అంటరాని కంపు భరించలేక క్రిస్టియన్ మతంలోకి వెళితే , అక్కడా అంతకంటె ఎక్కువ కంపు అంట !?

                                                                     
 

            భారత దేశంలో హిందూ జీవన విదానంలో ఒక ఘోరమైన అమానవీయ విదానం ఒకప్పుడు  చోటు చేసుకుంది . అదే అంట రాని తనం . దీనిని ప్రవేశ పెట్టింది ఎవరైనా , కొనసాగించడంలో మాత్రం అన్ని వర్ణాల వారి పాత్ర ఉంది . తోలి వేద కాలంలో అందరికీ దేవుడు ఒక్కడే . అతడే ప్రజాపతి అనబడే సూర్యుడు . ఆ తర్వాతి కాలం లో త్రి మూర్తులు , ఇంకా అనేక మంది దేవతలు వచ్చి , చివరకు భరత ఖండాన్ని హిందూ దేశం చేశారు .

             ఈ  దేశంలో ఉన్నన్ని మతాలూ,   దేవుళ్ళు ఏ దేశంలో కానరారు . అందుకే ఇది ఒక మినీ ప్రపంచం. హిందూ మతం అని అపోహ పడుతున్నడి నిజంగా మతం కాదు . అది జీవన విదానం. ఈ జీవన విదానంలో అన్నీ మతాలూ ఉన్నాయి. మతం కి ఉండే ముఖ్య లక్షణం ఏమిటంటె ఏదైతే ఒక వ్యక్తీచేత ప్రబోదించబడిన సూత్రాలు అనుసరించే వర్గం  , లేక ప్రత్యేక ఆరాధనా పద్దతి కల వర్గం ఉంటుందో వారు  అనుసరించే విదానం ని " మతం " అంటాం. కాని "హిందూ" అనేది ఆ నిర్వచనం పదిలోకి రాదు. అందుకే దానిని జీవన విదానం అన్నారు మన సుప్రీం కోర్టు వారు . ఈ  జీవన విదానంలో , ఈ  దేశంలో ఉద్బవించిన వైష్ణవం , శైవం, శాక్తేయం , సాయిబాబీయం లాంటి వ్యక్తీ ఆరాదనీయం  మతాలూ బోల్డన్ని ఉన్నాయి . కాల క్రమేణా ఈ  దేశంలోకి  ప్రవేశించిన  ఇస్లాం , క్రిష్టియన్ లాంటి మతాలను తనలో చేర్చుకున్న " హిందూ జీవన విదానం " చాలా విశాలంగా అంటే " హిందూ మహా సముద్రం " లా మారి పోయింది .

   మతాలూ  ఏవైనా సరే అందులో పండితులే కాదు , "పండిత పుత్రులూ  " ఉంటారు . వీరివలననే మతాల గొప్పతనం మరుగునపడి , లేని పోని విదానాలు కలగా పుగంగా కలసి పోయి , చివరకు మతం ఒక్క మౌలిక స్వరూపమే మారి పోతుంది . ఉదాహరణకు " జివ హింస " కూడదన్న బౌద్ద మతంలో తుపాకులు తీసుకుని కాల్చుకునే పరిస్తితి ఏర్పడింది . అలాగే హిందూ జీవన విదానం లోని కొన్ని మెజార్తీ మతాల్లో కూదా . చెట్టులలో , గుట్టల్లో , ఎలుకలో , కుక్కలో , చివరకు పందిలో కూడా దైవాన్ని దర్శించించమని చెప్పిన మతాలూ , చివరకు " మనుషుల్లో  అంటరాని తనం ని ప్రవేశ పెట్టాయి . కారణం తమ తాతలు , తండ్రులుకు దక్కిన గౌరవ హోదాలు , చేతకాని తమకూ వంశ పారంపర్యంగా దక్కాలని కొంత మంది " పండిత పుత్రులు" చేసిన ప్రయత్నాలు , అందుకు వారికి అనుకూలించిన అప్పటి సామాజిక పరిస్తితులు .దీనికి సామాజిక ఆమోదం లభించింది అనడానికి సాక్ష్యం ఇది  కేవలం అగ్ర వర్ణాలే కాదు , నిమ్న వర్గాలు వారూ దీనిని పాటించడమే .

   మన దేశం లోకి వచ్చిన అన్య మతాల వారు ఈ దురాచారాన్నిబూచిగా  చూపి ,దాని వలన బాదితులైన వారికి తాయిలాలు ఇచ్చి తమ వైపుకి తిప్పుకున్నారు . అందులో క్రిష్టియన్ మిషనరీలు ప్రదాన పాత్ర వహించారు . అయితే గమ్మతైన విషయం ఏమిటంటే , మొదట్లో ఈ మతం లో అగ్ర వర్ణాలు వారు చేరలేదు కాబట్టి  ఇది దళితుల ప్రభావ మతం గా ఉంది .మత మార్పిడులు కోసం  విదేశి పండ్స్ విచ్చలవిడిగా భారత  దేశం లోకి ప్రవహించడం వలన , ఆ ఆర్దిక తాయిలాల కోసం  అగ్ర వర్ణాల వారూ క్రిష్టియన్ మతo వైపు ఆకర్షితులు కావడం ప్రారంబించారు . ఇది ఎంత వరకు వెల్లిందంటె చ" కులం ని బట్టి  మత మార్పిడి రేటు నిర్ణయించే స్తాయి దాక . ఉదాహరణకు వారి  మతం లోకి
దళితుడు చేరితే ఒక రేటు , వెనుకబడిన వర్గాల వారికి ఒక రేటు , అగ్రవర్ణాల వారికి ఒక రేటు ఉన్నాయి అంట .దళితుడికి వేయి రూపాయిలు ఇస్తే , అగ్రవర్ణం వారికి లక్ష రూపాయిలు ఇస్తారట .మన రాష్ట్రం లో  ఒకప్పుడు గుంటూరు కేంద్రంగా సాగే ఈ వ్యాపారం ఇప్పుడు  తెలుగు జిల్లాలు అన్నింటికి పాకింది .

అయితే ఇక్కడే ఒక గొప్ప మార్పు జరిగింది . డబ్బుకు ఆశ పడి అందులోకి వెళ్ళిన " పండిత పుత్రులకు " తమ పూర్వ మతం లోని వాసనలు వదిలించుకోవడానికి సుతరాము ఇష్టం లేదు అందుకే అక్కడా తమ కంపుని వెదజల్లడం మొదలెట్టారు . నా మిత్రుడు ఒక రెడ్డి గారు ఉన్నారు . అయన గారు కోరి కోరి క్రిష్టియానిటీ స్వీకరించారు .ఆతను ఎంత మత  విశ్వాసిగా మారాడు అంటె , క్రిష్టియన్ మతం లో పుట్టి పెరిగిన వారు కూడా అంత గా ఏసు ప్రభువుని ద్యానించరేమో . అయన ఆ మతం లో చేరడమే కాదు , అయన స్నేహితులు అందరిని , చివరకు ఒక దేవాలయం కి వ్యవస్తాపక ధర్మనైన  నన్ను కూడా ఆ మతం లోకి రమ్మని కోరేవాడు . నేను ఆయన్ని ఒకటే అడిగాను " రెడ్డి గారు , మీరు మీ అమ్మాయిని క్రిష్టియన్ మతం లో ఉన్న సకల  అర్హతలు గల దళిత యువకుడికి ఇచ్చి పెండ్లి చేయగలరా ? అని అడిగితే , దానికి నా మీద కోపగించుకుని చానాళ్ళు మాట్లాడలేదు . ఇలా ఉంటుంది  వారిలోని సమ బావం . ఇలాంటి వారినే వాటికన్ సిటి ప్రోస్తాహిస్తుంది  అనడానికి  , నిన్న డిల్లిలో  జరిగిన " తమిళ నాడు దళిత కాదలిక్ సంఘాల వారి అందోళన   చేస్తుంది .

   నిన్న తమిళ నాడుకు చెందిన దళిత కాదలిక్ సంఘాల వారు ఒక నిరసన కార్యక్రమం దిల్లిలో చేపట్టారు  . ప్రదర్శనగా వెళ్లి డిల్లి లోని " వాటికన్ రాయబార కార్యాలయంలో " ఒక వినతి పత్రం ఇచ్చారు ఆ వినతి పత్రం లో 18 డిమాండ్లు ఉన్నాయట . అందులో ముఖ్యమైనవి
      కాధలిక్ చర్చ్ లలో ఉన్న దళిత అంటారని విదానం నిర్మూలించాలి

      బ్రతికి ఉన్న మనుసుల మద్యే కాదు , చివరకు శ్మశానం లో కూడా దళితులను అంటరాని వారి గా బావించి ,             వారి శవాలను, ఇతరుల శవాలకు దూరంగా పాతి  పెట్టె అంతాన్ని విదానం పోవాలి.

       అగ్రవర్ణ  కాదలిక్ లు తమ పేరుల చివర పెట్టుకునే "కుల నామాలు " తీసి వేయాలి .

      చర్చ్ పాధర్ పోస్టుల్లో  లలో 80% రిజర్వేషన్ లు దళితులకు ఇవ్వాలి .

  " దళిత కాదలిక్ ల పట్ల జరుగుతున్నా అంటరాని వివక్షత గురించి వాటికన్ సిటీ పెద్దలకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినప్పటికి వారు పట్టించుకోక పోవడం వలననే తాము ఇలా వీదుల్లోకి వచ్చి అందోళన చేస్తున్నాం" అని వారు వాపోయారంటే ఆ మతం లో దళితులు ఎంత  దయనీయ స్తితిలో ఉన్నారో అర్దం అవుతుంది . కాబట్టి అయ్యలారా , అమ్మలారా ! అంటరాని తనం అనేది  కొన్ని మతాల లోని "పండిత పుత్రుల " సృష్టియే తప్పా వేరు కాదు. అది హిందూ జీవన విదానంలో భాగం కాదు . సదరు " పండిత పుత్రులు"  ను వాటికన్ సిటీ వారు ప్రోత్సాహిస్తున్నారు అంటె  మనుషులంతా ఒకటే అన్నది వారు చెప్పే పై పై మాటలు అనేది ఇట్టె అర్దమవుతుంది . వారి మాటలు నమ్మి , వారు ఇచ్చే తాయిలాలకు ఆశపడి అన్య మతం లోకి వెళ్ళినంత మాత్రానా ఒరిగిదేమీ లేదు . నిన్నటి దాక స్వ మతంలో వీరంగం వేసిన వారు , ఇప్పుడు అన్య మతం లోకి వెళ్లి వేదికల మీద "చిందులు " వేస్తున్నారు . ఇక్కడైనా , అక్కడైనా వారికి పరమాత్మ తత్వం ఏమి తెలియదు " స్టేజి ల మీద ఎగేరేగిరి దాన్న్స్ " లు వేయడం తప్పా , వీరు ఎప్పటికి పండితులు కాజాలరు, పరమ సత్యం కనుగొనలేరు  . వీరు " పండిత పుత్రులు " అంతే!  వారిని నమ్మి దళిత సోదరులు   ఉన్న మతం వీడి " అన్య మతం లోకి వెళ్లి  రెంటికి చెడ్డ రేవడిలు " కానవసరం లేదు అనేదే నా అభిప్రాయం. మీ స్వ మతంలో తప్పులను మీరే సరి చేసుకోవాలి తప్పా , వేరే మతస్తులు  కాని మత విదానాలు కాని ఆ పని చేయ జాలరు . ఈ విషయం లో గాందీ గారే మనకూ ఆదర్శం కావాలి .

 SOURCE :-          http://www.thehindu.com/news/national/dalit-catholics-petition-vatican-against-discrimination/article6694525.ece?homepage=true

                                                    (16/12/2014 Post Republished).

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం