పదేళ్ళకే కొడుకు చేతికి "సెల్" ఇస్తే , పాతికేళ్ళు వచ్చేసరికి వాడి ఒంట్లో ఏ "సెల్స్ " పనిచేయవట!
ముద్దు మురిపెం కోసం , డాబు దర్పం కోసం, లేక పిల్లలకి ఏది మంచి, ఏది చెడు అనేది నిర్ణయించడం లో నిర్లక్ష్య వైఖరితో, చాలా మంది తల్లితండ్రులు పిల్లలను సెల్ వాడకం కు అలవాటు పడేలా చేస్తున్నారు. "ఏమండి , నాకు ఇంతవరకు సెల్ పోన్ లో ఎర్ర బటన్, ఆకుపచ్చ బటన్ నొక్కడం తప్పా ఏమితెలియదండి, కానీ మావాడు అయితే ఏకంగా అన్నీ విప్పదీసి మరీ తగిలిస్తాడు తెలుసా! ,అని తన పదేళ్ళ కొడుకుకు సెల్ టెక్నాలజీ పట్ల ఉన్న అవగాహనకు తెగ మురిసి పోతుంటారు అమాయక , అజ్ఞాన చక్రవర్తులైన తల్లి తంద్రులు.
పిల్లలలో 21 వ సంవత్సరం వచ్చే దాక అవయవ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. మెదడు లోని సంక్లిష్ట బాగాలు 21 వ సంవత్సరం వరకు అభివృద్ధి చెందుతూనే ఉంటాయట. అంటే అప్పట్టి దాక వారి వంట్లోని కణ విభజన కొనసాగుతోనే ఉంటుందన మాట. మరి ఇటువంటి దశలో వారి ఆరోగ్యానికి భంగం కలిగించే ఏ వస్తువుకైన, వారిని దూరంగా ఉంచడం వారి బాగోగులు చూసే తల్లి తండ్రులు బాద్యత. మన సమాజం లోని దౌర్బాగ్యం ఏమిటో కానీ , వ్యక్తులు ఆడంబరాలకు ఇచ్చిన ప్రాముఖ్యత ఇతర ఇంపార్తేంట్ విషయాలూ కు ఇవ్వరు. చదువులో మార్కులు పక్కింటి పిల్లవాడి కంటే తక్కువ వచ్చినా పెద్దగా ఫీలవరు కానీ పక్కింటి పిల్లవాడు సెల్ కొనుకుని తన పాండిత్యం చూపుతుంటే మాత్రం ఠక్కున తమ కొడుక్కి సెల్ కొని ఇవ్వవలసిందే!. లేకుంటే తాము చుట్టు ప్రక్కల వారి ద్రుష్టిలో పిల్లలకు సెల్ కూడా కొనివ్వలేని దరిద్రులమని బావిస్తారు అని ఫాల్స్ ప్రెస్టేజ్. ఒక్క సెల్ విషయం లోనే కాదు, ఆహార విషయాలలో అంతే . తమ పిల్లలు ఇతరుల పిల్లల స్తాయికితగ్గకుండా అడ్డమైన జంక్ పుడ్ లు తిని ఆరోగ్యం పాడుచేసుకుంటున్నా అవగాహన లేని, ఉన్నా పిల్లలను మందలింఛి, వారికి అవగాహన కల్పించే ఓపిక తీరిక లేక వారి కోర్కెలకు తల వంచి, వారి బవిషత్ ను అనారోగ్యాలకు గురి చేస్తున్నారు .
ఇన్నీ మాటలు చెప్పినా ఎవరి తలకు ఎక్కక పోవచ్చు. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే చిన్నపిల్లలపుడే వారికి సెల్ అలవాటు చేస్తే ఖచ్చితంగా దానీ ప్రబావం వారిలోని సంతాన ఉత్పత్తి సామర్ద్యాన్ని దెబ్బ తీస్తుందట. అంటే వారు పిల్లల కోసం పెర్టిలిటీ సెంటర్ ల మీద ఆదారపదవలసి వస్తుంది. అంతే కాదు ఎలా గు సెల్ చేతిలో సెల్ ఉంటుంది, పక్కన చెడు సావాసాలు ఉంటాయి కాబట్టి, సెల్ లో ఉన్న ఏ విజ్ఞానం వారు ఉపయోగించక పోయిన "గుప్తజ్ణానం" గురించి మాత్రం తెలుసుకుంటూ ఉంటారు. ఇది వారి వయసు లక్షణం. ఇలా పది పదిహేనేళ్ళు వాటి వీక్షణలకు అలవాటు పడితే అబ్బాయిల ప్రవర్తనలొనే మార్పు రావచ్చు. దాని ప్రభావం వారి లైంగిక సామర్ద్యాన్ని దెబ్బ తీయవచ్చు. ఎందుకంటే ఆ విషయం లో శారీరక అంశాలు కంటే మానసిక అంశాలే ప్రబావపరుస్తాయని మానసిక నిపుణుల మాట. అంటే వెనుక విఠలా చార్య సిన్మాల్లో మాదిరి సెల్ కూడా ఒక "జగన్మోహినీ" లాంటి దెయ్యమే. దానికి అలవాటు పడ్డవాడు సంసారానికి దూరమై పోవాల్సిందే.
కాబట్టి పై విషయాల దృష్ట్యా పిల్లలకు పెళ్లి చేయాలన్నా , సెల్ చేతికి ఇవ్వాలన్నా 21 వ సంత్సరం దాటాల్సిందే. అంతే కాదు శ్రుంగార అంగీకార వయో పరిమితి కూడా 21 అ సంవత్సరంగా చేస్తే మేలు. పిల్లలని ప్రేమించేవారు జీవిత భీమా చేయకపోయినా పర్వాలేదు కానీ చేతికి మాత్రం సెల్ ఇవ్వవద్దు. ఇచ్చి వారిలోని సెల్ సిస్టం పాడు చేయవద్దు. ఇదే విషయం మీద మరింత అవగాహన కోసం ఐ క్రింది లింక్ ను క్లిక్ చేసి చూడండి. ఇది పది మందికి ఉపయోగపడేది అనుకుంటే షేర్ చెయ్యండి. http://www.ehhi.org/reports/cellphones/health_risks.shtml
(Republished post OPD 25/11/2013)
ReplyDeleteసెల్ఫోనుల నివ్వగనే
ఫిల్ఫోరు లనగ పిశాచ పింజా రులనన్
ఉల్ఫాగా తిరుగాడుచు
గుల్ఫాంలను గోరెనోయి గువ్వల చెన్నా !
జిలేబి