'కప్పగంతుల' వారి మాటను తెల్లారే సరికి నిజం చేసిన "దుబ్బాక పోలిస్ A.S.I,Mr.పాషా "

                                                                 

నిన్న ఇదే బ్లాగులో విజయవాడ లోని పటమట పోలిస్ వారు ఒక కేసు దర్యాప్తు విషయంలో , పిర్యాదిదారుల పట్ల వ్యవహరించిన తీరును తప్పు పడుతూ   "అవమానకర  దర్యాప్తు తో ఇల్లాలిని అవమానించి మాజీ న్యాయ మూర్తి చేతనే కంట తడి పెట్టించిన పటమట పోలీసులు "  అనే టపా పెట్టడం జరిగింది . దానికి బ్లాగ్ మిత్రులు ,పెద్దలు శ్రీ తాడిగడప శ్యామల రావు గారు , శ్రీ కప్పగంతుల శివ రామ ప్రసాద్ గారు,మరియు  శ్రీ నిష్టల సుబ్రహ్మణ్యం గారు  వారి వారి స్పందనలు తెలియ చేసారు . ముఖ్యంగా శ్రీ శివ రామ ప్రసాద్ గారు
  " మన దేశంలో పోలీసుల వైఖరి ఇప్పటికి కూడా వాళ్ళేదో పైనెక్కడో ఉన్నారని, ప్రజలను  బానిసల్లాగా చూడాలని అన్న భావన వాళ్ళ రక్తంలో పారుతోంది. రిక్రూట్మెంట్ సమయంలో జరిగే ఘోర అక్రమాలు, ఉద్యోగాలు అమ్ముకునే సంస్కృతి, ప్రమొషన్లు, పోస్టింగులు వేలంవేసుకునే సంస్కౄతి ఉన్న పోలీసు వ్యవస్థలో మామూలు  మనుష్యులు ఉంటారని ఎలా అనుకోగలం. పోలీసుల్లో మర్యాదగా మాట్లాడగల వాళ్ళు అసలు ఉంటారా? ఈ సంఘటనలో పోలీసుల తీరు ఘోరం." అని స్పందించడం జరిగింది . అలా అన్న 3 గంటల లోపే తెలుగునాట పోలిసుల వైఖరి గురించి కప్పగంతుల వారు చెప్పిన దానికి నిదర్సనంగా మరో దురాగతం బయల్పడింది . అది ఏమిటంటే ,

      "మెదక్ జిల్లా , దుబ్బాక మండలం , హబ్సి పూర్ కు చెందిన ఒక కుటుంబం  మీద , దుబ్బాక పోలిస్ స్టేషన్ లో A.S.I గా పని చేస్తున్న పాషా అనే అయన , రాత్రి వేళలో , పుల్ గా మద్యం సేవించి , దాడి చేసాడు అట . దాడికి కారణం ఆ కుటుంబ పెద్ద మిద పొరుగు వారు ఇచ్చిన కంప్లైంట్ అట . అయితే నియమ నిబందనలు అనుసరించి , నిందితుల మిద చర్యలు తీసుకుంటే ఎవరికీ అబ్యంతరం ఉండదు కాని , చేతిలో అధికారం ఉంది కదా అని , సంసార గ్రుహాల్లోకి , చెప్పా చెయ్యకుండా రాత్రి వేళలోజోరబడితే పిల్లా , జెల్లా ఉన్న కుటుంబం కి ఎంత ఇబ్బంది ? రాత్రివేళ సదరు A.S.I గారు బార్య , భర్త ఉన్న గదిలోకి జొరబడి , క్రింద చాప మిద పడుకున్న పాప మిద బూటు కాలు తో త్రోక్కితే , పాపం ఆ పాపకి వెంటనే మల మూత్ర విసర్జన జరిగి0దట. దానితొ  కంగారు , ఆందోళనతో , ఏమి జరుగుతుందో తెలియని స్తితిలో ఉన్న ఆ పాప తల్లి తండ్రులను విచక్షణా రహితంగా బాదటమే  కాక వారిని ఆ రాత్రే పోలిస్ స్టేషన్ కి తరలించాడట. అ పాప పరిస్తితి సీరియస్ కావటంతో , బందువులు ఆమెను హాస్పిటల్ కి తరలిమ్చారట . ఇది జరిగి 3 రోజులైంది . పాప పరిస్తితి విషమం కావటం ఆమె హాస్పిటల్లో చనిపోయింది . ఈ రోజు పొద్దున్న పాప శవంతో పాప బందువులు దుబ్బాక పోలిస్ స్టేషన్ ని ముట్టడిస్తే , A.S.I Mr .పాషా పరార్ అట . C.I  గారేమో కంప్లైంట్ చేస్తే న్యాయం చేస్తాం అంటున్నారట . కేసు విచారణలో ఉంది / అది పోలిస్ వారి నిర్వాకం .

     శివరామ ప్రసాద్ గారు అన్నట్లు , ప్రతి పనికి పైసాతో రేటు కట్టే వ్యాపార సంస్కృతి ఉన్న మన లాంటి సమాజంలో పోలిస్ అధికారుల నుంచి చట్టబద్ద విదానాలు ఆశించడం అత్యాశే అవుతుంది . తప్పు చేసిన అధికారుల మిద చర్యలు తీసుకుంటే వారి ఆత్మ స్థైర్యం దెబ్బ తింటుంది అనే తప్పుడు ఆలోచనలు  వలన , ఖాకీలను వారు చేసే పనులకు పర్సనల్ గా జవాబు దారిగా చెయ్యడానికి పై అధికారులు సుముఖంగా లేరు . దిని వలన ప్రత్యర్ది వర్గాలు లంచాలకు తల్లోగ్గి , కేసుల విచారణ విషయంలో అత్యుత్సాహం చూపడం, ఎ మాత్రం లబ్ది లేకపోతె అవసరమైన కేసులలో సాచేత దోరణి అవలంబించడం కొంత మంది పోలీసులకు పరి పాటిగా మారింది .ఈ రోజు దుబ్బాక లో జరింగింది పోలిస్ వారి అత్య్త్సహానికి నిదర్సనం అయితే ,  నిన్న విజయవాడలో జరిగింది వారిలోని సాచేత దోరణి కి గుర్తు. ఈ రెండు విదానాలు సమాజానికి , కేసుల దర్యాప్తుకు పనికి రానివే . ప్రతి వారు ఏమి చెయ్యాలి , ఎలా చెయ్యాలి అనేది స్పష్టంగా చట్టాలులో పొందు పరచారు మన పెద్దలు . వాటి ప్రకారం చేస్తే ఎవరికీ ఎటువంటి అబ్యంతరం ఉండదు . కానీ అలా చేస్తే తమకు వచ్చేది ఏమి ఉండదు అని ఇష్టం వచ్చినట్లు చేస్తే , ఏదో ఒక నాడు పోలిస్ స్టేషన్ లు వదిలి పెట్టి పరారయె రోజులు వస్తాయని ఈ  ఉదంతం తెలియ చేస్తుంది .   పోలిస్ వ్యవస్తలో సమూల మార్పులు రావాల్సి ఉంది . అది ఒక రోజులో అయ్యే పని కాకపోవచ్చు . కాని చైతన్యవంతులైన ప్రజలు తప్పు జరినప్పుడల్లా , వారి వారి అవకాశాలను అనుసరించి , కార్యాచరణ తో కూడిన ప్రతి స్పందన తెలియ చేస్తుంటే  మాత్రం అది ఆనతి కాలం లోనే సాద్యమవుతుందని నా దృడ విశ్వాసం . .



అవమానకర దర్యాప్తుతో ఇల్లాలి ని అనుమానించి, మాజీ న్యాయ మూర్త్రి చేతనే కంట తడి పెట్టించిన "పటమట పోలీసులు " అనే టపా కోసం లింక్ మిద క్లిక్ చెయ్యoడి. http://ssmanavu.blogspot.in/2014/03/blog-post_18.html 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!