ఈ రియల్ మగాడితో మాట్లాడితే చాలు , మొగుడికి విడాకులు ఇచ్చేస్తారట !!!



                   
                       "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి" అని  మనుస్మ్రుతి లో  చెప్పబడిన మాట ఈ నాడు ఎంతో  వివాదా స్పదం అయినప్పటికి , నేటి సమాజం లో కొంత మంది స్త్రీలు తమ  స్వేఛ్చ్చను దుర్వినియోగం చేసుకుంటున్న తీరును చూస్తే "మనుస్మృతి " లో చెప్పబడిన ఆ మాట అందరికీ వర్తించక పోయిన ఇలాంటి వారికి మాత్రం వర్తిస్తుంది అని అనిపిస్తుంది. విషయానికి వస్తే ఈ  రోజు  one India తెలుగు పోర్టల్ లో ప్రచురింపబడిన ఒక న్యూస్ ఐటెం చూసాను. దాని ప్రకారం :- 

"భార్య చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ దుర్మార్గుడు మరో మహిళనూ మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో గడిపిన శృంగార దృశ్యాలను బహిర్గత పరుస్తానంటూ బెదిరింపులకు గురిచేచేసి.. ఆమె నుంచి భారీ మొత్తంలో డబ్బును గుంజుకున్నాడు. అతని వేధింపులు బరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఆ నయవంచకుడి దుర్మార్గాలు వెలుగుచూశాయి. పోలీసుల కథనం ప్రకారం కృష్ణలంకకు చెందిన మండవ రవికాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈయనకు వివాహమైంది. కాగా, భార్య చెల్లెలు శ్రీదేవి‌పై కన్నేసిన రవికాంత్ ఆమెతో సన్నిహితంగా ఉండటం మొదలెట్టాడు. ఈ క్రమంలో శ్రీదేవి తన భర్తకు విడాకులిచ్చి అజిత్‌సింగ్‌నగర్ రామలింగేశ్వరపేటకు మాకాం మార్చింది. రామలింగేశ్వనగర్‌లో నివాసం ఏర్పాటు చేసి శ్రీదేవితో సహజీవనం సాగిస్తూ వస్తున్నాడు రవికాంత్. ఈ నేపథ్యంలో శ్రీదేవి ఇంటికి సమీపంలో ఉంటున్న మరో మహిళ (39)తో పరిచయం ఏర్పడింది. ఈమె కూడా భర్త నుండి విడాకులు పొందింది. ఈమె ఇద్దరు సంతానం ఉన్నత చదువులు చదువుతున్నారు. 

సదరు మహిళ తన తండ్రి పెన్షన్‌తో జీవనం సాగిస్తోంది. కాగా, మోసపూరిత మాటలు చెప్పిన రవికాంత్.. ఆమెతో చనువు పెంచుకున్నాడు. సదరు మహిళతో గడిపిన శృంగార దృశ్యాల్ని తన సెల్‌ఫోన్‌లో బంధించి మహిళను బ్లాక్‌మెయిల్ చేసి తనకు డబ్బులు అవసరమైనప్పడల్లా ఆ మహిళను బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో నిస్సహాయురాలైన మహిళ తన తండ్రి నుండి తీసుకున్న రూ.6 లక్షల్ని రవికాంత్‌కు ఇచ్చింది. అనంతరం తనను వేధించవద్దని ఆమె వేడుకుంది. నిస్సహాయురాలైన ఆ మహిళ విడాకుల విషయాన్ని కూడా పక్కన పెట్టి తన భర్త చెంతకు చేరాలని ఆకాంక్షించింది. ఆ విషయాన్ని గ్రహించిన ఏలాగో గ్రహించాడు. .. సదరు మహిళ నగ్న చిత్రాల్ని ఆమె భర్తకు చేరవేశాడు. దీంతో ఆమె కాపురం మరోసారి చిన్నాభిన్నమైంది. అన్ని వైపులనుంచి దారులు మూసుకుపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. చివరకు అతని వేధింపులు బరించలేక పోలీసులను ఆశ్రయించింది. అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు . "

       అధీ సంగతి. మన సమాజం స్త్రీ పక్షపాతి అవటం వలనేమి, ఒకే దుర్మార్గుడు అయిన మగవాడి చేతిలో ముగ్గురు ఆడవారు మోసపోయి డబ్బు తో పాటు సర్వం పోగొట్టుకోవటం వలన ,పై కేసులో జరిగిన నేరాలకు , ఘోరాలకు ఆ రియల్ ఎస్టేట్ రవికాంత్ నే పూర్తి బాద్యుడును చేస్తూ , అటూ ప్రింట్ మీడియా , ఇటు ఎలక్ట్రానికి మీడియా దుమ్మెతి పోస్తున్నాయి. కాని జరిగిన దానిని నిశితంగా గమనిస్తే ఇందులో ఒక విషయం కామన్ గా కనపడుతుంది. మోస పోయిన ఆడవారేమి లోకం తెలియని పాపాయిలు కారు. శుబ్రంగా పెండ్లిళ్ళు అయి మొగుళ్ళతో సంసారం చేసుకుంటున్న వారే. కాని గమ్మతు ఏమిటంటె ఈ రియల్ రవికాంత్ తో పరిచయం కాగానే ఎందుకో వారికి మొగుళ్ళ మీద మొహం మొత్తేసి వారికి విడాకులు ఇచ్చేసారట! అతగాడి మాటల మహత్తు అలాంటిదా?

   ఇక శ్రీదేవి గారి విషయానికి వస్తే ఆమె కు రవికాంత్ స్వయానా బావ. అక్క మొగుడు . అయినా సరే మొగుడికి విడాకులు ఇచ్చి బావగారితో సహజీవనం మొదలు పెట్టిన అమాయకురాలు పాపం! బహూశా ఆవిడ అక్క గారు ఈవిడకి తన మొగుడిని త్యాగం చేసి ఉంటుంది అనుకుంటా! ఇక ఇంకొక మహిళ భర్తకు విడాకులు ఇచ్చింది. ఆమెకు ఉన్నత చదువులు చదువుతున్న  సంతానం ఉంది అట. రవికాంత్ లాంటి నయవంచకుడితో స్నేహం చేసే ముందు , అతనితో అన్ని పంచుకునే ముందు , ఆ ఉన్నత సంతానం గురించి ఆలోచన రాలేదు. బ్లాక్మెయిల్ చేసాడని తండ్రి సొమ్ము దానం చేసింది. రవికాంత్ దెబ్బతో కట్టుకున్న మొగుడి దొడ్డ మనసు గుర్తుకు వచ్చింది అనుకుంటా , అతగాడి దగ్గరకు వెళదామని చేసిన ప్రయత్నం , రియల్ ప్రియుడి సెల్ పోన్ చిత్రాలు దెబ్బ తో బెడిసి కొట్టింది. చివరకు తట్టుకోలేక మోసగాడి మీద కేసు పెట్టి అతగాడిని కట కటాల వెనక్కు నెట్టించినా , ఆమె పరిస్తితి "చేతులు కాలాక ఆకులూ పట్టుకున్నట్లు " అయింది. 
  పై కేసు వలన మనం గ్రహించవలసింది  ఒకటే. స్త్రీకి అయినా పురుషుడికి అయినా కట్టు బాట్లు అవసరం .ఒక విదంగా చెప్పాలి అంటె పురుషులుకు అన్నా  స్త్రీలకు మరింత అవసరం. పై కేసులో బాదితురాళ్ళు అని చెప్పబడ్తున్న స్త్రీలకు సరి అయిన జ్ఞానం ఉన్నా, లేక కుటుంబ సభ్యుల  నియంత్రణ ఉన్నా ఇలాంటి పరిస్తిత దాపురించదు కదా ! అందుకే "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి " అనే బదులు " న అజ్ఞాని స్వాతంత్ర్య మర్హతి " అని ఈ సూత్రాన్ని స్త్రీ పురుషులు ఇరువురికి వర్తింంప చేస్తే బాగుంటుంది.  

      సోర్స్:: http://telugu.oneindia.com/news/andhra-pradesh/man-allegedly-arrested-fraud-175393.html?utm_source=article&utm_medium=fb-button&utm_campaign=article-fbshare
                                             ( 1/4/2016 Post Republished)

Comments

  1. Dear Sir after reading the story i think the males in the society are not eligible for freedom by your logic as the male character in the story is having affairs with different ladies even though he is married but the ladies at least divorced before entering into the relationship with this man and what the families provide the protection to the women as most of the family heads are similar to the male character of your story .so kindly don't generalize things.

    ReplyDelete
    Replies
    1. నారాయణ గారు, పై కధ లో ఎక్కడా బాదిత స్త్రీలు,వారి భర్తలతో విడాకులు తీసుకున్నకే రవికాంత్ తో సహజీవన సంబందం పెట్టుకున్నారని చెప్పలేదు. అతగాడితో వైవాహికయేతర సంబందం పెట్టుకున్నాకే భర్తలతో తెగతెంపులు చేసుకున్నారు అని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి నైతికత విషయం లో వారికి రవికాంత్కి పెద్ద తేడా ఏమి లేదు. దొందూ దొందే. నేను చెప్పింది కూడా ఇద్దరూ బాద్యులే అని కాని, రవి కాంత్ ని వెనకేసుకు రాలేదు. పత్రికల్లో, మీడియాల్లో ఇటువంటి విషయాలలో కేవలం పురుషులు మాత్రమే తప్పులు చేస్తారు, స్త్రీలు అమాయకులే అని చెప్పడమో, లేక వారి తప్పుల విషయం లో మౌనంగా ఉండడాన్ని నేను సమర్దించను. అలాగే స్త్రీలు అందరూ జరిగే తప్పులకు బాద్యులే అని జనరలైజ్ చేసి చెప్పింది లేదూ. అందుకే "కొంతమంది స్త్రీలు" అని చెప్పడం జరిగింది. మీరు మాత్రం మెజార్తీ పురుషులు వెదవలే అని దాదాపుగా జనరలైజ్ చేసారు.

      మీరు అన్నదే కాసేపు ఒప్పుకుందాం. పురుషులు అంతా వెదవలే అయితే, అలాంటి వెదవలతో అనారోగ్యకరమైన స్నేహాలు చేసే వారు, అక్రమ సంబందాలు పెట్టుకునే వారు ఇంకెంత పనికిమాలిన వారు అయి ఉంతారో అలోచించంది . కాబట్టి పురుషుని వైపు ఒక వేలు చూపిస్తే మిగతా మూడు వేళ్ళు అతనికిఆ పని చెయ్యడానికి అవకాశమిస్తున్న స్త్రీల వైపు చూపిస్తాయని మరచి పోవద్దు. కుటుంబ రక్షణ కోసం నిరంతరం పాటుపదే వారిని, కుటుంబ పరువు ప్రతిష్టలను గాలికొదిలేసి విచ్చవిడిగా ప్రవర్తించే వారిని ఒకే గాటన కట్టి మాట్లాడడమ్ కరెక్టు కాదు. ఇంకా మన సమాజస్ం లో మనం ఒక క్రమ పద్దతిలో జీవనం కొనసాగిస్తూ సమాజాభివ్రుద్దికి తోద్పడుతున్నాం అంటె మెజార్తీ స్త్రీ పురుషులు కట్టుబాట్లకు పాటిస్తుండడం వలననే అని నేను అనుకుంటున్నాను. లేదూ మెజార్తీ మగవాళ్ళు వెదవలు, అడవారు అంతా అమాయకులు అని మీరు అనుకుంతె అది కొంతమంది అభిప్రాయం మాత్రమే తప్ప నిజం కాదు.

      Delete
    2. Love kills six times more Indians than terror attacks

      http://timesofindia.indiatimes.com/india/love-kills-six-times-more-indians-than-terror-attacks/articleshow/57968105.cms

      Delete
    3. Between 2001 and 2015, love was the officially recorded reason for 38,585 murders and culpable homicide cases. Government records also link it with 79,189 suicides. Further, 2.6 lakh kidnapping cases were also filed in this period where marriage was mentioned as the motive of 'abducting' women.

      That's an average of seven murder cases, 14 suicides and 47 kidnapping cases - mostly because somebody eloped and kith and kin are uncomfortable with that idea — every day. Terror, on the other hand, killed 20,000 people, including civilians and security forces, in the same period. The data shows that Andhra Pradesh, followed by Uttar Pradesh, Maharashtra, Tamil Nadu and Madhya Pradesh have witnessed the highest number of murder cases where love was the stated motive.

      These cases include both jilted men turning violent, despondent lovers ending their lives as well as murders committed because of the social outrage over love affairs that unsettle class and caste hierarchies.

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం