తాగిన మత్తులో తాళి కట్టిన ఇల్లాలిని చంపితే , ప్రభుత్వం పైన్ కట్టాల్సిందే నట !

                                                                         

ఇన్నాళ్ళు  "మద్యం" ఆదాయపు మత్తు తలకెక్కి , ప్రజల సంసార జీవన స్తితిగతులను పట్టించుకోని ఆంద్ర ప్రదేశ్ సర్కార్ కు రాష్ట్ర హై కోర్టు వారు చాచి లెంపకాయ ఒకటి కొట్టారు . మొన్న వారు ఇచ్చిన తీర్పు స్పూర్తి తో , తెలుగువారిలో ఏమన్నా తెలివి వచ్చి , ఇక నుంచి  రాష్ట్ర ప్రభుత్వ మద్యo  పాలసి వల్ల  బాదితులైన కుటుంబాలు కోర్టులను ఆశ్రయిస్తే , మద్యం అమ్మకాలు వలన రాష్ట్ర ప్రబుత్వానికి వచ్చె ఆదాయం కంటే , బాదితులకు చెల్లించే నష్ట పరిహారాల మొత్తమే ఎక్కువుంటుంది . "సాహెబ్ గారి సంపాదన బేగం గారి మందుల ఖర్చుకు చాలవు" అన్నట్లు తయారవుతుంది రాష్ట్ర ఖజానా పరిస్తితి. ప్రజా సంక్షేమమే ప్రజా ప్రబుత్వాల పరమావధి కావాలి అనే విషయాన్ని రాష్ట్ర సర్కార్ కు గుర్తు చేస్తూ , హై కోర్టు వారు ఇచ్చిన ఈ  తీర్పు ఆహ్వానించ తగినది మరియు ఆలోచించ తగినది .

  వరంగల్ జిల్లా అర్పనపల్లికి చెందిన ఘనపురపు రవి , రాష్ట్ర ప్రభుత్వ "మద్యం పాలసి " కి మెచ్చి ,  మద్యం దుకా ణానికి డైలీ  రెగ్యులర్ కష్టమర్ అయ్యాడు . మద్యం అమ్మకాలు లో వృద్ది కోసం కష్ట పడి పనిచేసి ,  మద్యం అమ్మకాలు పెంచుతున్న ఎక్సైజ్ అధికారులకు బహుమతులు ప్రకటిస్తున్న , తెలుగునాడు సర్కార్ ను చూసి , ఆనందం తట్టుకోలేక పుల్ గా మందు కొట్టి మరి రోడ్డు మీద దొర్ల సాగాడట . పండుగల వేళ పన్నెండింటి దాక అయినా  సరే ,మద్యం దుకాణాలు  తెరిపిoఛి ఉంచి , ప్రజల కు ఆనందం సరపరా చేస్తున్న గవర్నమెంట్ ను చూసి , ఇక తట్టుకోలేక అసలు ఇంటికి రాకుండా , దుకాణం దగ్గరే మకాం పెట్టేసాడు అట .

    మందు కొడితే సర్కార్ కు లాభం కాబట్టి , సర్కార్ కి ముద్దు . కాని  సంసారం గడవడానికి పైసలు తెచ్చె మొగుడు , అలా ఇంట్లో పైసలన్ని కాజేసి , సర్కారి లైసెన్స్ దుకాణానికి ఇచ్సుస్తుంటే , ఏ  ఇల్లాలు మ్మాత్రం ఓర్పు వహిo చగలదు ? అటు ఒళ్ళు ,అందుకే  ఇటు ఇల్లు గుల్ల చేస్తున్న రవి ని నిలదీసింది  అతడి భార్య , అంతే ! కోపం తో బయటకు పోయి పుల్ గా మందు కొట్టి , ఇంటికి వచ్చి భార్య ను గొంతు నులిమి చంపాడట . ఆ  పై కిరోసిన్ పోసి ఆమెను దహనం చేసాడట . ఈ తతంగం అంతా బిక్కచచ్చి చూస్తున్న రవి  6 యేండ్ల కొడుకే  మహబూబాబాద్ ట్రయిల్ కోర్టులో సాక్ష్యం చెపితే , దాని ఆదారంగా అతనికి ట్రయిల్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విదించింది . ఈ తీర్పు  అన్యాయమని , హై కోర్టులో అప్పీల్ చేసిన రవి వాదనను తిరస్కరిస్తూ హై  కోర్టువారు జస్టిస్ L .నరసిoహ్మారెడ్డి , జస్టిస్ M .S .K జైస్వాల్ గార్లతో కూడిన ధర్మాసనం క్రింది కోర్టు తిర్పునే ఖరారు చేస్తూ తీర్పును ఇచ్చారు . ఈ సందర్బంగా కోర్టు వారు రాష్ట్ర ప్రబుత్వ సర్కార్ యొక్క మద్యం విదానాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు .
   
    " ప్రభుత్వం అనుసరిస్తున్న అసాంఘిక మద్య విదానంతో ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి . ముక్యంగా బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలు మద్యం రక్కసి కోరలుకు బలి అవుతున్నాయి .కొర్తుల్లొ దాఖలైన క్రిమినల్   అప్పిళ్ళ కేసుల్లో ఎక్కువ శాతం మద్యంతో ముడి పది ఉన్న కేసులే . ఈ  కేసులో సైతం మద్యానికి బానిసైన భర్త భార్యను హత్య చేయడం వలన ఆమె పిల్లలు ఆదారం కోల్పోయారు . దీనిలో రాష్ట్ర  ప్రభుత్వబాద్యత కూడా ఉంది  కాబట్టి, చనిపోయిన  ఆమె పిల్లలు ఇద్దరికీ తలా 2 లక్షలు రూపాయల చొప్పున, రాష్ట్ర ప్రభుత్వం  , బ్యాంకులో పిక్సిడ్ డిపాజిట్ చేయాలి " అని హై కోర్టు తీర్పులో పేర్కొన్నారు .

   కాబట్టి ఇకనైనా , మద్యం బాదిత కుటుంబాలు , ఏదైనా జరుగ రానిది , మద్యం వలననే జరిగినప్పుడు, ప్రభుత్వాన్ని బాద్యులు గా చేస్తూ ,  కోర్టుల  తలుపు తడితే తప్ప కుండా వారికి నష్ట పరిహారం ఇప్పించడానికి పై తీర్పు ఉపయోగ పడుతుంది .కనీసం ఇలాగైనా ఎక్కువ కేసులు ప్రబుత్వాన్ని బాద్యులుగా చేస్తూ , దాఖలైతే , అప్పుడన్నా ప్రజల జీవన స్తితి గతులును పట్టించుకునే ఆలోచన చేస్తుందేమో .  నా దృష్టిలో బలహీన వర్గాలకు రాజ్యాదికారం ఇవ్వడమంటే , అ యా సామాజిక వర్గాలలో ఎవరో ఒకరిని "ముఖ్య మంత్రి " చేయడం కాదు , వారిలోని తాగుడు  అలవాటును ను మాన్పించ గలిగితే , రాజ్యాధికారం గురించి వారే పోటి పడగలరు . లేకుంటే సింహాసనం మిద ఎ సామాజిక వర్గపు వారిని కూర్చో పెట్టినా , బలహీన వర్గాలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు .
      

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )