పెండ్లి పత్రాలు ఏమి ఖర్మ,ఏకంగా పెండ్లాన్నే మార్చేసాడట!

                                                                             


ప్రస్తుత సమాజంలో మనుషులు అడ మగ తేడా లేకుండా తమ పబ్బాలు గడుపుకోవడం కోసం ఎంతటి నీచమైన పనులకైనా ఒడిగట్టే స్తాయికి దిగజారారు . ప్రస్తుత తరం లో కొంత మంది అసలు వివాహం అన్నా వివాహా వ్యవస్తా అన్నా  బొత్తిగా గౌరవం లేకుండా పోయింది . పోనీ సాంప్రదాయాలు అంటే గౌరవం లేక పొతే  లేకపోవచ్చు కాక, కనీసం చట్ట భయమైనా ఉండాలి కదా , అది అస్సలు భయం లేదు మాకు అన్నట్లు ప్రవర్స్తిస్తున్నారు ,. విషయం ఏమిటంటే :
     గత సంవత్సరం ఆగస్టు 30 న ఖమ్మం జిల్లా వెంకటగిరికి చెందిన రజితతో మహేశ్ అనే సెల్ పోన్ షాప్ లో పని చేసే కుర్రాడితో పెండ్లి అయింది . వారి వైవాహిక జీవితం పలిo చడం తో రజిత గర్భవతి అయి , కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిందట . రజితతో  పెండ్లి కాక పూర్వం మహేశ్ గుంటూరులో  విజయ లక్ష్మి అనే ఒక అమ్మాయిని ప్రేమి oచాడట ! గత ఏడాది జులై నెలలో వారిద్దరి మద్య ఏదో గొడవలు రావడం , విజయ లక్ష్మి మహేశ్ మిద చీటింగ్ కేసు పెట్టడం కూడా జరిగిందట . మరి అ కేసు సంగతి ఏమైందో కాని , అ తర్వాత మహేశ్ ఖమ్మం  వచ్చి రజితను వివాహ్హ మాడినట్లు తెలుస్తుంది .
 విజయలక్ష్మి , మహేశ్ ల మద్య పాట సంబంధం నడుస్తున్నట్లు ఉంది, ఆమె కోరిక మేరకు , ఆమెను కూడా వివామాడడానికి నిర్ణయించు కున్నాడు మహేశ్ . రజిత పుట్టింటికి వెళ్ళిన సమయం చూసి , అబ్బాయి గారు పెండ్లి కొడుకు లాగా ముస్తాబు అయి , టింగు రంగా అంటూ , గుంటూరులో విజయలక్ష్మిని పెండ్లాడ బోతున్న సమయం లో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి విజయ లక్ష్మి మహేశ్ లను పోలిస్ స్టేషన్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నారట . ఇది నిన్న జరిగిన విషయం . మహేశ్ రెండవ వివాహం గురించి ఎవరో రజితకు ఉప్పందిo చబట్టి సకాలంలో స్పందించిన రజిత ఆమె తల్లి గుంటూర్ వెళ్లి అర్బన్ S.P గోపినాద్ గారికి మొరపెట్టుకుంటే , అయన ఆదేశాల మేరకు పోలీసులు మహేశ్ , విజయలక్ష్మి ని అరెస్ట్ చేయడం జరిగింది .
పోలిస్  దర్యాప్తులో రజిత కంటే ముందే విజయలక్ష్మిని వివాహమాడినట్లు , తప్పుడు తేదీలతోపత్రాలను సృష్టించి గుంటూరులో రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిసిందట . ఇదంతా విజయలక్ష్మికి మొదటి బార్య పదవి కట్ట బెట్టడం ద్వారా , లీగల్ గా ఆమె భార్య అని చట్టాన్ని నమ్మించడానికి చేసిన ప్రయత్నం కావచ్చు అని పోలిస్ లు అనుకుంటున్నారట ఈ  విషయంలో ఆడపిల్లలు అమాయకంగా అలోచించి మగవాడి కపట బుద్దికి బలి అయి పోతున్నారు . సాటి ఆడపిల్ల ఏమైతే నాకెందుకు ? మంఛి వాడో , చెడ్డవాడో ఎవడో ఒకడు మొగుడు అయితే చాలు , తనకు సమాజ o లో భద్రతా ఉంటుంది అని ఆడపిల్లలు , వారి తరపు వారు ఆలోచిస్తున్నoత  కాలం మహేశ్ లాంటి నిత్య పెండ్లి కొడుకుల ఆటలు సాగుతూనే ఉంటాయి .
  గుంటూరులో మోసం కేసును పెట్టిన విజయలక్ష్మి , అతని మిద సరి అయిన చర్యలు తీసుకోకుండా , ఆటను మరొక పెండ్లి చేసుకోవడానికి అవకాసం ఇవ్వడమే కాకుండా తిరిగి మరొక ఆడపిల్ల హక్కులకు భంగం కలిగేలా మహేశ్ కు సహకరించడంతో , ఆమె కూడా పోలిస్ కేసులో ఇరుకోక తప్పలేదు . ఒకరిని మోసం చేసిన వాడు మరొకరిని చేయకుండా ఉంటాడు అని గ్యారంటి ఏమిటి ? అందుకే తప్పు చేసిన వాడు క్షమార్హుడు అవ్వచ్చేమో కాని , నేరం చేసిన వాడు కాదు . అటువంటి నేరస్తుల మిద సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంటే , మరొక ఆడపిల్ల బ్రతుకు నాశనం కాకుండా ఉంటుంది అనేది ప్రతి ఆడపిల్ల గ్రహించడం మంచిది . లేకుంటే స్త్రీకి స్త్రీయే శత్రువు అనే నానుడిని నిజం చేసిన వారవుతారు!.

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )