ఎంత మేదావి అయినా ,ఒంటె నెక్కక పొతే ఓట్లు వేసేది లేదన్నారట హైదరాబాద్ వాసులు!

                                                                           

నిజంగా మానాభి మానాలు ఉన్న వారికి , మేధావులకు ఈ కాలపు రాజకీయాలు చూస్తుంటే ఎంత అసహ్యం వేయాలో అంత అసహ్యం వేస్తుంది . ఎన్ని డిగ్రీలు పుచ్చుకున్నా , ఎంత మేదావి అయినా రాజకీయం లోకి అడుగు పెట్టాకా చేతులు కట్టుకు నిలబడి , పైసాకు పనికి రాని వాడితో పోటీలు పడి నానా మాటలు అనిపించుకోవలసిందే . ఇంట్లో పెళ్ళాం బిద్దలుని పట్టించుకోని వారు, బలాదూర్ గా పోకిరిగా తిరిగే వారు , జులుం చేసి ప్రజలను భయపెట్టే వారు , చీటికి మాటికి కొట్లాటలు కు పోయి కేసులు పెట్టించుకునే వారు , విరే రాజకీయ రంగానికి పనికొచ్చే కార్యకర్తలు . వీరికి బాగా  డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్న వారు గాడ్ పాదర్లుగా ఉంటె , ఆనతి కాలంలోనే నాయకులై ప్రజల ని ఎలేయ్యడానికి , అర్హత సంపాదిస్తారు .

  అటువంటి వారు , రాజకీయ పార్తిలలో ప్రదాన స్తానాలో ఉంటె , వారికి చిన్న పెద్ద అని కాని , జ్ఞానం , వివేకం ఉన్నవారికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో కాని తెలియదు .ఎక్కడ మేధావులకు ప్రాదాన్యత ఇస్తే తమ లాంటి వారిని తోకేస్తారో అనే అబద్రతా బావంతో , వారిని  అవహేళన చేస్తూ , మానసికంగా దెబ్బ తీస్తూ ఉంటారు . అందుకే మేధావులు , ఆత్మాభిమానం గలవారేవ్వరూ రాజకీయ రంగానికి రావడానికి ఇష్టపడరు . కాని జయ ప్రకాష్ నారాయణ్ , చంద్ర బాబు లాంటి వారు "మేధావులు రాజకీయాలలోకి రాకపోతే సమాజానికి నష్టం" అంటుంటారు. మేదావులని నిర్లక్ష్య పరచే సమాజం కోసం మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉందా ? అని అప్పుడప్పుడు అనిపిస్తుంది . "సమాజం ని కేమిచ్సింది అని కాదు , సమాజానికి నీవేమి ఇచ్చావు  అన్నదే ముక్యం " అనేది 1960 కి ముందు మాట . "నా అవసరం నీకు లేనప్పుడు , నీ  అవసరాలు నాకనవసరం " అనేదే నేటికి పనికొచ్చే మాట .

       మేధావులు అణచి వేసి ఎ సమాజం బాగుపడినట్లు చరిత్రలో లేదు . ఒక్క చాణక్యుడిని అవమాన పరచినందుకే , లక్షలాది సైన్య బలం ఉన్న నంద వంశం సమూలంగా సర్వ నాశన మయింది . అయినా 100 రూపాయలు తీసుకుని వేసే ఓటుకు , బాగా అలోచించి వేసే వోటుకు ఒకే విలువ ఉన్న ప్రస్తుత రాజకీయ వ్యవస్తలో మేధావులకు రాజకీయాలలో సముచిత స్తానం దకుతుంది అనుకోవడం అత్యాసే అవుతుంది . ఒక రాజనీతి సిద్దాంతం ప్రకారం సమాజం లో అజ్ఞానులు అనారోగ్యంతో నశించాలంటే "నకిలీ వైద్యులను " ప్రోత్సాహించడమే కరెక్టు అంటా . ఇది చూడటానికి దుర్మార్గపు ఆలోచన కనపడుతున్నప్పటికి , తనకు నష్టం కలిగిస్తున్న మానవ జాతి వినాశనానికి ప్రక్రుతి అనుసరిస్తున్న పద్దతి ఇదే . అందుకే దొంగలు పాలకులుగా పరిణమించారు . వారిని నియత్రించడం ప్రస్తుత ప్రజాస్వామ్య విదానంలో అసాద్యం కావచ్చు . వారి పని పట్టడం కోసం దేవుడు దిగి రావాల్సిందే .

     పైన చిత్రం లో చిరునవ్వులు ఒలకబోస్తూ ఒంటె మిద కూర్చున్న మేదావి గారిని చూస్తె ఏమనిపిస్తుంది . ఒంటె ఎకితే గాని ఒత్లేయరేమోనని , అందరి రాజకీయ నాయకులకు మల్లె , తనకు ఇష్టం లేని పనిని కూడా , ఇష్టంగా చేస్తున్నట్లు లేదూ ? ఎన్ని ఒంటెలు ఎక్కినా, ప్రజల దగ్గర ఓట్లు ఎలా కొల్లగోట్టాలో మేధావులకు అస్సలు తెలియదు కాక తెలియదు . 

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )