పెండ్లి కొడుకుని కాదని , పెండ్లి చూడటానికి వచ్చిన వాడిని పెండ్లాడిన పెండ్లి కూతురు !!!

                                                                         

మారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ . పెండ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటే "మనువు " అనేది దైవ నిర్ణయం!. దానిని కాదని ఎవరూ ఏమి చేసినా అది నిష్ప్రయోజనం" అని నమ్మే వారికి మంచి ఊతమిచ్చే సంఘటణ ఒకటి ఇటివల ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ లో జరిగింది .

  ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ కు చెందిన  పెండ్లి కొడుకు జుగల్ కిశోర్ వయసు 25 సంవత్సరాలు . అతన్ని పెండ్లాడ బోయే వదువు ఇందిర వయసు 23 సంవత్సరాలు . పెంద్లికూతురిది రామ్ పూర్ కాబట్టి పెండ్లి రాంపూర్ లో జరపాలని ఇరువైపులా పెద్దలు నిర్ణయించి అందుకు అన్నీ సిద్దం చేసారు . పెండ్లి జరుగుతున్న తరుణం అది . ఆకాశం అంత షామియానా క్రింద ,ఆహుతుల ,బందు మిత్ర పరివార సమక్షంలో వివాహ తంతు దూందామ్ గా జరుగుతుంది . అదిగో అప్పుడు జరిగింది ,ఆ విది నిర్ణయించిన ఘటన . 

 కొంత తంతు జరిగి పోయింది ."వర మాల " అంటే ,పెండ్లి కొడుకు ,పెండ్లి కూతురు పరస్పరం దండలు మార్చుకునే ప్రక్రియ మొదలైంది .సాంప్రదాయమ్ ప్రకారం మొదటగా వరుడు వదువు మెడలోఠీవిగా  వర మాల  వేయబోతు చేతులు ముందుకు చాచాడు . అంతే ! వరుడు "డాం " అని క్రింద పడి పోయాడు . ఆ హటాత్ పరిణామానికి వదువు స్తాణువు అయి పోయింది . అబ్బాయిని బందువు లంతా కలిసి హాస్పిటల్ కి తరలించారు . ఆ అబ్బాయికి వచ్చింది పిట్స్ అట . అతని కి మూర్చలు వచ్చె సమస్య ఉంది అట .దానిని పెండ్లి కొడుకు వారు ,పెండ్లి కూతురి తరపు వారికి ముందే చెప్పినప్పటికీ ,అమ్మాయి బందువులు ,అమ్మాయికి ఆ విషయం చెప్పకుండా దాచారు .తన తల్లి తండ్రులు బందువులు చేసిన పనికి అమ్మాయి అగ్గి మీద గుగ్గిలం అయింది . టాట్ నాకు ఈ పెండ్లి కొడుకు వద్దు పొమ్మంది . 

  అప్పటి కప్పుడు అదే పెండ్లి మంటపం లో తన పెండ్లి చూడటానికి వచ్చిన ,తన అక్క మరిది  హర పాల్ సింగ్ ని పెండ్లి చేసుకుంటాను అని ప్రకటించింది  .దానితో  పెండ్లి చూద్దామని,జీన్స్ డ్రెస్ లో   వచ్చిన హర పాల్ సింగ్ తో పాటు అందరూ స్టన్ అయ్యారు .చివరకు హర పాల్ సింగ్ ఒప్పుకోవటం తో ,ఇందిర "వరమాల " ను హర్పాల్ సింగ్ ఆమె మెడలో వేసి అమెను వివాహ మాడాడు  .ఆ విదంగా ఏ మాత్రం శ్రమ లేకుండా ,అన్న మరదలు తనకు పెండ్లాం అయింది .

                          ఇంతలో హాస్పిటల్ నుండి వచ్చిన జుగల్ కిషోర్ నానా గొడవ చేసాడు .తన పెండ్లాం ఇంకొరికరిని వివాహం చేసుకోవడం చెల్ల దన్నాడు .  తను తన భార్య లేకుండా ,తన ఊరికి ఏ ముఖం పెట్టుకుని పోవాలి అన్నాడు  . అతనికి బందువు లు సపోర్ట్ చేసి ,పెండ్లి కూతురిని ఎంత  బ్రతిమాలినా అందుకు ఇందిర "వరమాల వేసినోడే నా మొగుడు "అని కరా ఖండిగా చెప్పింది . దానితో కోపం వచ్చిన కిశోర్ తరపు బందువులు మొదట్లో పోలిస్ కేసు పెట్టినా ,చివరకు పెద్దల జ్యోక్యంతో అది విరమించుకుని ,అంతా విది లిఖితం ,దానిని మార్చడం ఎవరి తరం కాదని ,తమకు తామే మనసును సమాదాన పరచుకుని, ప్రశాంత చిత్తులై మొరాదా బాద్ కి తరలి వెళ్లారు . అదీ విషయం . 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!