నటి "కల్కి కోచ్లిన్ " ని రాష్ట్రపతి గారు అవార్డ్ తో సన్మానిస్తే , రాంగ్ పెలోస్ అంతా తడిమి తడిమి అవమానించారట!

                                                                 
                                                                            స్వీయ రక్షణ విషయం లో జాగ్రత్త పడకుండా కేవలం ప్రభుత్వ రక్షణ తోనే అన్నీ సజావుగా జరుగుతాయి అని బ్రమించే వారికి కనువిప్పు కలిగించే సంఘటణ.

 ఆమె పేరు కల్కి కొచ్లిన్. పేరున్న బాలిఉడ్ నటిమణి. ఆమె ప్రెంచ్ జాతీయుల వారసురాలు అయినప్పటికి , ఆమె గారి తండ్రి తమిళనాడులోని ఊటి కి దగ్గరలో ఉన్న కల్లాడికి  వచ్చి స్తిరపడడం తో ఇక్కడే జన్మించి భారతీయురాలు అయింది. ఆమె తల్లి తండ్రులు ఆమె కు 15 యేండ్లు ఉన్నప్పుడే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఆమె కు ఇండియాలో ఉన్న రక్తసంబందీకుల్లొ తల్లి పూర్వపు వివాహం వలన కలిగిన సోదరుడు ఒకరు కాగా , రెండవ సోదరుడు తండ్రి తర్వాతి వివాహం ద్వారా కలిగిన వాడు. తండ్రి ముంబాయిలో , తల్లి ఊటి లో ఉంటున్నారు.ఆమె కూడా వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది.  
                                                                               

                ఇక కల్కి కోచ్లిన్ కేవలం నటి యే కాక స్క్రీన్ రైటర్ కూడా . ఆమె గారు  2015 సంవత్సరం లో నటించిన "మార్గరేట్ విత్ ఎ  స్ట్రా " అనే సినిమాకు జాతీయ స్పెషల్ జూరీ అవార్డ్ వచ్చింది . మొన్ననే డిల్లీలో జరిగిన 63 వ జాతీయ చలన చిత్ర అవార్డుల పంక్షన్ లో రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డ్ తీసుకుని జాతి  ప్రసంశలకు పాత్రురాలు అయింది. కాని అదే అవార్డ్ విన్నర్ అవార్డుల పంక్షన్ అయిపోయాక ఇంటికి వెళుతున్నప్పుడు అవమానం పీల్ కావాల్సి వచ్చ్ందని వాపోయింది . అదేలా అంటే 

     అవార్డుల గ్రహీతల బద్రత కోసం ప్రబుత్వం లేక నిర్వాహకులు  పర్సనల్ రక్షణ సిబ్బందిని నియమిస్తుంది . అయితే కల్కి రక్షణ కోసం నియమించబడిన వారు , ఆమే కారు వద్దకు వచ్చే సమయానికి ఆమె దగ్గర లేకుండా అమితాబ్ బచన్ రక్షణ కోసం వెల్లారట. దానితో ఆమె ఒంటరిగా రక్షణ లేకుండా కారు వద్దకు వెళుతుంటే ఒక్క సారిగా చుట్టు మూగిన అభిమానులు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసేసరికి ఆమెకు ఏమి చేయాలో పాలుపోలేదట. ఇక ఆ అభిమానుల్లో కూడా రాంగ్ పెలోస్ ఉంటారు కాబట్టి వారు ఆమెను తాకరాని చోటల్లా తాకి శునాకానందం పొందుతుంటె , ఈమె బోల్డంత అవమానం పిల్ అయింది. చివరకు ఎలాగో తెగించి ఒక్క ఉదుటున కారులోకి వెళ్లి దొరు వేసుకుని బ్రతుకు జీవుడా అని వెళ్లి పోయింది అట. ఇదే విషయం గురించి తర్వాత అర్గానైజర్లకు పిర్యాదు చేసిందట. అదీ సంగతి. 
                                                                   

      
                    అయితే ఇదే విషయం గురిచి ప్రస్తావించిన ఒక ఆన్లైన్ పత్రిక వారు, "ప్రపంచం లో అతి పెద్ద ప్రజాస్వామిక  దేశమైన భారతదేశం లో ఎప్పటికైనా స్త్రీలు స్వేచ్కగా బయట తిరిగే రోజులు  వస్తాయా " అని ప్రశ్నించారు  , నటి కల్కి కోచ్లిన్ అంటె స్త్రీ కాబట్టి స్వేచ్కగా కారు వద్దకుకూడా వెళ్ళలేక పోయింది అనుకుందాం. మరి సూపర్స్టార్ అమితాబచన్ సంగతి ఏమిటి? అయన మగాడు కదా? ఆయనకెందుకు రక్షణ? అయన రక్షణ సిబ్బంది చాలక ఈవిడ గారి రక్షకులు ఆయనకు రక్షణగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది?   అంటే అభిమానులు ఉన్న వారు స్త్రీ అయినా , పురుషుడు అయినా తగిన రక్షణ లేకుంటే అభిమానుల చేతిలో గాయాలపాలో , అవమానాల పాలో అవ్వక తప్పదు. ఈ  సంగతి తెలిసినోళ్ళు పర్సనల్ రక్షక సిబ్బందినో, తమ వారినో తోడు ఉంచుకునే పంక్షన్ లకు వెలుతుంతారు. అది తెలియకనే స్వంత రక్షణ ఏర్పాట్లు లేకుండా కేవలం ప్రభుత్వం లేక నిర్వాహకులు ఏర్పాటు చేసే రక్షణ మీద నమ్మక్కం తో ఉండటం వలననే ఆమెకు అటువంటి చేదు అనుభవం ఎదురయింది. దానికి దేశా న్ని నిందించడం అంటె  ఇంగితజ్ఞానం లేకపోవడమే. 

          పోలిస్ రక్షణ ఉంది కదా అని , తగిన  జాగ్రత్తలు లేకుండా బంగారం దిగేసుకుని బయటకు వెళ్ళే వారికి ఎలాంటి ముప్పు ఉందో, అలాంటిదే అభిమాన పిశాచ గణం ఉన్న సెలబ్రిటిలకు ఉంటుంది అని తెలుసుకుని తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. అంతే కాని జరగాల్సిన అవమానం  లేక నష్టం జరిగాక "చీ ఈ  దేశం ఇంతేనా? అని ఈసడించుకుంటె అది మరో తెలివి తక్కువ తనం అవుతుంది.కల్కి కోచిలిన్ , రక్షణ  ఉన్న చోట అవార్డులు తో సన్మానం పొందిన నటిమణి యే కాసేపు  రక్షణ లేకపోయే సరికి అవమానం పొందాల్సి వచ్చింది . ఆమె లోని నైపుణ్యం , కళను గుర్తించి జాతీయ స్తాయి అవార్డుతో సన్మానించిన దేశాన్ని కేవలం ఆమె రక్షకులు చేసిన తప్పిదానికి దేసాన్ని నిందించడం సబబు కాదు.    కాబట్టి సెలబ్రిటిలకు , స్త్రీలకు సర్వదా ప్రభుత్వ   రక్షణ తోపాటు స్వీయ రక్షణ కూదా అత్యవసరం అని ఈ  సంఘటణ  తెలియచేస్తుంది. 

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )