ఆమెను అదృష్టం అమెరికాకు పంపినా , గ్రహచారం మళ్ళీ మైలవరం కే లాక్కొచ్చిందట !!




                                           సినిమాలు చూసి యువత పిచ్చిదయిపోతుందో  లేక  సమాజం లో ఉన్న పిచోళ్ళని చూసి సినిమాలు తీస్తున్నారో తెలియదు కానీ, కొంతమంది ప్రేమ వ్యవహారాలు చూస్తుంటే అచ్చం ప్రేమ సినిమాకి పనిని వచ్చే కధలు మాదిరే ఉంటున్నాయి. ఉదాహరణకి మొన్న ఆత్మహత్యా ప్రయత్నం చేసి హాస్పిటల్ పాలు అయినా "మానస " అనే అమ్మాయి ఉదంతమే చూద్దాం.

    అమ్మాయిది కృష్ణా జిల్లాలోని మైలవరం. హేమంత్ అనే కుర్రాడిని ప్రేమించింది. సరే ,చాలా మంది తల్లి తండ్రులు ఒప్పుకోనట్లే అమ్మాయి ప్రేమించినోడిని పెండ్లి చేసుకోవడానికి ఆమె తల్లి తండ్రులు ఒప్పుకోలేదట. సింపుల్ గా తన ప్రేమ వ్యవహారం గురించి పెద్దలకు చెప్పింది కానీ, వారు చూసిన సంబంధం వద్దని మాత్రం గట్టిగా చెప్పలేక పోయిందో, చెప్పినా వారు వినిపించుకోలేదో కానీ, తల్లితండ్రులు కుదిర్చిన అమెరికా సంబంధం చేసుకుని , అమెరికా వెళ్ళిపోయింది. 
  
    ఇక ఇక్కడ ఆమెను గాఢంగా ప్రేమించిన ప్రియుడు , ఆమె పెండ్లి చేసుకుని అమెరికా పోయినంత సేపు కామ్ గా ఉండి , తీరా ఆమె కాపురానికి వెళ్ళిపోయాక , "నీవు లేకుండా నేను బ్రతుకలేను" అనే సినిమా డైలాగులతో ఫోన్ లో ప్రేమ సందేశాలు ఇవ్వడం మొదలు  పెట్టాడు ఆట. " మరి నాకు పెండ్లి అయిపోయింది కదా, ఇప్పుడెట్టా అంటే " నీకే భయం అక్కరలేదు. నాకు నీవు ముఖ్యం కానీ, నీకు అయిన పెండ్లి ముఖ్యం కాదు, నీవు గనుక అమెరికా నుండి వచ్చేస్తే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా" అని అంటుంటే ఆమెలో అణగిపోయిన పాతప్రేమ మళ్ళీ చిగురించడం మొదలు పెట్టింది ఆట. చివరకు ప్రేమ పోరు తట్టుకోలేక ఎలాగో ప్రియుడి కోసమని హైదరాబాద్ వచ్చ్చిందట. 

  ఇక ఇక్కడ ఆ వీర ప్రేమికుడు ఆమెను రమ్మని ఏదో కాజువల్ గా అన్నట్లు ఉంది , తీరా ఆ పిచ్చిది అది నిజమే అని నమ్మి వచ్చే సరికి , కంగారు పడి  ఆమెకు ముఖం చాటేశాడు ఆట. పాపం ,ఆ అమ్మాయి ఎన్ని సార్లు ఫోన్ చేసినా నో రెస్పాన్స్! దానితో ఆ అమ్మాయి ఖిన్నురాలై తల్లి తండ్రులు వద్దకు వెళదాం అనుకుంటే , వారు "నీ  ముఖం మాకు చూపించకు " అన్నారట. ప్రియుడి కోసం కట్టుకున్నోడిని వదిలి , విదేశం నుండి తిరిగి వచ్చిన ఆమెను  భర్త  తిరిగి స్వీకరించే సమస్యే లేకపోవడం తో , డిప్రెషన్ కి గురై ఆత్మ హత్య చేసుకోబోయింది. కానీ సకాలం లో చుట్టుప్రక్కల వారు గమనించడం తో హాస్పిటల్లో చేర్చబడి , ప్రాణాలు నిలుపుకోగలిగింది. 

   ఈ విషయం ఆ నోటా ఈ నోటా ప్రాకి చివరకు TV వారికి చేరింది. ఇక ఇలాంటి విషయ ప్రసారాలు కోసమే అవతరించిన TV 9 వారు , మంచి బేరం దొరికిందనుకుని,విఫలమైన  ఆమె వీర ప్రేమ గాదని లైవ్ ప్రోగ్రామ్ గా మార్చి అటు ఆమె ను , ఇటు ఆమె ప్రేమికుడిని ప్రశ్నలు మీద ప్రశ్నలు తో వేధిస్తూ, తమ రేటింగ్ ల కోసం తెగ ప్రయాస పడసాగారు. మొదట్లో ఆ వీర ప్రేమికుడు తన కోసం అమెరికా నుంచి ఎగిరివచ్చిన ప్రియురాలిని స్వీకరించడానికి ససేమిరా కుదరదు అన్నాడట. కానీ TV లో ఇదంతా చూస్తున్న జగన్ గారి పార్టీ MLA గారికి , ఎలాగైనా ఆ పిల్లకి న్యాయం చేద్దాం అనిపించి , ఆ ప్రేమికుడిని వెతికి పట్టుకుని హాస్పిటల్ కి తీసుకు వచ్చివారిద్దరిని కలిపి వేశారు. మరి  ఆయన చేసిన పని లీగల్ గా కరెక్టు కాకపోయినా ,ఇలా జీవితం అంతం చేసుకుందాం అనుకున్న ఒక  అమ్మాయి జీవితాన్ని నిలబెట్టడానికి  దోహదం చేసింది అని చెప్పవచ్చు. 

     అయితే ఇక్కడ జనాలకు కలిగే  అనుమానం ఏమిటంటే:

 (1)  అమ్మాయి పెండ్లి చేసుకుని అమెరికా వెళ్ళేదాకా కామ్ గా ఉన్న వీర ప్రేమికుడు , అమ్మాయి కాపురం చేసుకుంటుంటే  తిరిగి ఎందుకు ఆమెను కెలికాడు? 

  (2) నీవు ఇండియా వస్తే   పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అన్నోడు , తీరా ఆ అమ్మాయి ఇండియా వచ్చే  సరికి  ముఖం  ఎందుకు చాటేశాడు? 

   (3). MLA గారి మీద భక్తితోనో , భయంతోనో , ఆమె చేతిలో చేయి వేసిన వ్యక్తి, భవిష్యత్ లో ఆమెకు చేయి ఇవ్వడని గ్యారంటీ ఉందా?

   (4). ఇలాంటి పిరికి ప్రేమికుడు కోసమ్ , బంగారం లాంటి భర్తను వదులుకుని , అమెరికా నుండి వెనక్కు వచ్చిన ఆమె లో పరిపక్వత  ఉన్నదని అనుకోగలమా?  

   వీటన్నింటికి కాలమే సమాధానం చెప్పాలి. అప్పటి దాకా మనం అనుకోవలసింది ఒకటే . ఆమెను అదృష్టం అమెరికాకు  పంపినా , గ్రహచారం మళ్ళీ మైలవరం కే  లాక్కొచ్చిందట !! అని. 

Comments

  1. ఆమెను అదృష్టం అమెరికాకు పంపినా , గ్రహచారం మళ్ళీ మైలవరం కే లాక్కొచ్చిందట !!
    మీరు చెప్పినదానికి ౧౦౦% ఏకీభవిస్తాను ... నిన్న టీవీలో వీడూ, వీడి మాటలూ చూసాక ఆ అమ్మాయి ఎంత తప్పు చేసిందో అర్ధమైంది ..

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!