తెలంగాణా ను అడ్డుకుంటున్నందుకే C.M గారి హెలికాప్టర్ ను M.P గారు పేల్చి వేస్తాను అంటుంటే , రేపు తెలంగాణా రాకపోతే సీమాంద్రా సెటిలర్స్ పరిస్తితి? ?

                                                             

ఎవరికైనా పెడతానంటే ఆశ , కొడతానంటే భయం! సీమాంద్రా నాయకులు ఇచ్చిన అంగీకార పత్రాలు ఆదారంగా సోనియా గాందీ తెలంగాణా రాష్ట్రానికి O.K  అంది. కానీ ఇప్పుడు సీమాంద్రా ప్రజలు ఒప్పుకోవటం లేదు కబట్టి కోంతమంది నాయకులు మాట మార్చి సమైక్యామ్ద్రా కావలంటున్నారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీలో ఉన్న కీలక సమయం లో ముఖ్యమంత్రి గారు తెలంగాణా మంత్రి గారు నిర్వహిస్తున్న శాసన సభ వ్యవహారాల శాఖ మార్చి దానిని సీమాంద్రా కు చెందిన మంత్రికి అప్ప చెప్పడం ఖచ్చితంగా రెండు ప్రాంతాల నాయకుల మద్య అరని  చిచ్చును రగిలించే చర్య అని చెప్పవచ్చు.

  దీని మీద తెలంగాణా కు చెందిన M.P  పొన్నం ప్రభాకర్ గారు C.M. గారి మీద కారాలు మిరియాలు నూరుతూ ,C.M  గారు కరీం నగర్ వస్తే అయన హెలికాప్టర్ ను గాల్లోనే పేల్చి వేస్తాను అని ఒక తీవ్ర వాది లా  మాట్లాడడం , తెలంగాణా నాయకులలో రాష్ట్ర విభజనను అడ్డుకుంటున్న్బ వారి మీద ఎంత అసహనం ఉందో తెలియ చేస్తుంది. మరి రేపు ఏ కారణం చేతనైనా తెలంగాణా రాకపోతే , తెలంగాణాలోని యువత మానసిక పరిస్తితి ఏమిటి? వారు ఆ కోపాన్ని ఎవరి మీద చూపిస్తారు? తెలంగాణా లో ఉన్న సెటిలర్స్ భయంతో వణికిపోయే పరిస్తుతలను సీమాంద్రా నాయకులు కల్పిస్తున్నారు. ఒక M.P  స్తాయి వ్యక్తే అంతగా ఆగ్రహం ప్రదర్శిస్తే సామాన్య యువత సంగతేమిటి? దీని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా తెలుగు మేదావులు ?
                ఈ  పరిస్తితికి కారణం   ఖచ్చితంగా అంగీకార పత్రాలు ఇచ్చిన సీమంద్రా నాయకులే! ఊరించి ఊరించి ఉసూరు మనిపిస్తే దానికి మూల్యం చెల్లించాల్సింది ఎవరు? కాబట్టి తెలంగాణా ప్రజలను కూర్చో బెట్టి మాట్లాడి వారికి న్యాయం చెయ్యకుండా బిల్లును టెక్నికల్ గా ఆపాలని చూడడం తెలంగాణాలో బయోత్పాత పరిస్తితులను సృష్టించడమే అవుతుందని నా అభిప్రాయం.


Comments

Popular Posts

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

వైద్యుడు మోసకారి అయితే వైద్య శాస్త్రం మోసమవుతుందా?

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

గోత్రం తెలియక తాతతోనే డేటింగ్ చేసిన మనవరాలు !

స్త్రీ స్వేచ్చ

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

వారిది"కులబద్దం",వీరిది"రాజ్యాంగబద్దం".