ఆంధ్రా అసెంభ్లికి దారేది అంటున్న పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగ్రేటం పై ఒక పరిశిలన !.

                                                   
 

పవన్ కళ్యాణ్ ! వేలాది అభిమానుల గుండెల్లో తనదైన ముద్ర వేసుకున్న తెలుగు నటుడు . మెగా స్టార్  తమ్ముడిగా సినిమా రంగానికి పరిచయమయినా  , ఆనతి కాలంలోనే తన ప్రత్యెక మేనరిజం తో అభిమానులను ఆకర్షించ గలిగాడు . దానివలన అయన సినిమాలు బాక్సపిస్ వద్ద విజయాలు నమోదు చెసుకున్నాయి. అయన కున్న ప్రత్యెక మేనరిజాలలో సరిగ్గా నిలబడి ఎక్కడా డైలాగ్ చెప్పక పోవడం ఒకటి . నిలబడి డైలాగే చెప్పలేని వాడు , నిజజీవితం లో మాట మిద నిలబడగలుగుతాడా  అని అయన విమర్శకుల ప్రశ్న . అలాగే అయన వైవాహిక జీవితంలో అస్తిరత్వం ఆయనకు పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. నిలబడి డైలాగ్ చెప్పలేని మేనరిజానికి , అయన వైవాహిక జీవితంలో అవలంబిస్తున్న అస్తిర చర్యలకు ఏమైనా సంబందం ఉందా అనేది మానసిక ప్రవర్తనా విశ్లేషకులు చెప్పాలి తప్పా, రాజకీయ విశ్లేషకులు కాదన్నది నిర్వివాదాంశం .

  ఇక పొతే బయట అయన ప్రవర్తించే తీరు . అయన మనసులో అనంత కోటి బావాలు ఉoడవచ్చు . అయన సన్నిహితులు చెపుతున్నట్లు ఆయనలోసామాజిక  సేవా దృక్పదం ఎక్కువే కావచ్చు . కాని ఆయనలోని మొహమాటం , అసహనం ఆయనలోని సామాజిక సేవ తత్పరుడిని బయటకు రాకుండా తొక్కి పడుతున్నట్లుంది . పై పెచ్చు ఆయనలోని తొందరపాటు నిర్ణయాలు తీసుకునే విదానం ఎంత పైకి వెళ్ళినా , ఒక తప్పటడుగుతో  క్రిందికి జారేలా చెయవచ్చు. అసలు అయన తన అన్న చిరంజీవి గారి కళ్ళలోకి చూసి మాట్లాడే దమ్ము లేని గబ్బర్ సింగ్. పోనీ ప్రజల కళ్ళలోకి అయినా చూసి మాట్లాడుతాడా అంటే , ఎ సభలోనూ  అయన క్రిందికి చూసి డైలాగులు చెప్పడమే తప్పా , సూటిగా ప్రజల్ని చూస్తూ మాట్లాడడం తెలియని వాడు . మొన్ని మద్య ఏదో సభలో పైరసిలను ప్రొస్తహించె వారి తాటలు తీస్తాం అనే మాటను కూడా క్రిందికి చూస్తూ చెప్పాడు అంటే , అది అయన నైజమ్. మరి  ఇటువంటి నైజం ఉన్నవాడు నిర్మొహమాట , నికచ్చి నిర్ణయాలు తిసుకోగాలుగుతాడా ? అది కూడా మానసిక ప్రవర్తనా నిపుణులే చెప్పాలి.
       మొన్ని మద్య నాగబాబు గారి కుమారుడు సినిమా రంగ ప్రవేశాన్ని మెగా ప్యామిలీ గ్రేట్ గా నిర్వహించింది . అక్కడికి పవన్ కళ్యాన్ కూడా వచ్చారు. కాని అన్నతో ముభావం,గా ఉండడమే కాక, అక్కడ V.I.P లకు దూరంగా మెట్ల మిద కూలబడ్డాడు . అన్న అయన గురించి వాకబు చేసినా అయన దగ్గరకు వెళ్ళలేదు . దినికి కారణం ఏమై  ఉంటుంది అనుకున్న వారికి 10 రోజులకు సమాదానం దొరికింది . అయన గారు అన్న మాటను కాదని "జన సేన" అనే పార్టి పెట్టబొతున్నరని. దాని ఆవిర్బావం నేడే . దాని వెనుక మెగా స్టార్ అశి ర్వాదాలు ఉన్నాయని, దానిలో బాగంగానే , నాగబాబు కుమారుడి అరంగ్రేటం రోజు అన్నతో మాట్లాడకుండా , మీడియాకు హింట్ మసాల అందివ్వడం జరిగిందని  రాజకీయ విశ్లేషకులు అంచనా .

   కాంగ్రెస్ పార్టి సిమాంద్ర లో భూస్తాపితం కాకపోయినా దుంప నాశనం కావడం ఖాయమ్. దిని వలన లబ్ది పొందే పార్టీలు ప్రదానంగా రెoడు . ఒకటి తెలుగు దేశం కాగా రెండవది జగన్ గారి పార్టి . అయితే జై సమైక్యాన్ద్రా పేరుతొ కిరణ్ కుమార్ గారు పెట్టిన పార్టి వలన జగన్ పార్టికి నష్టం కలిగే అవకాశాలు ఉండటం వలన , తెలుగుదేశం బలపడే అవకాశముంది . అదిగో ఆ నష్టం పూడ్చుకోవాదానికి , తెలుగుదేశం ఓట్లను చిల్చే ఉద్దేశ్యంతోనే జగన్ గారి సంబదికులు ప్రోత్సాహంతో, స్పాన్సరింగ్ తో పవన్ గారు పార్టి పెట్టారు అని కొంత మంది అభిప్రాయమ్. దీనిక కోసం  చిరంజీవి గారికి బాగానే గిట్టుబాటు అయి ఉంటుందని , కాని పైకి మాత్రం తమ్ముడు  సభకు వెళ్ళవద్దని తన అభిమానులను ఆదేశించినా  వారు ఖాతరు చెయ్యడం లేదని అంటున్న దానిలో నిజమెంతో ఆ భగవంతుడికే తెలియాలి. హైటెక్ హోటలో లో పార్టి అవిర్బాలు. లిమిటెడ్ పెర్సన్స్ కె ఆహ్వానాలు , కొన్ని సిట్లకే పోటి చేస్తామనదడాలు చూస్తుంటే , ఇవి పవన్ కళ్యాన్ లోని కామన్ మాన్ సంబందిo చింది కాదు , చిరంజీవి గారిలోని బిసినెస్ మాన్ కు సంబందించిన తంతు లాగే ఉoది . పోయిన ఎలెక్షన్లో తెలుగు దేశం గెలవకుండా ప్రజా రాజ్య ప్రయోగం జరిగినట్లే , ఈ ఎలేక్షన్లలో "జనసేన" ప్రయోగం జరుగుతుంది అనే వారి అంచనాలు కరెక్టా .కాదా? అనేడి కాలం చెప్పవలసిన సమాదానమ్.

            ఏది ఏమైనా అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టి వారు ఒక విషయంలో సపలి క్రుతులయ్యారు . వారు తెలుగు ప్రాంతాల్ని మాత్రమె కాదు తెలుగు జాతిని 4 ముక్కలు చెసారు. సమర్దుడైన రాజు లేకపోతె, కత్తి  పట్టడం చేత కాని వాడు కూడా సెపరేట్  రాజ్యం కావాలo టారు . ఇదే తెలుగు నాట ప్రస్తుతం జరుగుతుంది .నిజంగా పవన్ కళ్యాన్ గారికి ప్రజా సేవా చెయ్యాలని ఉంటె , స్వంత నిర్ణయంతో ,రాజకీయ  అనుభవమున్న వారితో పొత్తులు కుద్ర్చుకుని అన్ని సీట్లకు పోటీచేసే సామర్ద్యం  దానికి తగిన రాజకీయ విజ్ఞత తనకున్నాయని ప్రజలకు తెలియ చేస్తే , అప్పుడు వారు అశిర్వ దించవచ్చు . లేకపోతె ఎవరి గెలుపుకో అయన సహాయపడడం తప్పా ఆయనకు ఒరిగేది ఏమి ఉండక పొవచ్చు. అసలు అయన సమైక్యత ఉద్యమం అప్పుడే రంగంలోకి దిగి ఉంటె పరిస్తితి వేరుగా ఉoడేది. కాని అలా రాకపోవటానికి పైన చెప్పినవే కారణాలు కావచ్చు.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన