బాదితురాలికి "అభయ" పేరు పెట్టడం, రేపిస్టు లని "నిర్భయ" క్రిందకు నెట్టడంతో ప్రభుత్వo బాద్యత తీరినట్లేనా?

                                                                   
Courtesy: ABN Andhra Jyothi Dt:25/11/2016. 

                           
                              మన రాజధాని హైదరాబాద్ నగరం చాలా గొప్పది. ఎందుకంటే మన దేశంలో అభివృద్ధి చెందిన నగరాల్లో దీనికి 5వ  స్తానమట !. ఎలాగు దేశ రాజదాని అయిన డిల్లీ రెండవ  స్తానంలో ఉంది కాబట్టి అక్కడ "నిర్భయ " సంఘటణ జరిగి దేశాన్ని ఒక ఊపు ఊపింది . దానితో "నిర్భయ " చట్ట సవరణలు " వచ్చాయి. ఆ తర్వాత మరో పెద్ద నగరం, దేశ వ్యాపార రాజదాని, దేశ అభివృద్దిలో 1 వ స్తానం అని చెప్పబడుతున్న "ముంబాయి"లో ఒక జర్నలిస్ట్ అత్యాచారానికి గురి కాబడితే నిందితులను సదరు "నిర్భయ" క్రింద కేసు పెట్టి విచారణ చేస్తున్నారు. ఇప్పుడు దేశ బావి I .T  రాజదాని అని కీర్తించబడుతున్న మన రాజదాని నగరంలో కూడా  "నిర్భయ '. లాంటి సంగటనే పోయిన గురువారం జరిగి సంచలనం స్రుష్టించినట్లయింది. అయినా స్త్రీల మీద అత్యాచార విషయంలో హైదరాబాద్ ది  దేశంలో నాలుగవ స్తానమట !అంటే అభివ్రుద్దిలో 5 వ స్తానం లో ఉన్న మన రాజదాని అత్యాచారాల్లో 4 వ పొజిషన్ అన్న మాట! శబాష్!

     స్త్రీల మీద జరిగే లైంగిక దాడుల విషయం లో కేసులు పెట్టడానికి ముందుకు రాని నిజమైన బాధితులు వలన దుర్మార్గులు విచ్చలవిడిగా "పరువుగల స్త్రీలనేమి చేసినా పైకి చెప్పుకోలేరులే" అనే ధీమాతో చేసిన నేరాలనే తిరిగి చేయడానికి సాహసిస్తుండడం వలన నేర కట్టడి దుర్లభమవుతుంది   , అలాగే తప్పుడు కేసులు పెట్టి తమ లక్ష్యం నెరవేర్చుకోవాలానే కొంతమంది స్త్రీల నైజం వలన అమాయకులు హింసకు గురి అవుతూ  , చివరకు  నేర కట్టదానికి ఉద్దేశించిన చట్టాల లక్ష్యం నీరు గారి పోతుంది.  అందువలన అంతిమంగా నష్టపోతోంది నిజ బాధిత  స్త్రీలు మాత్రమే అని గుర్తు ఉంచుకోవాలి . ఇదే విషయం లో ఈ  మధ్యనే హైదరాబాద్ నగరం లో జరిగిన ఒక సంఘటన గురించి విశ్లేషిద్దామ్ .

                         ఆ అమ్మాయి పేరు అభయ. తల్లితండ్రులు ఎక్కడుంటారో మనకు తెలియదు కాని, ఆ అమాయి మాత్రం సైబరాబాద్ లో సాప్ట్ వేర్ ఉద్యోగిని అట. పోయిన గురువారం షాపింగ్ చేసుకుని సాయంత్రం ఏడున్నర  గంటలకు బస్సు ఎక్కి సైబరాబాద్ లోనే వేరొక ప్రాంతానికి వెళ్లిందట . అక్కడ నుండి సుమారు 8.45 ని// ఆమె ఉండే హాస్టల్ కి వెళదామని, బస్ కోసం ఎదురు చూస్తుంటే అంతలో అక్కడికి 40 లక్షలు విలువ చేసే వోల్వో s60 మోడల్ కారు ఒకటి వచ్చి ఆగిందట. అందులో డ్రైవర్, మరొక వ్యక్తీ ఉన్నారు . ఆ అమ్మాయిని ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే చెప్పిందట. యాబై రూపాయలు ఇస్తే వస్తాం అని వారు అంటే నలబై రూపాయలకు బేరం కుదుర్చుకుని అమాయకంగా కారులో కూర్చుంది ఆ అబల. అప్పటికే ఒక దుర్బుద్ధితో ఉన్నారేమో ఆ అమ్మాయిని హాస్టల్ వైపు కాకుండ మరొక దారికి తీసుకు వెళుతుంటే అనుమానం వచ్చి నిలదీసిందట. వారేవో కాకమ్మ కదలు చెపుతూ రాంగ్ రూట్లో తీసుకు వెళుతుంటే వెంటనే తన మొబైల్ ద్వారా బెంగలూర్లోని తన స్నేహితుడి పోన్ చేసి చెపుతుంటే వారు ఆమె సెల్ ని లాగివేసుకున్నారట. దానితో కంగారు పడిన ఆమె స్నేహితుడు హైదరాబాద్లోని  తన స్నేహితులుకు పోన్ చేసి పోలిస్ కేస్ పెట్టమంటే , వారు పోలిస్ కి సమచారం ఇచ్చారట. అయినా లాభం లేక పోయింది. అర్దరాత్రి పన్నెండు గంటల తర్వాత మెదక్ జిల్లాలో ఒక స్కూల్ సమీపంలో కి కారుని తీసుకు వెళ్లి అక్కడ కారులోనే ఆమెను రేప్ చేసి, సుమారి 1.45 ని//  ఆమె ను హాస్టల్ వద్ద దిగబెట్టి వెళ్ళారట.

  మొదట్లో రేప్ జరిగిన విషయన్ని ఆమ్మాయి  తన బాయి ఫ్రెండ్ కి గానీ, పోలీసులకు కానీ చెప్పలేదట. ఆమె బట్టలు మీద రక్తపు మరకలు అవి చూసి అనుమానించిన పోలిసులు ఆమెను ఒక మహిళా పోలిస్ అధికారిణి ద్వారా కన్విన్స్ చేసి సమాచారం రాబట్టి, పకడ్బందిగా పరిశోదన చేసి , స్కూల్ సి.సి.పుటేజ్ ల ద్వారా మరియు నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వారి సహాయంతో నిందితులను పట్టుకుని వారి మీద నిర్బయ క్రింద కేసు పెట్టి విచారిస్తున్నారు. అందులో నిందితులిద్దరు కారు డ్రైవర్లే అందులో వోల్వో కారు యజమాని ఆ రోజు ఊర్లో  లేకపోతె అదే అడననుకుని ఆ కారు డ్రైవర్ సతీష్  తన స్నేహితుడు ఆయన వెంకటేశ్వర్లు ను పిలిచి ఇద్దరు కలసి ఆమ్మాయిల వేటకు బయలు దేరారట. పాపం ఆ అమ్మాయి కర్మ కాలి వారి చేతికి చిక్కింది బలి అయింది. అయితే ఇక్కడ ఎవరికైనా ఒక అనుమానం రావచ్చు. రేప్ చేసినోళ్లు ఆ అమ్మాయిని ఏమి చెయ్యకుండా హాస్టల్ దగ్గర ఎందుకు వదిలారు అని ? దానికి సమాదానం నిందితుడు సతీష్ మాటల్లో " ఇటువంటి అత్యాచార ఘటనలు గురింఛి  ఆడపిల్లలు  ఎవరితో చెప్పుకోలేరు " అని. అదీ నిజమే ఈ  కేసునే చూసుకుంటే ఆ అమ్మాయే ఇరవై నాలుగు గంటలు పాటు ఎవరికీ చెప్పలేదు అట!. తన తల్లితండ్రులకు తెలిస్తే వారు ఆత్మహత్య చేసుకుంటారు కాబట్టి పోలీసులను ఈ  కేసు వివరాలు బయటకు రావద్దని వేడుకుందట. పాపం!  ఇదీ ఈ  దేశంలో ఆడపిల్లల పరిస్తితి.


         ఆడపిల్లకు అన్యాయం జరిగితే ముఖ్యంగా అత్యాచారం జరిగితే, విదేశాల సంగతేమో కానీ ఐ దేశం లో మాత్రం ఉరిశిక్ష విదించేలా చట్టం ఉండాల్సీందే. ఎందుకంటే మన దేశ సంప్రాదాయాలు ప్ర్రాణానికి ఎంత విలువ ఇస్తాయో  , మానానికి అంతే విలువ ఇస్తాయి . కాబట్టి మానబంగం అంటే హత్యతో సమానం . కాబట్టి ఖచ్చితంగా ఉరిశిక్ష ఉండాల్శిందే. విదేశి బావజాలలతో తయారు చేయబడిన మన చట్టాలు కేవలం జైలు  శిక్షలతో దోషుల మీద ఔదార్యం చూపిస్తున్నాయి. కాబట్టి చట్ట సవరణ చేయాల్సిందే. ప్రతి అత్యాచార కేసు విచారణ కు ఉన్నత స్తాయి మహిళా పోలిస్ అధికారి ని నియమించాలి. పై కేసులో ఒక మహిళా అధికారిణి చొరవ వలనే అభయ దైర్యంగా కేసు పెట్టడానికి ముందుకు వచ్చిన విషయం గమనార్హం. అలాగే అత్యాచార నిరోదక చట్టాలను దుర్వినియోగ పరచే వారు ఎవరైనా సరే లింగ బేద  రహితంగా కటినంగా  శిక్షించాలి.

      ఒక నేరం జరిగిందంటే దానిని అన్నీ కోణాలోనుంచి క్షుణంగా పరీశిలించి , పరిశోదించి నిజాల్ని వెలుగులోకి తీసుకు రాగలిగితేనే నేర కట్టడి అనేది  సాధ్య పడుతుంది. ఉదాహరణకు ఈ కేసునే తీసుకుంటే కొన్ని సందేహాలు కలుగుతున్నాయి . పైన చెప్పిన దంతా నాణేనికి ఒక వైపు మాత్రమే మరి ఆ రెండో వైపున కలిగే సందేహాలు ఏమిటో చూడండి
               (1) ఒక ఖరీదైన ఓల్వో కారును నలబై రూపాయిలకు తిప్పే  టాక్శీ అంటే సాప్ట్వేర్ ఉద్యోగిని అయిన  అభయ ఎలా నమ్మింది?

  (2) ఆమె కారు ఎక్కింది8.45   కి .ఆమె స్నేహితూడుకి పోన్ చేసింది సుమారు 10.45   కి. అంటే సుమారు రెందు గంటల పాటు కారు ఎక్కడెక్కడ తిరిగింది?

  (3). కారు నేర ప్రాంతానికి వెళ్ళడానికి రెండు చెక్ పోస్ట్లు దాటారట. అంతే కాదు అందులో డ్రైవర్ చెక్ పోస్ట్లో రసీదు కూడా తీసుకున్నాడట. మరీ అభయ ఆ సమయంలో ఎందుకు అరవలేదు? కారులో ఒక అమ్మాయి నోరు నొక్కి తాపీగా రసీదులు తీసుకునే రిస్క్ చేస్తారా ?

  (4). కారు నేర ప్రాంతానికి ఒంటి గంట తర్వాత వెళ్ళింది. అంటే పోలిసులకు సమాచారం ఇచ్చిన గంటన్నర తర్వాత. మరి పోలిసులు అన్ని చెక్ పోస్టులను అలెర్ట్ చెయ్యలేదా?

  (5). నేర ప్రాంతం నుండి  అభయ హాస్టల్కి చేరుకోవటానికి కేవళం అరగంట మాత్రమే పడితే, అదే సైబరాబాద్ నుండి కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళడానికి మూడు గంటలు పట్టింది.

  (6). అభయ కేసు పెట్టడానికి ఇరవై నాలుగు గంటలు సంకోచించడానికి ఆమె చేప్పే కారణం నిజమా? ఒక సారి పోలిసులకు సమాచారం ఇచ్చాకా కేసు బుక్ అయినట్లే. మరి ఆమె ఎందుకు కేసు విచారణకు ఇరవై నాలుగు గంటలు దాకా  సహకరించ లేదు?

 (7). ఈ కేసు వివరించే సందర్బంలో పోలిస్ వారు ప్రభుత్వం నగరంలో  సి.సి. కెమేరాలు ఏర్పాటు చేయడనికి ఉద్దేశించిన నాలుగు వందలు కోట్లు రూపాయలు విడుదల  చెయ్యక పోవడం కూడా భద్రతా లోపంలో ఒక కారణంగా చెప్పడం వెనుకాల ఏదైనా మతలబ్ ఉందా? అంటే ఈ కేసు ను కావలని బూశ్ట్ అప్ చేసి తద్వార్తా ప్రజా ఆందోళన లు చూపి త్వరగా నాలుగు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి రప్పించదలచారా?

(8). అభయ తల్లి తండ్రులకు ఈ రోజు తెలియకపోయినా రేపు కోర్టు విచారణ అప్పుడు అయినా తెలియదా? వారిని మబ్య పెట్టి విషయం దాచే బదులు వారిని కౌన్సిలింగ్ ద్వారా పరిస్తితులను ఎదుర్కునేలా చెయ్యొచ్చు కదా.

(9). ఏ మత్తు మందు ఇవ్వకుండా ఒక అమ్మాయిని బలవంతంగా మూడు గంటల పాటు ఒక కారులో నగరంఅంతా తిరిగారు అంటే హైద్రాబాద్ లో స్త్రీల రక్షణ ఎంత అద్వాన్న స్తితిలో ఉందో చెప్పొచ్చు

                    . ఏది ఏమైనా అమ్మాయిలు తమస్వీయ రక్షణ విషయంలో జాగర్తగా ఉండాలి. హైద్రాబాద్లో ఒంటరిగా ఉద్యోగం చేసే స్త్రీలు స్తానికంగా తమ బందువులు ఎవరితో సంబందాలు లేకుండా, కేవళం ఎక్కడో బెంగులూర్లో ఉన్న వారి సహాయం పొందాలనుకుంటె ఎలా? రక్త సంబదీకులు స్పందించే తీరుకు  ఎవరో అపరిచితులు(స్నేహితుని స్నేహితులు} స్పందించే తీరుకు బేదమ్ ఉంటుంది. ఇటువంటి ఉదంతాలు చూసైనా తల్లితండ్రులు, బందువులు తమ అమ్మాయిల రక్షాణ  పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాం.
                                                           (23/10/2013 Post Republished)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!