"భారతీయ సంస్క్రుతి,బాలిఉడ్ హీరో ఇజం అంత నీచమైనది" అన్న లాయర్ వాదనతో ఏకీభవించి ,నిందితుడిని వదిలేసిన ఆస్త్రేలియన్ కోర్టు !

                                                                     


 భారత దేశం లో కొంతమంది మగాళ్ళకు ఉన్న ప్రత్యెక గుణం  "భారతీయ మగబుద్ది ". దిని గురించి  ఆనోటా ,ఈ నోటా పాకి  చివరకు ప్రపంచం అంతా పాకిపోతుంది . అయితే అన్నీ దేశాల్లోచివరకు ఇండియాలో  దీన్ని" వేదవ  తనం " గా పరిగణించి  శిక్షలు వేస్తుంటారు . కాని భారత దేశంలోని కొంత మంది మోడ్రన్  యువత మాత్రం "హీరో యిజం "గా బావిస్తుంది . అందుకే మన సినిమాల్లో హీరోలు వేసే ఈ వెదవేషాలకు యువత బ్రహ్మ రదం పట్టి పిక్చర్ ని సూపర్ డూపర్ హిట్ చేస్తుంటారు . అదే పని బయట చేస్తే మాత్రం గగ్గోలు పెడుతూ ,ప్లే కార్డులు పట్టుకుని ప్రదర్శనలు ఇస్తూ భారతీయ మగ బుద్ది ఇదే అంటూ  నానా యాగి చేస్తుంటారు .  అయితే భారతీయ బాలిఉడ్ సినిమాలు లో హీరోలు ప్రదర్శించే సదరు వేదవ బుద్దిని జడ్జ్ గారికి చూపించి ,"యువరానర్  భారతీయ మగాళ్ళ బుద్దే అంత వెదవిది  సార్ "అని నమ్మించి తన క్లైంట్ కు శిక్ష పడకుండా చేసాడో ఆస్త్రేలియన్ లాయర్ !ఆ కదా ,కమామీషు ఏమిటొ చూడండి .

అతని పేరు సందేశ్ బాలిగా . వయస్సు 32 సంవత్సరాలు . 3 సంవత్సారాలు క్రితం విద్యార్దిగా ఆస్ట్రేలియాలో అడుగు పెట్టాడు . అతడు అక్కడ  చదువు కోసం ఎంత శ్రమ పడ్డాడో తెలియదు కాని  18 నెలలు ఒక అమ్మాయిని ,4నెలలు మరో అమ్మాయి చుట్టూ కుక్కలా తిరుగుతూ హిందీ పాటలు పాడుతూ వారిని మచ్చిక చేసుకోవడం కోసం నానా తిప్పలు పడ్డాడు అట . అదే పని ఇండియాలో చేస్తే అమ్మాయిలూ తాము గొప్ప ఇమేజ్ ఉన్న హీరోయిన లా వాడిని ఓ హీరోలా బావించి,ఏదో ఒక బలహీన క్షణంలో లొంగి పోయి ఆనక బావురు మనేవారు కావచ్చు .కాని ఆస్ట్రేలియాలో అమ్మాయిల దగ్గర ఆ  పప్పులు ఉడకవు అనుకుంటా . అందుకె ఎంతో కాలంగా కుక్కలా తమ వెంట పడుతున్న అతడిని ఆసహ్యించుకుని పోలిస్ కేసు పెట్టారు . కోర్టు లో కేసు విచారణకు వచ్చింది .

                                                                             

 బాలిగా లాయర్ పేరు గ్రెగ్ బారెంస్ . అయన బాలిగను "ఇలాంటి వెదవ  పని ఎందుకు చేసావు ?" అని అడిగాడు . "ఇది వెదవ పని కాదు సార్ ,మా దేశంలో దీనిని హిరోఇజమ్ అంటారు.మా దేశంలో అమ్మాయిలని ఆకర్షించాలి అంటే ఇదే కరెక్టు విదానం .అమ్మాయిల  వెంటపడని వాడిని  ఇండియా లో అమ్మాయిలూ "బుద్దూ " అంటారు ,వెంటపడి కుక్కలా తిరిగే వారిని "హిరో" అంటారు .ఇది మా కాలేజీల్లో సర్వ సాదారణం సార్ .కావాలంటే మా బాలిఉడ్ సినిమాలు చూడండి " అని లాయర్ గారికి బోల్డన్ని హిందీ సినిమాలు చూపించే సరికి అయన బోల్డంత ఆశ్చర్య పోయాడు .

 కోర్టులో జడ్జ్ గారికి అదే విషయాన్ని చెపుతూ " యువరానర్ ,ఇండియాలో అబ్బాయిలు అమ్మాయిల వెంట పడడం,అబద్దాలు చెప్పడం,చొల్లు కార్చుకోవడం క్వైట్ కామన్ . అది  వారి కల్చర్ లో బాగం . కాబట్టి నా క్లైంట్ అమ్మాయిలను ఇంప్రెస్ చెయ్యడానికి  ఇండియా  అమ్మాయిలూ అనుకునే హిరోయిజమ్ ప్రదర్శించాడు తప్పా ,ఇక్కడి అమ్మాయిలూ బాద పడతారని అనుకోలేదు " అని ఇండియా లో మగ బుద్ది గురించి వివరంగా చెప్పాడు .తన వాదనకు సాక్ష్యంగా జడ్జ్ గారికి బాలిఉడ్ సినిమాలు చూపించే సరికి ,జడ్జ్ గారికి జాలి వేసి "ఇండియాలో వేదవ పనులు చేసే వారు హీరోలు కావచ్చు కాని ,ఇక్కడ అది కుదరదు . ఇన్నాళ్ళు ఇండియాలో పెరిగిన బాలిగా ఇలాంటి వేదవ పనులును చేయడం కామనే కాబట్టి అతడిని క్షమిస్తున్నాం . అయితె ఒక కండిషన్ 5 సంవత్సరాలు అతడి ప్రవర్తన అబ్సర్వ్ చేయాలి . ఆ  కాలం లో ఏవైనా ఇలాంటి వేదవ వేషాలు వెస్తే తిరిగి కేసును రీ ఓపెన్ చెయ్యడం జరుగుతుంది . అప్పటిదాక కేసును వాయిదా వేస్తున్నాను "అని తీర్పు ఇచ్చారు .

అయ్యా ! అదీ విషయం .. మన దేశం లో నాగరిక యువత మెచ్చుకునే బాలిఉడ్ హీరోల వెదవ వేషాలను భారతీయ సంస్కృతిలో బాగంగా అస్త్రీలియన్ కోర్టును నమ్మించి ఒక  వెదవ  శిక్ష నుంచి తప్పించుకున్నాడు   .కాని పిల్లలను అవసర రీత్యా దండించడం భారతీయ తల్లి తండ్రుల  విదానం అని చెప్పినా వినిపించుకోకుండా నిర్దోషులైన ఆంద్రా జంటకు నార్వే దేశంలో శిక్షలు విదించారు . పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అన్న చందానా ,జడ్జ్ కోబుద్ది ,దేశానికో తీర్పు! మొత్తానికి  భారత దేశం లో అమ్మాయిల వెంటపడే  వెదవ తనమే హీరోఇజమ్ అని లోకానికి చాటి చెప్పింది ఈ కేసు .ఇంకేం ! హీరోలు రెచ్చిపొండి . అమ్మాయిలని ఇంప్రెస్ చెయ్యడానికి  వెంటపడండి . పిచ్చి కుక్కలా చొంగ కార్చండి .అమ్మా బాబులు సంపాదించింది "ఆమె " ప్రాపకం కోసం వెచ్చించండి .అలా నెలల తరబడి తిరిగి O.K అంటే కోరిక తీర్చుకోండి .లెకుంటే  ఏది చేస్తె మీ కసి తీరి వారు బోరుమని విలపిస్తారో ఆ పని చెయండి . సినిమాల్లో హీరోలు చేస్తుంది ఆ పనే కదా ! ఇండియన్ హిరోస్ జిందాబాద్ !


SOURCE   http://www.hindustantimes.com/world-news/indian-man-chases-aus-women-bollywood-style-gets-court-rap/article1-1311683.aspx

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!