నాటి స్త్రీలకు "పాతివ్రత్యం" రక్షణాయుదం అయితే నేటి స్త్రీలకు "పవర్ ఫుల్ జర్కిన్" రక్షణాయుదమా ?

                                                          
                                                                      

               మన పురాణాలు, ఇతిహాసాలు, ఇంకా అనేక కధలలో చదివాం. పూర్వ  కాలంలో స్త్రీ, పురుషులు నైతిక జీవన విదానానికి కట్టుబడి ఉండేవారు అనేది వాటి సారాంశం. అయితే మహా మహా మగవారు కోడా ఆడదాని విషయంలో చపల చిత్తులై ఉండే వారు అని కూడా  కొన్ని గాదల  ద్వారా తెలుస్తుంది. ఉదహరణకు, ఇంద్రా-అహల్య గాదా , అగ్నిదేవుడు- ఋషిపత్నుల గాదా. ఈ  కదల ప్రకారం ఆ నాడు పవర్పుల్ అయిన  దేవతలు  సైతం పతివ్రతలను గురించి దుష్ట తలంపులు కలిగి ఉండడానికి జంకే వారు. కారణం ఆ సతీమా తల్లులకు ఉండే ప్రాతివ్రత్య శక్తి ఎవరినైనా బస్మం చేయగలిగేటంత పవర్పుల్ అంట ! సరే అవ్వన్నీ స్త్రీలను అణచిఉంచడానికి పురుషఆదిపత్య  సమాజం కల్పించిన కట్టుకదలు అని అనే వారు ఉన్నారు. అయితే ఈ  ప్రస్తావనలో అవి కల్పితాలా, వాస్తవాలా అనేది కాసేపు పక్కన పెడితే ఆ నాటి "సతీ మా తల్లుల "   భస్మం చేసే శక్తి , వారిని దురాత్ముల లైంగిక దాడుల నుండి కాపాడేది అని అర్దమవుతుంది.

  అనాది నుండి నేటి వరకు స్త్రీలది ఒకటే పరిస్తితి. రూపాలు వేరైనా లైంగిక దోపిడి అనేది సర్వకాలాలా లో, సర్వప్రాంతాలలో ఉన్నదే .మనిషి  ఏ నాడైతే సంతానోత్పత్తికి మాత్రమే చేయవలసిన  "లైంగిక చర్య"లను , ఆనందం కోసO తరచూ ఆనందించే అలవాటు గా మార్చుకున్నారో  ఆ నాడే స్త్రీ స్తాయి దిగజారింది. క్రమక్రమంగా  తల్లి .స్తానం నుండి కోరికలు తీర్చే మనిషి  స్తాయికి వచ్చింది. ఇప్పుడైతే మరింత నీచంగా ఆడదాని స్తాయి దిగజారింది. దీనికి ప్రబల సాక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలను వినియోగించి కొన్ని వేలకోట్ల "వ్యభిచార వ్యాపారాలు" నిర్వహిస్తుండడమే. ఒక్క ముంబాయి రెడ్ లైట్ ఏరియాలో మన రాష్ట్రానికి చెందిన అమ్మాయిలూ లక్ష మంది పైగా ఉన్నారని చదివాను . కాబట్టి  ఒంటి మీద బంగారం ఉన్న మగవాడు ఏ జాగ్రతలు తీసుకోవాలో, ఏమి లేని స్త్రీ సైతం అలాంటి జాగర్తలు తీసుకోక తప్పదు.మన ఒంటికి గాయం కాకుండా బంగారం తీసి ఇచ్చి ప్రాణాలు కాపాడుకోవచ్చు. కానీ ఆ పరిస్తితి కూడా  స్త్రీకి లేదు . కాబట్టి వినియోగ వస్తువు  ఉన్నంత కాలం దోపిడీ ఉంటుంది. కటిన శిక్షలు ఉన్న సమాజంలో    లైంగిక దాడుల రేటింగ్ ఖచ్చితంగా తగ్గుతుంది. "నిర్భయ " చట్టం మొన్న మొన్ననే వచ్చింది కాబట్టి, దాని పలితాలు కోసం ఇంకొంత టైం వేచి చూడాల్సిందే . దానికి కోడా సవరణ చేసి తొలిసారి నేరం చేసిన సరే  ఉరి శిక్ష కరారు చేస్తే ఖచ్చితంగా సత్పలితం ఇవ్వ వచ్చు. ఈ  లోపు స్త్రీలు సహితం కొన్ని జాగర్తలు తీసు కోవాలి. అవి ఏమిటొ చూద్దాం .

                  కొన్ని వందల యేండ్ల క్రిందట కొన్ని ప్రాంతాలలో స్త్రీలు తమ ను లైంగిక దాడులను నుండి కాపాడుకోవటం కోసం  .  " చాసిటిటి బెల్ట్ " లు ధరించే వారట. అలాగే ఆప్రికా ప్రాంతానికి చెందిన వారు రకరకాల రక్షణ కవచాలు కనిపెట్టి అవి ధరించే వారట. సరే వాటి వినియోగం  మీద కూడా . స్త్రీల హక్కుల సంస్తలు నానా యాగీ చేసాయి . మరి వారు కోరుకునే మగవారి ద్రుక్పదంలో మార్పు అనేది రావడం ఎన్నాళ్ళకు జరుగుతుందో తెలియదు. అసలు వస్తుందా అనేది కూడా  అనుమానమే. పైన చెప్పినట్లు వస్తువినియోగం ఉన్నంత కాలం దోపిడి ఉంటుంది అనేది సార్వజనిక సత్యం. కాబట్టి స్వీయ రక్షణ పద్దతులు పాటించడం తప్పనిసరి.

                                             ఈ  రోజు  పేపర్లో చూసాను .కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఒక ఇంజనీరింగ్ విద్యార్ది, అద్యాపకుడు కలిసి ఒక "పవర్ పుల్ జర్కిన్" ను ఆవిష్కరించారు అట. దానిని ఆన్ చేస్తే చాలు , దానిని ముట్టుకున్న వాడు ఎవరైనా షాక్ కొట్టి అర్ద గంట సేపు మూర్చ పోవాల్సీందేనట! అలాగే ప్రమాద తీవ్రత ను బట్టి దాని కరెంట్ స్తాయిని పెంచవచ్చు నట! అంతే కాదు ఇంకా కొన్ని అమరికలు ఏర్పాటు చేస్తే అది పొలిసు వారికి ప్రమాద హెచ్చరికలు పంపే సాధనంగా కూడా  ఉపయోగ పడుతుందట! . అంటే అది ఇంచు మించు వెనుకటి స్త్రీలకు రక్షణ ఇచ్చిన "ప్రాతి వ్రత్య" శక్తి లాంటిది. మరి వెనుకటి పతులు కూడా నిష్ఠ గరిష్టత  కలిగినవారు వారు కాబట్టి , వారిని సేవిస్తే "ప్రాతివ్రత్య " శక్తి కలిగేది. ఇప్పుడు అలాంటి పతులు ఉండటం కష్టం కాబట్టి ఆ శక్తి రావడం కష్టం . కాబట్టి కనీసం ఈ  "పవర్ఫుల్ జర్కిన్" అయినా కొని ఇచ్చి తమ సతులను కాపాడుకుంటే అదే మేలు! ఇక తక్కిన వారు కూడా అటువంటివి ధరిస్తే రక్షణ పొందవచ్చు. ప్రభుత్వం వారు కూడా  ఈ  విషయంలో ఆలోచన చేసి మన దేశం లోని ప్రతి మహిళకు "పవర్పుల్ జర్కిన్" లు సబ్సిడీ రేట్లకు అందిస్తే మంచిది.

    రాబోయే 2014 ఎన్నికలలో రాజకీయ పార్టీల వాగ్దానాలలో ప్రతి మహిళకు "ఉచిత పవర్ఫుల్ జర్కిన్" కూడా  చేర్చవచ్చు. ఏది ఏమైనా మనువు చెప్పినట్లు "ఎచ్చట స్త్రీలు ఆనందంగా ఉందురో అక్కడ దేవతలు తిరుగా డుతారు" అని , స్త్రీల రక్షణ మన ప్రదమ కర్తవ్యం కావాలి.
                                                          (25/10/2013 Post Republished)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం