ముగ్గురు విద్యార్దులను "ముగ్గు "లోకి దింపి 30 యేండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న 'ముదనష్టపు పంతులమ్మ '

                                                                                 

                           
                             అడ దానికి అయినా , మగాడి కైనా స్వీయ నియంత్రణలు లేకపొతే , ఎంత నీచమైన పనికి అయినా పాల్పడతారని  అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన ఉతా లో జరిగిన సంఘటణ తెలియ చేస్తుంది. అమెరికా రాష్ట్రాల  రాజ్యాంగాలు అన్ని రంగాల్లో స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఇచ్చాయి కాబట్టి , నేరాల విశయం లో కూడా సమ న్యాయం పాటించి పురుషులతో పాటు స్త్రీలను కటినంగా శిక్షించడానికి వెనుకాడడం లేదని , ఒక లేడి టిచర్ కేసులో విదించిన శిక్ష తెలియ చేస్తుంది. మన దేశం లో అయితే మైనర్ బాలికను పాడు చేసిన మృగాళ్ళకు 7 నుంచి పది ఏండ్లు జైలు శిక్షలు విదించే అవకాశముంది. కాని అదే మైనర్ బాలుడిని ప్రలోబపరచి వాడితో గడిపే స్త్రీకి మాత్రం ఏ శిక్షా ఉండదు. పైపెచ్చు నాకు తెలిసీ తమిళనాడులో ఒక పదిహేనేళ్ళ విద్యార్దిని , ఆ పిల్లాడు చదివే స్కూల్లోని పంతుల్లమ్మ ప్రేమ పాటలు నేర్పి లేవదీసుకు వెళ్లి పెండ్లి చేసుకుంటే "ప్రేమకు వయసు తో పనేముంది ? అది వారిష్టం అని ఆవిడ వెనుకాల ఉన్న ఆస్తికి ఆశపడి , 30 యేండ్ల టిచర్ కు 15 ఏండ్ల విద్యార్ది కి ఇచ్చి  పెండ్లి చేసిన పెద్దలు ఉన్న సమాజం మనది . అదే ఆస్త్రేలియాలో ఇలాంటి పని చేసిన లేడి టిచర్ కు 6 యేండ్లు శిక్ష వేసారు, ఇదే విషయం మీద నేను రాసిన టపా చూడండి.


         ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్న అమెరికా టిచర్ గారి కదా కమామీశు ఏమిటంటే , ఉతా రాష్ట్రంలో ఉన్న బ్రియాన్ అల్తిస్ అనే  పంతులమ్మకి 2013 సంవత్సరం నాటికి 33 యేండ్లు . ఆమె దగ్గర చదుకునే కుర్రాళ్ళకి 16, 17 యేండ్లు ఉంటాయి . ఆమెకు వివాహం అయి మొగుడు ఉన్నప్పటికి  పఢుచు కుర్రాళ్ళ మీద మోజు ఎక్కువ అనుకుంటా . అందుకే తన దగ్గర చదువుకునే 3 కుర్రాల్ని రెచ్చ గొట్టి ముగ్గులోకి దించింది. వారితో పార్కుల్లో , తన ఇంట్లో విచ్చల విడిగా ప్రవర్తించింది. ఆమె ప్రవర్తన ఎంతగా దిగజారిపోయింది అంటే , "ఈ  రోజు పంతులమ్మ ఎవరితో పడుకుంటుంది రా " అని విద్యార్దులు జోకులు వేసుకునే అంతగా . చివరకు ఐ విషయం ఆ 3 కుర్రాళ్ళ తల్లి తండ్రులకు తెలియడం తో అందులో ఒక విద్యార్ధి తల్లి తండ్రులు ఆమే మీద సాల్ట్ లేక్ సిటీ పోలిసులు  కేసు పెట్టి ఆమెను కోర్టులో హాజరు పరచారు. 

     ఆ కాముకి టిచర్ మీద మొత్తం 14 చార్జెస్ ఫ్రేం చేసారు. అందులో 5 రేప్ చార్జెస్ . అదే మనదేశం లో స్త్రీల మీద రేప్ చార్జెస్ ఫ్రేమ్ చేసే అవకాశమే ఉండదు. ఆమె కోర్టుల్లో నేరాలు ఒప్పుకోవటం వలన వివిధ చార్జెస్ కింద 2 నుండి 30 యేండ్ల గరిష్ట శిక్షను విదించింది కోర్టు. ఆమె జైలులో శిక్ష అనుభవిస్తుంది ప్రస్తుతం. అయితే ఈమద్యనే ఆ 3 కుర్రాళ్ళ తల్లి తండ్రుల్లో ఇంకొకరు ఆమే మీద ఆమె పని చేసిన స్కూల్ యాజమాన్యం మీద సివిల్ సూట్ వేసారు. ఈ  దావా ను ఎదుర్కోవడానికి తగిన లాయర్ ని నియమించుకునే ఆర్దిక స్తోమత తనకు లేదని తెలియ చేస్తూ  ఆమె తన విద్యార్దులతో  తన ప్రవర్తనని  సమర్దించుకోవడానికి ఒక మాట అందట. అదేమిటంటే " నేను నా విద్యార్దులు చదువులో మంచి గ్రేడ్ లు సంపాదించాలనే వారితో సంబందం పెట్టుకున్నాను" అని. ఈ మాటతో కోర్టులు లో న్యాయ ముర్తులు కూదా స్టన్ అయిపోవలసిందే . ఒక వేల ఆమె చెప్పేది నిజమని ఒప్పుకుంటే ,ప్రతి స్కూల్ ఒక శ్రుంగార దేవాలయం కావాల్సిందే !. 

   ప్రస్తుతం ఆమె మీద సివిల్ సూట్ పెండింగ్ లో ఉంది. ఆమె మాత్రం జైలులో 30 ఏండ్ల శిక్షను అనుభవిస్తూ ఉంది. ఇలాంటి స్త్రీలు ఒక అమెరికా లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. స్త్రీలు అంతా అమాయకులు పురుషులే వెదవలు అని బలంగా నమ్మి వారికోసం మాత్రమే పని చేసే కరడు కట్టిన  స్త్రీ వాదులలో కొంత పయినా పరివర్తన రావడానికి బ్రియాన్ పంతులమ్మ కేసు ఉపయోగపడుతుంది. స్వీయ నియంత్రణ లేని మనిషి, కట్టు బాట్లు లేని సమాజం ఎప్పటికైనా పతనం కాక తప్పవు. 

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )