'ఆవు' నీదేరా అబ్బాయి! పాలలో సగం వాటా మటుకు నీ సీమాంద్రా అన్న కే!
ఏదైన ఒక ఆస్తిని పొందుతున్నపుడు దానీ మీద సర్వ హక్కులతో బదిలీ అయితేనే అ ఆస్తికి యజమానీ అని చెప్పుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఆస్తి బదలాయింపులు పత్రాలలో ఆ మేరకు రాయటం జరుగుతుంది . కానీ కొన్ని సందర్బాలలో అన్నదమ్ముల ఆస్తుల పంపకాలలో కానీ, ప్రెస్క్రిప్షన్ రైట్స్ పొరుగువారికి ఉన్న ఆస్తులలో కానీ , ఆస్తి మీద యాజమాన్య హక్కు ఒకరిదైతే , దాని మీద కోంత అనుభవ హక్కులు వేరే వారిక ఉంటాయి. ఉదాహరణకు మనం ఒక ఇల్లు కొనుగోలు చేస్తున్నాం. ఆ ఇల్లు కట్టిన అసామిక్ అది వాళ్ళ ఉమ్మడి కుటుంభ ఆస్తి పంపకాల ద్వారా వచ్చిందనుకోండి. ఆ ఇంటిక్ పైన ఉన్న అతని సోదరుల ఇOడ్లకి వెళ్ళటానిక్ ఇతని ఇంట్లో నుంచే వెళ్ళటం తప్ప వేరే దారి లేనపుడు తప్పకుండా అతని సోదరులకు ఇతని ఆస్తి లోనుంచే నడచే హక్కు కల్పిస్తారు. ఇప్పుడు ఇతను ఇల్లు మనకి అమ్మినా అతని సోదరులకు ఉండే నడక హక్కును వారు కోల్పోరు. చచ్చినట్లు మనం వారిని అనుమతీమ్చాలి. కాబట్టి ఇలాంటి లింక్ లు ఉన్న ఆస్తులను అన్నదమ్ములే ఖరీదు కట్టి వాల్చేసుకుంటారు
అన్నదమ్ముల మద్య మంచి సంబందాలు ఉంటే ఉమ్మడి హక్కుల వినియోగానిక్ పెద్ద ఇబ్బందేమీ ఉండదు. కానీ ఒకరంటే ఒకరు విద్వేషాలు , అసూయ ఉండే అన్న దమ్ములు అయితే ఖచ్చితంగా రోజూ గొడవలే తప్పా ప్రశాంతి అనేది ఉండదు ఆ కుటుంబాలలో. అదే జరుగబోతూంది తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయం లో. ఇప్పుడు ఉన్న పరిస్తితులను బట్టి రేపు రాష్ట్ర విభజన సమయంలో ఆంద్రప్రదేశ్ కు చెందిన జల వనరులు రెండు రాష్ట్రాలకు పంపకాలు చేస్తారు. క్రిష్ణా నది అంటే రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంది కాబట్టి రెందు రాష్ట్రాలు నీటిని పంచుకోవాలి .
అలాగే గోదావరి మీద ప్రస్తుతం అనుమతులు మాత్రమే పొందిన "దుమ్ముగూడెం ' ప్రాజెక్టు కోడా రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనం కోసమే. మరి వీటి ద్వారా జల వినియోగం గొడవలు లేకుండ,తెలంగాణా అంద్రా రాష్టాలకు పంపిణీ చేయాలంటే కేంద్ర జలవనరుల సంఘం అజమాయిషీ లో ఉండాల్సిందే అని అంటారు .
అలాగే హైదరాబాద్ లో సీమాంద్రుల రక్షణ ఇప్పటికే పెద్ద సమస్యగా చిత్రీకరించబడడానికి , తెలంగాణా లోని కొంతమంది నోటి దూల, కొంగర మల్లన్న చేష్టలు ఉపయోగపడ్డాయి . అంతే కాదు ఇతర తెలంగాణాలో జిల్లాల్లో ఉన్న సెట్టిలర్స్ రక్షణ కూడా ఒక సమస్యగా రేపు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ముందుకు రావచ్చు.దీని సాకుగా చూపి సీమాంద్రా సెట్తిలర్స్ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తెచ్చినా అచ్చర్య పోనవసరం లేదు. దాని అమలు కోసం కోడా కేంద్ర అజమాయిషీ అవసరం అంటారు . ఇలా ఇన్ని నిబందనలతో జరిపే పంపకాల ద్వారా లభించే తెలంగాణా వల్ల తెలంగాణా రాష్ట్రానిక్ ఏమి ఉపయోగం?
ఇప్పటిదాక సీమాంద్ర పాలకుల దౌర్జన్యం అంటున్నారు , మరి రేపటి నుంచి పైకి తెలంగాణా రాష్ట్రం అని చెప్పినా , పరోక్షంగా కేంద్ర అజమాయిషీ లో ఉండక తప్పని పరిస్తితి. ఒక అవును తమ్ముడికి ఇచ్చి, పాలు సగం మాత్రం అన్నకి ఇవ్వాలని, అలా ఇప్పించడానికి మా మనిషి అజమాయిషిలో మీ అవును ఉంచాలని చెపితే ఆ ఆవు వల్ల తమ్ముడికి ఏమిటి లాభం? అదే రేపు తెలంగాణా వారి పరిస్తితి! చూసి మురవా ,చెప్పుకుని ఏడ్వ! అంతే! అందుకే తెలంగాణా రావడం ముఖ్యమే అయినప్పటికి దాని కంటే ముఖ్యం ఎటువంటి కేంద్ర అజమాయిషీ లేని స్వేచ్చా తెలంగాణా రావడం ముఖ్యం.
Comments
Post a Comment