దిగ్విజయి సింగ్ గారు తన "తోలి రేయి" కోసం కూడా ఇంత తొందర చేసి ఉండరు!

                                                           

పాపం ఆ పెద్దమనిషికి తెలుగు వారు అంటే ఎంత ప్రేమ! ఎంత అపేక్ష! అందుకే తెలుగు వారిని రెండు రాష్ట్రాల ప్రజలుగా చూడాలని, ఈ  మద్య ప్రదేశ్  వీరుడు కంకణం కట్టుకుని , ఆ పనిలో యమ బిజీగా ఉన్నట్లు కనిపిస్తుంది .

  ఈ  రోజునే ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యయి. నిన్ననే రాష్ట్రపతి గారు తెలంగాణా విబజన ముసాయిదా  బిల్లును సంతకం చేసి రాష్ట్ర అసెంబ్లీకి పంపారు.దానిమీద అభిప్రాయాలూ పంపడానికి 40 రోజులు గడువు ఇచ్చారు. ఈ  లోపులో అసెంబ్లి అభిప్రాయాన్ని పంపవలసి ఉంటుంది . ఒక వేలా సీమాంద్ర నాయకులు ఏదైనా మతలబ్ చేసి కిరి కిరి పెడదామనుకున్నా, 40 రోజుల తర్వాత ముసాయిదా బిల్లు అసెంబ్లీ నుండి పంపినా ,  పంపకున్నా పార్లమెంట్ బిల్లును ఆమోదించవచ్చు. మరి ఇంత అధికారం కలిగిఉండి కూడా దిగ్విజయ్ సింగ్ గారు ఎందుకు నానా హంగామా చేస్తున్నాడో అర్దం కావటం లేదు.

 ఈ  రోజు ప్రత్యేక విమానం లో బిల్లు ప్రతులను స్వయంగా హోంశాఖ కార్యదర్శి తీసుకు రావడం, దిగ్విజయ్ సింగ్ గారు ఈ  రోజే హైదరాబాద్ వచ్చి , ఈ  రోజే హైదరాబాద్ కు చేరిన బిల్లు గడువు 40 రోజులు ఉన్నపటికి, వెంటనే ఆమోదం తెలిపి పార్లమెంటుకు పంపాలని ముఖ్య మంత్రిని , గవర్నర్ కు సూచించడం చూస్తుంటే , ఈయన గారి అతి ఉత్సాహం కూడా  రేపు సుప్రీం కోర్టు దాక వెళ్లి , చివరకు  రాష్ట్ర విబజన ఆలస్యమయ్యే ప్రమాదం కూడా  లేక పోలెదు అని పిస్తుంది . రాష్ట్ర విబజన అనేది అత్యంత ప్రదానమయింది కాబట్టి, దాని మీద అభిప్రాయం తెలిపే అవకాశం ఏ ఒక్క M.L.A కి ఇవ్వకున్నా, అది ప్రజా ప్రతినిదుల హక్కులకు బంగం కలిగిందని టెక్నికల్  గా  రేపు ఎవరైనా కోర్టు తలుపు తట్టవచ్చు. మరి ఇలాంటి పరిస్తితిలో ఈ  మద్య ప్రదేశ్ నాయకుడు  ఎందుకు ఇంత అతి ఉత్సాహం చూపడం !

ఈయన గారి ఆత్రం చూస్తుంటే తెలంగాణా రాష్ట్రం కొరకు తెలంగాణా ప్రజలు కంటే ఈయనకే తొందర ఎక్కువుగా ఉన్నట్లుంది. ఈయన గారి తోలి రాత్రి కార్యం కోసం కూడా  ఇంత ఆరాటపడి ఉండక పోవచ్చు. నిజంగా తెలంగాణా ప్రజలు అంటే ఈయనకు ఎంత ప్రేమ! అసలు తెలంగాణా నాయకులూ గుడి కట్టాల్సింది సోనియా గాంది  గారికి
కాదు, ఖచ్చితం గా దిగ్విజయ్ సింగ్ గారికే!

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం