"వ్రుద్దాప్య నరకం" నుండి రక్షించేవారు పుత్రుడా? పుత్రికా?





                                                     ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమయి, చిన్న కుటుంబాలుగా మన జీవన విదానం మార్పు చెందింది. అయితే దీని వలన ఏ విషయం ఎలా ఉన్నా, ముఖ్యంగా సంకట స్తితిలో నెట్టబడింది, కుటుంబాలలోని వ్రుద్దుల పరిస్తితి. సాదార్ణంగా,ఉమ్మడి కుటుంబాలలో, పెద్దల చేతిలో పెత్తనం ఉంటుంది కాబట్టి, ముసలివాండ్ల పరిస్తితి బాగుండెది. మనవళ్లు, మనవరాళ్లు, కొడుకులు,కోడల్లు తో అంరూ ఉండటం వల్ల అదే ఒక చిన్న సమూహం లాగ కళ కళ లాడుతూ ఉండేది. ఒకరు కాకపోతే మరొకరు,వ్రుద్దుల బాగోగులు చూడటానికి అవకాశం ఉండెది.కాబట్టి వారికి భద్రత ఉండేది.

  కాని ఇప్పట్టి చిన్న కుటుంబాలలో ఆ పరిస్తితి లేదు. ముసలి వాల్లను ఎవరు చూడాలి అనేది, ఒకరికి మించి కొడుకులు ఉన్న కుటుంబాల, ఆస్తుల పంపకాల సమయంలో పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. నీవు చూడు అంటే నీవు చూడు అని బాద్యతని తప్పించుకోవటానికే కొడుకులు కాని, వార్ని కట్టుకున్న కోడళ్లు  కాని చూస్తున్నారు. అప్పటిదాక ఒకటిగా కుటుంబాన్ని నడిపిన కొంతమంది దంపతులు, కొడుకుల "బాద్యత పంపకాలు"లో బాగంగా "విడాకులు" తీసుకున్న జంటలాగ  బర్త ఒక కొడుకి దగ్గర, బార్య  ఇంకొక కొడుకు దగ్గర బ్రతకాల్శిన దౌర్బాగ్యం ఏర్పడుతుంది.

 ఇంకొక  ముఖ్యమయిన విషయం ఏమిటంటే,ముసలి వారిని చూడాలంటే, చూసేవారికి కావాల్శింది, వారి పట్లప్రేమ లేకపోతే కనీసం కుటుంభ బాద్యత్ల పట్ల నిబద్దత . కాని ఈ తరం కోడళ్లలో కరువైందే ఈ రెండు.నూటికి పదిమంది ఉంటారేమో అటువంటి పుణ్యతల్లులు.కాబట్టి వ్రుద్దులు పరిస్తితి డోలాయమాన స్టితి అని చెప్పవచ్చు. అందుకే చాలమంది వ్రుద్దులు తమ శేష జీవితాలు కూతుళ్ల వద్ద గడపటానికే ఇశ్టపడున్నారు. దీని మీద మరింత సమాచారం కొరకు ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి.http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_3190.html

                     వృద్ధులైన తల్లితండ్రులను  పుత్రులు చూడకపోతే పుత్రికలే చూడాలి  .  ఇక వీరు కూడ చూడకపోతే "వ్రుద్దాశ్రమాలే" గతి!  అందుకే "భేటీ బచావో ! భేటీ పడావో " అనే పధకాన్ని నూటికి నూరుపాళ్లు సక్సెస్ చేయాల్సిన  బాధ్యత ప్రతి తల్లి తండ్రి మీద ఉంది . ఒకప్పుడు ఆడపిల్లను చదివించి ఉద్యోగస్తురాలిని చేస్తే , ఆమె సంపాదన అంతా అత్తింటివారి కె ఉపయోగపడుతుంది తప్పా , తమకు కాదు కదా అని కొంతమంది తల్లితండ్రులు స్వార్ధ పూరితంగా అలోచించి కొడుకులనే పై చదువులు కు పంపించి , ఈడూ రాగానే ఆడపిల్లలకు పెండ్లి చేసి పంపించే వారు . అటువంటి వారు కూడా తమ ఆడపిల్లలను నిర్బయంగా పై చదువులు చదివించి మంచి ఉద్యోగాలలో స్థిరపడేలా చేయొచ్చు . ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలు ప్రకారం వృద్ధులైన తల్లి తండ్రులును పోషించాల్సిన బాధ్యత కొడుకులకు ఎంత ఉందొ , కూతుళ్ళకు కూడా అంటే ఉంది కాబట్టి , ఆడపిల్లలను తల్లితండ్రులు  "ఆడ,పిల్లలు " అని అనుకోవాల్సి న అవసరం లేదు . వారు కొడుకులు మాదిరిగానే ఎప్పటికి పుట్టింటికి అన్నింటిలో వారసులే .

                 "పున్నామ నరకం నుండి కాపాడే వాడు పుత్రుడైతే,"వ్రుద్దాప్య నరకం" నుండి కాపాడ్డానికి పుత్రికే బెస్ట్ అనుకుంటా!" . ఆలోచించండి !.
                       ( Republished Post)

Comments

  1. * మీరు చెప్పింది బాగానే ఉంది కానీండి, అల్లుడు అత్తమామలను చూడటానికి ఒప్పుకోకపోతే ?
    * లేక అక్కడ అతని తల్లితండ్రి ఉండి , వారు ముఖం ముడుచుకుంటే ?
    * ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమవుతూ ఉన్నారు. ఈనాటి ఎందరో పెద్దవాళ్ళు.
    * మాకు తెలిసిన ఒకామెకు వృద్ధాప్యంలో భర్త చనిపోయిన తరువాత అనారోగ్యం కలిగింది.
    * కొడుకులు సరిగ్గా పట్టించుకోకపోతే , కూతురు తల్లిని తమ ఇంటికి తీసుకెళ్ళింది.
    * కానీ కూతురు అత్తగారికి వియ్యపురాలిని తీసుకురావటం అంతగా ఇష్టం లేదట.
    * తనవల్ల కూతురు మాటలు పడటం ఇష్టం లేక , అనారోగ్యం కొంచెం తగ్గితే , తిరిగి తమ ఊరు వచ్చి ఒంటరిగా జీవిస్తానని అంటోంది మాకు తెలిసినామె.
    * ఇలా ఎన్నో ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారు. ఈనాటి ఎందరో పెద్దవాళ్ళు.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పింది అక్షరాల నిజం anrd గారు. ఇటువంటి ఇబ్బందులు ద్రుష్టిలో ఉంచుకునే "తల్లి తండ్రులను వ్రుద్దాప్య దశలో మగపిల్లలే చూడాలని ఒక నియమంగా ఇన్నాల్లు దర్మంగా పాటిస్తు వస్తున్నాం. కాని హక్కులె తప్ప బాద్యతలు స్వీకరించడానికి ఇష్టపడని ఈ తరం వారితో మీరు చెప్పిన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేవలం చిన్న పిల్ల వాడిని "మందలించారని" 18 నెలలు జైలు శిక్ష విదించాలని "నార్వే" దేశం లో, మన రాష్ట్రానికి చెందిన దంపతుల మీద, ప్రాసిక్యూషన్ వారు కేసు పెట్టారట!. చూశారా అక్కడి ప్రభుత్వాలు కుటుంభ బాద్యతలు నెరవేర్చని వారి మీద తీసుకునే చర్యలు. ఇది బాద్యతలు గాలికి వదిలేసే మనకు అతి గా కని పించిన అటువంటి చోట వ్రుద్దుల సంక్షేమానికి తగిన చట్టాలు ఉంటే ఈ కొడుకుల ఆటలు సాగుతాయ?

      మన దేశంలో ఏది చేద్దామన్నా బయంగానే చూడాల్శి వస్తుంది.చట్టాలు చేస్తే "కుటుంభ వ్యవస్తలోకి" చట్టాలా అని భయం. వద్దంటే మన బాద్యతలు గాలికి అర్పణం. ఇది అందరూ సీరియస్ గా ఆలోచించి,వ్రుద్దుల సంక్షేమానికి తగిన చట్టాలు చెయ్యడం కాదు, చిత్తశుద్దిగా అమలు చెయ్యాలి.

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం