నిర్బయ చట్టం కూడా " స్త్రీల చావుకు" కారణాల్లో ఒకటి అవుతుందా!?





                                          అవుననే అనిపిస్తుంది ఈ  మద్య స్త్రీల మీద జరిగిన అత్యాచారాలు ఆ పై హత్యలు చేసిన సంఘటనలు చూ స్తుంటే. స్త్రీల రక్షణ కోసం ఉద్దేశించబడిన చట్టం కూడా  స్త్రీల చావుకు కారణమవుతుంది అని ఆలోచించడం అతిశయోక్తిగా అనిపించినా , హేతుబద్దంగా ఆలోచిస్తే అది నిజమే అనిపిస్తుంది.

           మొన్న హైదరాబాద్ దగ్గరి అడవుల్లో ఒక అమ్మాయి మృత దేహం కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్ట్ మారటం లో ఆ అమ్మాయిని ఎవరో రేప్ చేసి చంపినట్లుగా తేలింది. నిందితులను ఇంతవరకు గుర్తించలేదు. కేసు దర్యాప్తు సాగుతుంది. అలాగే అనంతపురం జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూలులో పనిచేసే ఉపాధ్యాయిని , కాల క్రుత్యాల కోసం ఊరి దగ్గర ఉన్నా వంక అనే గుబురు ప్రాంతాలలోకి వెల్లిందట . ఆ తర్వాత ఆ గ్రామానికి చెందిన వారు ఆమె మృత దేహం ఆ వంక లోనే ఉండగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ టీచర్ కూడా  ముందు వెనుకా ఎవరూ లేని ఆమె కాదు . సదరు సోమాలా పురం గ్రామానికి చెందిన సింగిల్ విండో అద్యక్షులు అయిన రెడ్డి గారి అమ్మాయి. మరి కాలక్రుత్యాలకోసం మదుగు ఉన్న ఉన్న ప్రాంతానికి వెళ్ళిన ఆమెను దారుణంగా బండతో తలపై మోదీ  చంపాల్సినత అవసరం ఎవరికీ ఉంది.?  పోలిసుల ప్రాదమిక నివీదిక అనుసారం ఆమె మీద అత్యాచారం జరిగాకే హత్య చేసినట్లు తెలుస్తుంది. ఇది నిన్న జరిగిన సంగటనే. అత్యాచారం చేసిన వారు సాక్ష్యాలు దొరకకుండా చెయ్యడం కోసమే ఆమెను హత్య చేసి ఉంటారు అని పోలిస్ వారు బావిస్తున్నారట. ఇదే నిజం కావచ్చు.

  నిర్బయ చట్టం వలన సమాజం లోని మ్రుగాల్ళలో బయం ఏర్పడి స్త్రీల మీద అత్యాచారాలు తగ్గుతాయని అందరూ ఆశిస్తున్నారు. ఈ  చట్టం  రావడానికి కారణమైన డిల్లీలోనే 2012 లో 700 పైగా రేప్ కేసులు నమోదైతే, చట్టం వచ్చిన తర్వాత పది నెల్లల్లొనే 1200 పైగా కేసులు నమోదయ్యాయి అట! మరి చట్ట ప్రబావం మ్రుగాళల్లో బయం కలిగించి అత్యాచారాలను అరికట్టేలా చేస్తుంది అనేది అనుమానంగానే ఉంది. అత్యాచారాలను అరికట్టక పోగా , నేరం జరిగాక కఠిన  చట్టం గుర్తుకు వచ్చి, బాదితురాలు నోరువిప్పితే తాము  తప్పించుకునే అవకాశాలు అవకాశాలు తక్కువ అని బావించి ఆమెను కడ తేర్చడానికే మొగ్గు చూపుతున్నారు అనిపిస్తుంది. ఇదివరలో అయితే ఏదో ఒక కారణం తో బెయిల్ తీసుకుని , ఆ పై కొన్నేండ్లు కేసు నడిచాక అప్పటికి ఆవేశాలు చల్ల బడతాయి కాబట్టి టెక్నికల్ గానో, లేక తక్కువ శిక్ష తోనో మ్రుగాడు బయట పడే అవకాశం ఉంది. కానీ నిర్బయ చట్టం వచ్చిన తర్వాత , ఒక్కసారి రిమాండ్ అయితే విచారణ సహా అంతా పూర్తీ చేసే నేరస్తుడుగా ప్రకటించి జైలులోనే ఉండి శిక్షా కాలం పూర్తయ్యాకే బయటకు రావడం జరుగుతుంది.

   ఒక వేళా  ఎవరైనా  నిందితులకు సహాయం చెయ్యాలనుకున్న ప్రస్తుత పరిస్తితుల్లో సాద్యం కాని విషయం. అదే బాదితురాలు ని హత్య చేస్తే , ఆ హత్యకు సంబందించిన దర్యాప్తు జరగడానికి కొన్ని నెలలు కాలం పడుతుంది. ఈ  లోపు మ్రుగాళ్ళు తమకు ఉన్న అర్ద , రాజకీయబలాలతో దర్యాప్తు  అధికారులను ప్రబావపరచడానికి అవకాశం ఉంటుంది. అదే బాదితురాలు బ్రతికి ఉంటే ఈ  అవకాశాలు  ఏవి మ్రుగాడికి ఉండవు. ఆ ఉద్దేశ్యం తోనే బాదిత స్త్రీలను హత్య చేస్తున్నారు అనిపిస్తుంది. ఒక వేళ ఇదే నిజమయితే , ఏ స్త్రీల రక్షణకు ఒక పటిష్టమైన చట్టం చేసారో అదే స్త్రీలకు బూమి మీద నూకలు లేకుండా చేస్తుంది అనేది తలచుకోవడనికి కూడా  బయం కలిగిస్తుంది. ఏది ఏమైనా , స్త్రీలకు రక్షణ ఇచ్చేది స్వీయ జాగర్తలు. నేను ఇంతకు ముందు టపాలలో చెప్పినట్లు ఒంటినిండా బంగారం ఉన్న వారు ఏ జాగర్తలు తీసుకుంటారో ప్రతి స్త్రీ కూడా బంగారం ఉన్నా లేకపోయినా అవే జాగర్తలు తీసుకోవాలి.ముఖ్యంగా జన సంచారం లేని ప్రాంతాలకు , మదుగు ఉన్న పొదలు  , చెట్లు ఉన్న ప్రాంతాలలోకి ఒంటరిగా వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు .
          ఇంట్లో దొంగలు పడ్డారని పోలిస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళితే వారు ముందుగా అడిగేది ఇంటిలో దొంగ తనం జరగకుండా తగిన జాగర్తలు తీసుకున్నారా లేదా అని. అవసరమయితే ప్రత్యేక జాగర్తలు ఎలా తీసుకోవాలో మీడియా ద్వారా , పత్రికల ద్వారా తెలియ చేస్తుంటారు. అలా తెలియ చెయ్యడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ అదే స్త్రీల విషయం లో ఏవైనా జాగర్తలు ఎవరైనా చెపితే కయ్యి మని ఎగిరిపడుతుంట్టారు. సమాజంలో మగాళ్ళు మారడ్డానికి బదులు స్త్రీల స్వేచ్చా కు బంగం కలిగించే మాటలు మాట్లాడడమేమిటి? అని కొట్టి పారెస్తుంటారు . చట్ట ప్రకారం, ఇంటి యజమాని తగిన జాగర్తలు తీసుకోలేదని చెప్పి  దొంగతనం చేసాం అని దొంగలు  అంటే కోర్టులు ఒప్పుకోవు.శిక్షను కూడా  తగ్గించవు . అలా అని చెప్పి మనం జాగర్తలు తీసుకోకుండా ఉండలేము. అదే సూత్రం స్త్రీలు కూడా  అర్దం చేసుకుంటే చాలా వరకు ముప్పు తప్పుతుంది. రెవెన్యూ కోసం మద్య పానం ని ప్రోస్తాహించే ప్రబుత్వాల నుండి నూరు శాతం స్త్రీ రక్షణ ఆశించడం అత్యాశే అవుతుంది. అందుకే స్వీయ జాగార్తలను మించిన రక్షణ పద్దతి  లేదు.ఆ తర్వాత చట్ట రక్షణ ఎలాగూ  ఉంటుంది.
                                                             (20/12/2013 Post Republished).

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.