30,000 శవ పరీక్షలు చేసిన ఆ డాక్టర్ కే ఒళ్ళు గగుర్పొడిచేలా చేసిన ఆ" యువతి శవ పరిక్ష " !!!?
ఈమద్య ఒక ఆంగ్ల వ్యాసం చదివాను . ఆ వ్యాస రచయిత ఏ మాత్రం వాస్తవ ద్రుష్టి లేని పక్కా ఆదర్శ వాది కాబోలు 'స్త్రీలకు కావాల్సింది రక్షణ కాదు ,స్వేచ్చా స్వాతంత్ర్యాలు చాలు " అని తేల్చేసాడు . ప్రస్తుతం డిల్లీలో జరుగుతున్నా ఎన్నికల ప్రచారం సందర్బంగా అక్కడి ప్రదాన పార్టీలు అయిన బి. జె.పి ,అమ్ ఆద్మీ మానిపెస్టో ల గురించి ప్రస్తావిస్తూ రాసిన వ్యాసంలో అయన గారి కోరిక అది .కాని అది ప్రచురించబడిన 24 గంటల్లోనే డిల్లికి సమీపం లోని రోహ్తక్ జిల్లాలో జరిగిన ఒక దారుణ సంఘటణ సదరు రచయిత గారి కోరిక ఎంత వాస్తవ దూరమైనదో తెలియ చేస్తుంది .స్త్రీలకు సంపూర్ణ స్వెచ్చా స్వాతంత్ర్యాలు అనేవి నూటికి నూరు శాతం మనుషులు ఉన్న సమాజం లో ఉంటె మేలు చేస్తాయి కాని ,1% మనిషి రూప మెకాలు ఉన్నా అవి స్త్రీలకు అపాయం తలపెడతాయి, అని అనిపించే లా ఉన్న ఈ ఉదంతం గురించి తెలుసుకోండి .
ఆమె 28 ఏండ్ల యువతి . నేపాల్ లోని వార్డా జిల్లా కు చెందిన వ్యక్తీ . ఆమె కు మానసిక రుగ్మతలు ఉండటం వలన చికిత్స తీసుకుంటుంది .ఆమె అక్క ఒకామె హర్యానా లోని రోహ్ తక్ లో ఒక ఇంటి లో పనిచేస్తుంటె ,ఆమె ను చూడటానికని కొన్ని నెలలు క్రితం రోహ్తక్ వచ్చింది .ఆమె గత నాలుగు రోజులుగా కనిపించక పోవటం తో పోలిస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది . చివరకు ఆమె శవమై బహు అక్బర్పూర్ అనే ప్రాంతం లో కనిపించే సరికి పోలిసులు ఆమె బాడిని శవ పరీక్షకు రోహ్తక్ లోని పండిట్ దయాళ్ శర్మ ఆసుపత్రికి పంపారు . అక్కడ ఆమెకు శవ పరీక్ష నిర్వహించిన పోరేన్సిక్ మెడికల్ డిపార్ట్ మెంట్ అధిపతి Dr .దత్తేర్ వాల్ "నా 29 ఏండ్ల సర్వీసులో సుమారు 30,000 శవాలకు పరీక్ష నిర్వహించడమో ,పర్య వెక్షిచడమో జరిగింది . కాని ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఇంత ఘోరమైన శవాన్ని ఇంతవరకు చూడలేదు " అని అన్నారట .ఆయన అలా అనటానికి కారణం ఏమిటంటె :
ఆ అమ్మాయి శవం కుళ్ళి పోయే దశలో కనుగొన బడింది . ఆ అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తులు పరమ కిరాతకంగా చెరిచారు . అంతటితో ఆగక ఆమె ప్రైవేట్ పార్ట్స్ తో పాటు గుండె కాలేయం కోసి మాయం చేసారు . రెండు రాళ్ళను ఆమె అనస్ లో చొప్పించారు . ఆమె ప్రైవేట్ పార్ట్ లో 16 అంగుళాల పొడవు ,4 అంగుళాల వెడల్పు గల కట్టె లాంటి వస్తువును చొప్పించారు .దానితో ఆమె లోపలి బాగాలు చిద్రం అయ్యాయి . ఆమె కపాలం మీద ప్రాఖ్చర్ అయ్యేలా గాయం చెయ్యడమే కాక ,తొడల మీద ,ఎద మీద గాయాలు చేసారు .ఒక విదంగా మనిషి అన్న వాడు ఎవడూ చేయలేని విదంగా ఒక ఘోరమైన పద్దతిలో ఆమెను హింసించి చంపడం జరిగింది అని శవ పరీక్షలో తేల్చారు . అందుకె ఆ డాక్టర్ గారి ఒళ్ళు గగుర్పొడిచింది .
కేసు యొక్క తీవ్రతను గమనించిన రోహ్తక్ పోలిస్ దోషులను పట్టుకోవడానికి స్పెషల్ ఇన్వెస్టిగేట్ టిం ని ఏర్పాటు చేసారు . ఇంతవర్తకు ఏ ఆచూకి తెలియ లేదు . దర్యాప్తు కోన సాగుతుంది . మరి ఇలాంటి నర రూప రాక్షసులు తిరుగుతున్న సమాజంలో స్త్రీలకు ప్రాదమికంగా అవసరమైనది రక్షణా ,లేక స్వేచ్చో ఆదర్శవాదులు అయిన మేదావులు తేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది .
SOURCE :- http://timesofindia.indiatimes.com/city/gurgaon/Woman-raped-brutalized-and-murdered-in-Rohtak/articleshow/46151730.cms?utm_source=facebook.com&utm_medium=referral&utm_campaign=TOI
(7/2/2015 Post Republished)
Comments
Post a Comment