చింది హైద్రాబాద్లో తప్పా మరెక్కడా లేని MIM పార్టీ అద్యక్షులు అసదుద్దీన్ ఒవైసీ . ఆ తర్వాత ఈ ప్రతిపాదన తమ ప్రాంతానికి లాభిస్తుందని సీమ లోని కర్నూల్, అనంతపురం నాయకులు 2 వ ఆప్షన్ గా డిమాండ్ చెయ్యడం ప్రారం బించారు. ఇక కేంద్రం లోని కోంతమంది పెద్దలు అయితే , ఎవరు రాష్ట్ర విబజన గురించి ప్రస్తావించినా "రాయల తెలంగాణా" గురించే అభిప్రాయాలు అడగటం మొదలు పెట్టారు. అటు సీమాంద్రా వారు కానీ, ఇటు తెలంగాణా వారు కానీ రాయల తెలంగాణా గురించి కలలోనైనా ఊహించని పరిణామం 4 నెలల క్రితం వరకు. మరి సుమారు 9 కోట్ల మంది ప్రజలు కోరుకొని దానిని , ఒక్క M.P కోరుకున్న దానిని, ప్రజల మీద బలవంతంగా రుద్దడం వెనుకాల ఉన్న మతలబ్ ఏమిటీ? అసదుద్దీన్ గారితో ప్రత్యేకంగా 45 నిముషాల వరకు సోనియమ్మా ఏమని చర్చింది? అయన కోరిక తీర్చడం లో ఎందుకంత ఉత్సుకత చూపుతుంది? ఇవ్వన్నీ పై వాడికే ఎరుక?
ఏది ఏమైనా తెలంగాణా ప్రజలు కోరుకున్నది రాజకీయ ప్రాతిపదికగా విభజన . కానీ సోనియా దళం చేస్తుంది మాత్రం మత పరమైన లబ్ది కోసం చేస్తున్న విభజన. ఈ విబజన ను ఇటు తెలంగాణా వారు కానీ అటు సీమాంద్రా వారు కానీ ఒప్పుకోరు గాక ఒప్పుకోరు. B.J.P కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందు వలన సోనియా బిల్లు పార్లమెంటు వరకు పోయినా అక్కడ నెగ్గటం అనుమానమే మరి!
Comments
Post a Comment