అత్యాచారాన్నీ ఆపలేకపోతే ఆనందించేయి ! అవినీతిని ఆపలేకపొతే అందలం ఎక్కించేయి !


                                                  

 రాజనీతి శాస్త్రం లో ఒక వాదం ఉంది . దాని పేరే ఉపయోగితా వాదం లేదా "అత్యంత ఆనంద మయ " వాదం . దీనిని ఆంగ్ల రాజనీతిజ్ణుడు అయిన "బెందాం " అనే అయన ప్రతి పాదించాడు. అయన ద్రుష్టిలో సహజ న్యాయాలు , సహజ హక్కులు అనేవి పనికి రానివి. ఏ విషయాన్ని అయినా అది కలిగించే ఆనందం , బాదల స్తాయి ద్వారానే అంచనా వేసి నిర్దారించాలంటాడు. దాని ప్రకారమే చట్ట సవరణలు కావాలన్నాడు. దీనికి ఒక ఉదాహరణ చూదాం .       
            ఒక వ్యక్తీ వేరే వ్యక్తీ అంగీకారం లేకుండా బలవంతంగా  అతని నోట్లో స్వీట్ పెట్టాడనుకోండి . దాని వలన ఆ స్విట్ తిన్న వ్యక్తికి  షుగర్ వ్యాది లేనపుడు ఏమి నష్టం? ఒక మధుర పదార్దం ఆస్వాదించడం అనేదేగా జరిగింది! మరి దీనికి ఆ స్విట్ పెట్టిన వ్యక్తిని కఠినంగా శిక్షించటం సబబా? ఇదీ అయన సిద్దాంత సారాంశం. ఎక్కువు ఆనందం, తక్కువ బాద కలిగించేవి 'మంచి పనులు ', తక్కువ ఆనందం , ఎక్కువ బాద  కలిగించేవే "దుష్ట కార్యాలు" అంటాడు. కాబట్టి ఈ  సిద్దాంతం ప్రకారం పై ఉదాహరణలో చెప్పింది మంచి పనే తప్పా , చెడు పని కాదు అన్నమాట. సహజ హక్కులు, సహజ న్యాయం అంతా ట్రాష్ .

  దిక్కు మాలిన ఈ  సిద్దాంతం నుండి పుట్టిందే " రేప్ ను ఎదుర్కోవడం చాత కాకపోతే దానిని ఆస్వాదింఛి ఆనందించు " అనే ఆంగ్ల నానుడి . దీనిని ప్రస్తావించి C.B.I  డైరెక్టర్ ఒకరు చిక్కులో ఇరుకున్నారు . మొన్నీ  మద్య "రంజిత్ సిన్హా " అనే 'C.B.I  డైరెక్టర్' గారిని 'ఆటల్లో నైతికత '  అనే దాని మీద ప్రసంగించమని కోరితే , దానిని వదిలేసి పై ఆంగ్ల సామెత ఉదహరించి ఆడాళ్ళను అవమానించాడట. మన దేశ సాంప్రాదాయిక బావాలు కు వ్యతిరేకమైన ఇటువంటి తప్పుడు బావాలు  "వ్యాపార సంస్క్రుతి " అభివృద్ధి చెందడానికి బాగా దోహదం చేసాయి . మనిషి లోని సహజ స్పందన అయిన "ప్రతి స్పందన" లేక ఎదిరించుట  అనే బావననే పూర్తిగా తేలిక చేసే సిద్దాంత మిది . ఈ  సిద్దాంతం వలననే "రేపిస్ట్ " లకు తక్కువ శిక్షలు పొందు పరచారు చట్టాలలో.  "వస్తు దోపిడికి " ఎంత శిక్షో , "లైంగిక దోపిడికి " అంతే శిక్ష  అనేది ఈ  సిద్దాంత ప్రబావమే .

    సరే, మన దేశ సాంప్రదాయ బావాలకు వ్యతిరేక మైన   C.B.I  డైరెక్టర్ గారి మాటలకు భారతీయులు రియాక్ట్ కావడం సహజం. "రేప్" ల విషయం లో ఎంజోయ్ చేసే నీచ స్తాయిని  భారతీయులు అంగీకరించక పోయినా , అవినీతి విషయం లో మాత్రం దీనిని పరోక్షంగా అంగీకరిస్తూ , అవినీతి పరులను అందలం ఎక్కిస్తున్నారు . "వాళ్ళెంత దోస్తే మనకెందుకు? మనకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇస్తున్నారా  ? లేదా? అనే సంకుచిత ప్రయోజన వాదం మనలో అభివృద్ధి చెందటానికి విదేశి "వ్యాపార వాద "అనుకూల  బావనలే కారణం అని చెప్పక తప్పదు . అ బావమే మనలో "ఇంతింతై  వటుడింతై" అన్న చందాన పెరగిపోవటం వలన ,దేశం లో అవినీతికి అడ్డూ , అదుపు లేకుండా పోయి , చివరకు దెశ  సంపద నల్ల డబ్బు రూపం లో విదేశి బాంకులకు చేరి పోయింది. కోట్ల కొలది రూపాయల కుంభకోణం లో పాత్ర ఉన్నవారే "ప్రజానాయకులు" గా చలామణి అవుతున్నారు . " ఎన్నికలలో అవినీతి ని నిరోదించటం బ్రహ్మ తరమైనా కాదు" అనే బావనకు ప్రజలు వచ్చి, "వోటుకు వేయి రూపాయలు " డిమాండ్ చేసే నీచాతి నీచమైన స్తాయికి దిగజారటానికి ఎవరు కారణం". ఖచ్చితంగా విదేశి బావజాలమైన "ఉపయోగిత వాదమే". !మన పొరుగు దేశమైన చైనా లో అవినీతి కి "ఉరిశిక్ష " వేస్తే , మనం తూ , తూ  మంత్రాలు శిక్షలు విదించటానికి కారణం మనలో రియాక్షన్ లేకుండా చేసిన విదేశి బావజాలమే .

   కాబట్టి , అత్యాచారాల విషయంలో భారతీయ స్త్రీల ఔ న్నత్యం వలన "ఉపయోగిత వాదం " లేదా అత్యంత "ఆనంద మయ " వాదం సక్సెస్ కాలేక పోయినా,నిరోదించే "మగాళ్ళు " లేని కారణంగా అవినీతి విషయం లో మాత్రం సక్సెస్ అయిందని చెప్పవచ్చు.

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )