150 సినిమాల హీరో చిరంజీవి ఇవ్వలేని సందేశం , అయన కుమార్తె "శ్రీజ " ఇచ్చింది !!!
హీరో చిరంజీవి ! ఆంద్రుల ఆరాద్య నటుడు. ఇప్పటి వరకు అయన 150 చిత్రాల్లో నటించారు. అయన గారు నటించిన చిత్రాల్లోని కధలు ఈ నాటి యువతరాని కి మంచి కిక్ ఎక్కించేవే . సినిమా కి వచ్చే కలెక్షన్ లలో ఎక్కువ శాతము కుర్రకారు ప్రేక్షకుల నుండె వస్తుందో ఏమో కాని ఏ ప్రేమ సినిమాలు చూసినా తల్లి తండ్రులు విలన్ లు , వారి కూతుళ్ళు హీరోయిన్ లు , ఆ హీరోయిన్ లు ను ప్రేమించే హీరో లు రోడ్ల మీద జులాయిగానో , దొంగల గానో, స్మగ్లర్ లాగానో , అది ఇది కాకపోతే ఆడపిల్లని వేదించే ఇడియట్ లాగానో ఉంటారు తప్పా , సీనియర్ ఎన్టీఆర్ గారి "కధానాయకుడు " చిత్రం లో హీరో లాగా మాత్రం చచ్చినా ఉండరు . ఎందుకంటె అలాంటి కదా నాయక పాత్రలను ఐ నాటి యువతరం మెచ్చదని సినిమా నిర్మాతల భయం కాబోలు.
అందుకే విలన్ ల కూతుర్లు ను హీరో ప్రేమించడం, దానికి తండ్రి విలన్ అడ్డుచెప్పి ఇంట్లో బందిస్తే , హిరో చాతి విరుచుకుంటూ ఒక్కడే వీరుడిలా విలన్ ఇంట్లోకి ప్రవేసించి , అక్కడున్న డజన్ ల కొద్ది రౌడీలను తన ఒంటి చెత్తో ఉతికేసి " ఒరేయి మామా మైనార్తీ తీరేవరకే నీ కూతురు , ఒక్క సారి మేజర్ అయిందంటే "ఈ జులాయి గాడి లవర్ ఫర్ ఎవర్ " అని డైలాగులు చెపుతుంటే , ఇక ఆ కూతురు కూడా కొన్ని సప్పోర్ట్ డైలాగులు పలికి ఆ హీరో తో తుర్రు మంటుంది . అలా వెళ్ళిన వారు కొన్ని పాటలు గట్రా పాదేసుకుని , అవి ఇవి చేసి చివరకు విలన్ అయిన తండ్రిని కట కటాల్లోకి నెట్టించడమో లేక వారి కాళ్ళ వద్దకు రప్పించడం తో కదా సుఖాంతం అవుతుంది.
మరి పైన చెప్పిన కద రాసేది సినిమా రైటర్ కాబట్టి , అవి సగటు కుర్ర కారు చంచల మనస్తత్వానికి అనుకూలం గా ఉంతాయి కాబట్టి కలెక్షన్లు పుల్ గా ఉండి నిర్మాతల పంట పండుతుంది . కాని అదే నిజ జీవితం లో జరిగితే నూటికి 95% ఇలాంటి పెండ్లిళ్ళు పెటాకులు అయి కన్న వారి గుండెల్లో చిచ్చు రేపుతుంది. మగాడు చక్కగా దులిపేసుకు పోయాక , చెడి ఇంటికి వచ్చిన ఆ అబాగ్య కూతురిని కడుపులో పెట్టుకుని , బ్రతిమాలో , ఆశ చూపో మరో అయ్య చేతిలో పెట్టి తమ కూతురు సంసారం ని ఇకనైనా చక్కగా చూడు స్వామీ అని దేవుళ్ళను ప్రార్దిస్తారు . ఇది సామాన్యుడికి అయినా , సూపర్ స్టార్ కి అయినా పరిస్తితి మాత్రం ఒకటే అని రుజువు చేసింది ప్రముఖ సినీ స్టార్ చిరంజీవి గారి తనయ శ్రిజ ! ఆ అమ్మాయి తను ప్రేమించిన బరద్వాజ ప్రేమను దక్కించుకోవడం కోసం అవసరమైతే ప్రేమ కోసం ప్రాణ త్యాగం చేస్తాను అంది. అదే మాట పట్టుదలతో తండ్రిని కాదని పోయి ఆర్య సమాజ్ లో వివాహం చేసుకుని తనేదో ఘన కార్యం సాదించినట్లు T . V షో లలో పాల్గొంది. అజయ్ దేవగన్ , కాజోల్ తో పాల్గొన్న ఒక ఇంటర్యూ లో ప్రేమ కోసం చస్తాను అని ఆమె చెప్పిన డైలాగులు , అబ్బో ! కుర్ర కారును చప్పట్లు కొట్టేలా చేసి ఉంటాయి . కావాలంటే క్రింది విడియోలో చూడండి.
అలాంటి శ్రిజ కొద్ది కాలం గడువ గానే , భర్త హింసిస్తున్నాడు అని, సాడిస్ట్ అని, అదనపు కట్నం కోసం వేదిస్తున్నాడు అని మొగుడి మీద కేసులు పెట్టి జైల్లో పదేయించడమే కాక , అతని నుంది విడకులుకూదా తీసుకుంది. చివరకు తండ్రి కాళ్ళ మీద పడి "నాన్న మా డబ్బును ప్రేమించే వాడు కాదు హీరో , మా క్షేమాన్ని నిరంతరం కాంక్షిం చే తల్లి తండ్రులే నిజమైన హీరోలు " అందట . ఆమె చెప్పిన మాటలు అని చెపుతూ ఫేస్ బుక్ లో ఒక కవిత పెట్టారు . దానిని యదాతదంగా కాపీ చేసి క్రింద ఇస్తున్నాను .
నిజంగా శ్రిజ జీవితం, చంచల మనస్తత్వం తో , ప్రేమకి మొహానికి తేడా తెలియని వయసులో , నాలుగు ప్రేమ మాటలు చెప్పే ప్రతివాడిని హీరో అనుకుని వారితో వెళ్ళిపోయే వారికి మేలుకొలుపు పాడె చక్కని సందేశం . 150 సినిమాల హీరో చిరంజీవి ఇవ్వలేని సందేశం , అయన కుమార్తె "శ్రీజ " ఇచ్చింది !!! ఆమె సందేశం ని చూడండి . ఇది కేవలం చిరంజీవి గారి తనయ గుండే చప్పుడు మాత్రమే కాదు , బిడ్డల ఆనందకర వైవాహిక జీవితం కోసం తపించే తల్లి తండ్రులను కాదని వెళ్ళిపోయి , జీవితాలు నాశనం చేసుకుంటున్న ప్రతి కూతురి గుండె ఘోష .
నాన్నా...
నువ్వెంత మంచివాడివి...
అన్నీ తెలుసన్న
అహంకారంతో నీ గుండె కోసి తీశాను...
నెత్తుటి చుక్కలు రాలుతుంటే...
నుదుట తిలకం దిద్దుకున్నాను...
నీ కన్నీటి బొట్లను
తలంబ్రాలు చేసుకున్నాను...
బాధతో నువ్వు కుములుతుంటే...
నన్నేమీ చేయలేవనే ధిక్కారంతో
తలపైకి ఎగరేశాను...
నీవైపు కన్నెత్తి చూడలేని
శత్రువు చేతులో నేను అస్త్రాన్ని అయినా...
అది నా గెలుపే అనుకున్నాను...
*******
ఒకవేళ నేను గాయం చేయకపోతే
నీ రొమ్ములు విశ్వాసంతో
ఇంకా పైకి ఎగిరేవేమో...
నీపై నూరిన కత్తులు
పూల గుత్తులై విరిసేవేమో...
శత్రువు శిరసు
నీ పాదాల ముందు వాలి
నువ్వు కలలు గన్న విజయాల
లోగిలి చేర్చేదేమో...
*******
తొందరపాటో... తెలివితక్కువతనమో
నేను కూల్చిన పునాదిరాళ్లు
నీ ఆకాశమంత మనసుకి సమాధి
కట్టలేదని చెప్పింది నీ ఔదార్యం...
బతుకు బండి అర్థంతర శూన్యం
అవుతుంటే నువ్వు తప్ప వెలుగు
ఎవరూ ఇవ్వలేరని నమ్మిన
నా కళ్లని మళ్లీ ఆశల పల్లకీ వైపు
నడిపిస్తుంటే కుమిలిపోవడం తప్ప
ఏదీ చేతకావడం లేదు...
నీ కీర్తిని, ప్రతిష్టని నేను నరికేసినట్టు
నీ కుడిభుజం వెక్కిరిస్తుంటే...
ఒంటి చేత్తో నువ్వు కురిపిస్తున్న
ప్రేమానురాగాల ప్రవాహానికి
గుండె పగిలేలా ప్రపంచానికి చెప్పాలని ఉంది...
మా నాన్న చిరంజీవి... అని...
(16/2/2016 Post Republished)
(16/2/2016 Post Republished)
Comments
Post a Comment