గడ్డాలు గిసుకునే బ్లేడ్లకు, అసబ్యపు అమ్మాయిలు ప్రచార కర్తలా !?
ఈ మాటన్నది ఎవరో కాదు , సాక్షాతూ ఈ దేశ అత్యున్నత న్యాయస్తానం లో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుదాంశు జ్యోతి ముఖోపాధ్యాయ !. నిన్న సికింద్రాబాద్ లో ఆంధ్రప్రదేశ్ జుడిషియల్ అకాడెమి ఆద్వర్యంలో"మహిళకు హింస నుంచి రక్షణ , చట్ట పరమైన పరిష్కారాలు ,న్యాయవ్యవస్త స్పందన" అనే అంశం పై జరిగిన సెమినార్ లో అయన పై విదంగా స్పందించారు . ప్రస్తుత సమాజంలో మహిళల పట్ల చాలా చులకన బావంతో వ్యవహరిస్తున్నారని , అదే ప్రాచిన కాలంలో స్త్రీలకు విశిష్ట స్తానం , గౌరవం ఉండేవని , కాని రాను రాను సమాజంలో ఆ బావనలు మారిపోయి స్త్రీలను చులకన చేసే దోరణి అధిక మయిoదని , చివరకు పురుషులు వాడే షేవింగ్ బ్లేడ్ల అడ్వర్టైస్మెంట్లకు సైతం స్త్రీలను అసబ్యపు దుస్తులలో చూపించడం దారుణం అని అన్నారు . కొన్ని చోట్ల సాoప్రాదాయపు ముసుగులో వారిని అణచివేయాలని చూస్తుంటే , మరి కొంత మంది ఆదునిక బావాజాలా లు పేరుతొ వారిని వ్యాపార వస్తువులుగా మార్చి వేస్తున్నారు ఆని అన్నారు . భారతీయ న్యాయ వ్యవస్త సహించదు అనే రీతిలో కేసులలో తీర్పులు వేలువరిoచాల్సిన అవసరం ఉంది అని అన్నారు .
గౌరవ న్యాయమూర్తి గారి అభిప్రాయం నూటికి నూరు పాళ్ళు కరెక్టు . భారతీయ స్త్రీలకు ఒకప్పుడు ఉన్న గౌరవం ఇప్పుడు లేదు . మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకోలా ప్రవర్తించే ఈ కృత్రిమ సమాజంలో స్త్రీల పట్ల చాలా చులకన బావమే ఉందని చెప్పవచ్చు . దానికి కారణం పురుషుల మనస్త్వతమా ? స్త్రీల ప్రవర్తనా అని ఆలోచిస్తే అవి కాదు అసలు కారణం అని చెప్పక తప్పదు . కేవలం లాభాపేక్షతో నడుస్తున్న వ్యాపారవాదం , దానికి పరోక్షంగా సహకరిస్తున్న ఆదునిక స్త్రీ వాదమే అని చెప్పక తప్పదు .అసలు స్త్రీని ఒక వ్యాపార వస్తువుగా మార్చి తమ అభివృద్దికి వారి శరీరాలను సోపానాలుగా మార్చిన ఈ వ్యవస్తలో స్త్రీ స్వేచ్చా అనే పదానికే అర్ధం లేకుండా పోయింది . బలవంతమైన వ్యాపార సంస్కృతిని ఎదుర్కోలేక సగటు మనుషులు తమ స్త్రీలను కాపాడుకోవాలనే తలంపుతో సంప్రాదాయ బావాలనే అనుసరిస్తున్నారు తప్పా , వారిని అణచివేయాలని మాత్రం కాదు .స్త్రీ అభివృద్ధి కంటే వారి
రక్షణే ముక్యం అనేది సగటు భారతీయుల ఆలోచన .ప్రస్తుత సమాజంలో ఆదునిక బావాలు కంటే సాంప్రదాయ బావాలే స్త్రీలకు రక్షణ ఇస్తున్నాయి . అందుకే ఇంకా సాంప్రదాయ విదానాలకు ప్రజలలో ఆదరణ ఎక్కువ అవుతుంది .
ఇదే విషయం లో ఇంతకూ ముందు ఒక టపా "
Comments
Post a Comment