లక్ష మంది విద్యార్దులు మరియు వారి తల్లి తండ్రులు Vs ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వము

                                                                
 
                                                              

   జులై రెండవ తారీకు దాక ఏ మద్యంతర ఉత్తర్వులు ఇచ్చేది లేదన్న బారత సర్వోన్నత న్యాయస్తానం హఠాత్తుగా నిన్న "నీట్’ పై వెలువరించిన మద్యంతర ఉత్తర్వులతో, ఆంద్రప్రదేశ్ లోని లక్షమంది వైద్య విద్య ప్రవేశ పరీక్షలు రాసిన విద్యార్థులు మరియు వారి తల్లి తండ్రుల ను పెద్ద "నీట్" గండం నుంది బయట పడేసారు. లేకుంటే గత నాలుగు నెలలుగా ఏమి చదవాలో, ఏమి రాయాలో తెలియని ఆయోమయ పరిస్తితిలో విద్యార్థులు, వారు పడుతున్న టెన్షన్ చూసి, బాదతో తల్లడిల్లిన తల్లితండ్రులు మరియు మనసున్న లెక్చరర్లు అందరూ మరొక రెండు నెలలు టెన్షన్ కు గురి కావల్సి వచ్చేది. అసలు ఇలా జరగడానికి కారకులు ఎవరు?.

   వైద్య విద్యా విదానంలో జాతీయ స్తాయిలో ఒక సమగ్ర విదానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా బారత వైద్యమండలి, జాతీయ స్తాయిలో" నీట్" పరీక్షను తప్పని సరి చేస్తూ, ఈ సంవత్సరం నుండే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో,ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ విద్యార్దులకు గుండెల్లో రాయి పడింది. కారణం వారు "నీట్" కు సంబందించిన సిలబస్ చదవక పోవడమే. గత మూడేళ్లుగా ఈ విషయం గురించి చెపుతున్నా అన్ని విషయాలకు వలేనే ఇ విషయంలో కూడ మన సర్కార్,మొద్దు నిద్ర పోతూ విషయాన్ని నిర్లక్ష్యం చెయ్యడంతో, సుమారు లక్షమంది విద్యార్థుల బవిష్యత్తు గందరగోళంలో పడినట్లయింది. దీని మీద మేదావులు విద్యావేతలు, తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చెయ్యడంతో ఒక్క సారిగా మొద్దు నిద్ర నుండి లేచి, స్వయంగా ముఖ్య మంత్రిగారే, ఈ సంవత్సరం వరకైనా "నీట్" నుండి మినాహింపు ఇవ్వాలని, బారత వైద్య మండలికి లేఖ రాస్తే అది సుప్రీంకోర్ట్ వారి నిర్ణయమని దానికి తాము చెయ్య గలిగింది ఏమి లేదని వారు చేతులెత్తే సరికి, ఒక్కసారిగా ప్రబుత్వం తెల్ల ముఖమేసింది. ఇటువంటి పరిస్తికి తామే కారణమని తప్పు తెలుసుకుని మినాహింపు కొరకు సుప్రీంకోటు వారిని ప్రాదేయపడగా వారు ముందు అటూ "నీట్" ఇటూ "ఎంసెట్" రెండు పరీక్షలు నిర్వహించమని, పలితాలు మాత్రం తాము చెప్పే దాక వెలువరించవద్దని మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

   దీనితో అటు కొన్నాళ్ళు "నిట్" అని కొన్నాళ్ళు "ఎంసెట్" అని వస్తున్న పుకార్లను నమ్మి, నాలుగురోజులు దానికి నాలుగు రోజులు దీనికి తయారు అవుతూ విద్యార్థులు ఏది సరిగా చదవలేక పోయారు. ఇటూ నీట్ పరీక్ష కోసం ఎంట్రెన్స్ పీజ్  "వేయి" రూపాయలు వసూలు చేసిన ప్రబుత్వం మాత్రం సుమారు ఎనబై వేళ మంది విద్యార్థుల నుండి "ఎనిమిది కోట్ల" రూపాయలు వసూలు చేసింది. ఎర్రని ఎండల్లో జరిగిన నీట్ పరీక్ష అటు తల్లితండ్రులకు వ్యయ ప్రయాసలు మిగిలిస్తే, ఇటు విద్యార్థులకు అంతులేని టెన్షన్ మిగిలించింది. చివరకు అది రద్దు కావడంతో ఊపిరి పీల్చుకున్నా, గత ఐదునెలలుగా పడిన పిల్లల టెన్షన్ వారి ఆరోగ్యాల మీద ఎంతటి దుష్పరిణామాలు చూపాయో వారిని దగ్గరిగా పరిశిలించిన వారికి మాత్రమే తెలుస్తుంది.

   ఇలా పిల్లల జీవితాలతో ఆటలాడిన ఈ సర్కార్ నిర్లక్ష్య దోరణికి సుప్రీం కోర్టు వారు తగిన విదంగా గుణపాటం చెప్పేటట్లు తుది తీర్పు ఇస్తే బాగుంటుంది.భవిష్యత్తులో ఇటువంటి విదానాలు పునరావ్రుతం కాకుండా ఉంటాయి.             

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )