భగవంతుని ముందు "బజార్ వేషాలు" వెయ్యడం బిగ్ బజార్ వారికి తగునా?
బిగ్ బజార్ పేరుతొ అన్నింటిని అమ్ముకునే వారికి అందమైన భారత దేశమంటే వారి దృష్టిలో అందమైన అమ్మాయిలూ వారి బజార్ లో కొన్న జీన్స్ వేసుకుని , ఊగుకుంటూ , ఊగుకుంటూ దేవాలయానికి వెళ్లి అక్కడి దేవతా మూర్తులకి "హాయ్ భగవాన్ జి" అంటూ విష్ చేసి , పూజారితో సి యా అని చెప్పేసి ఎగురుకుంటూ , ఎగురు కుంటూ బయటకి వెళ్లి పోవడం, ఆ తర్వాత ఆ పూజారి కూడా సియా రామ్ ,సియా రామ్ అంటూ అసలు దేవుడి నామం నే మరచి అమ్మాయి మాటలను వల్లే వెయ్యడం ఏమిటిదంతా ? . నిజంగా ఇదే యాడ్ ఇతర మతాలకు సంబందించిన దేవత ల పట్ల ప్రవర్తించినట్లు చూపిస్తే , ఈ పాటికి ఎన్ని బిగ్ బజార్లు బద్దలు అయ్యేయో ? ఎవరిచ్చారు వీరికి హిందూ సామ్ప్రాదాయలను అవమానించే హక్కు? నీ బట్టలు అమ్ముడు పోవడం కోసం భగవత్ ఆరాధనా విదానాలునే ఇంతగా అవమానిస్తారా? భగవంతుడు అంటే బాయి ప్రేండా ? హాయి చెప్పటానికి? దీనిని ఒక హిందువుగా తీవ్రంగా ఖండిస్తున్నాను .
Comments
Post a Comment