తెలుగు నేల ముక్కలైందని వాళ్ళు ఏడుస్తుంటే "తెలుగు తేజం " అని మొదలెడితే మండదా మరి ?!
మన రాజకీయ నాయకులలో "జయ ప్రకాష్ నారాయణ్ ' గారు గొప్ప మేదావి అనడంలో ఎవరికీ అబ్యంతరం ఉండదు . ఏ విషయం లోనైనా ఒక సమగ్రమైన అవగాహన కలిగి ఉండటమే కాక ఏ సమస్య కైనా తగిన పరిష్కారం చెప్పగలిగిన దిట్ట అయన గారు !కాని ఆయనలో ఉన్న మైనస్ పాయింట్ ఏమిటంటె ప్రజల మనోబావనలు ఎరిగి మసలక పోవడం . ఒక చిన్న ఉదాహరణ చెపుతాను.
ఒక ఊరిలో ఒక డాక్టర్ ఉన్నాడు ఏ రోగానైనా అతి త్వరగా తగ్గించగల సమర్దుడు . ఊరీ జనానికి ఒక రోగం తగిలింది . దానికి డాక్టర్ గారు ఇంజెక్షన్ లే సరైన వైద్య విదానం అంటే "అమ్మో సూది అంటే భయం మాకొద్దు ' అన్నారు జనం . కానీ సూది మందు తీసుకోవాల్సిందే అన్న డాక్టర్ ని ప్రజలు దూరం పెట్టారు . కానీ డాక్టర్ మాత్రం సూది మందు తీసుకొండి అని ప్రజలను కోరుతూనే ఉన్నాడు తప్పాఅదే మందును పిల్స్ రూపం లో ఇచ్చి వారి రోగాన్ని నయం చేయవచ్చు అని ఆలోచించ లేక పోతున్నాడు . ఆ విదంగా ప్రజలకు డాక్టర్ ఆలోచన పనికి రానిది అయిపోయింది . డాక్టర్ కి ప్రజలు మాట వినని మూర్కులయ్యారు .
పై ఉదాహరణలో డాక్టర్ జె.పి గారైతే, సమస్య ఉన్న వారు సిమాంద్ర్తులు . వారి కోసం ఆయనేదో పరిష్కారం చెపుదామని "తెలుగు తేజం " పేరుతొ చైతన్య యాత్ర మొదలు పెడితే జనం ప్లెక్సి లు బానర్లు చించి వేసి ",మీ సోది మా కొద్దు ,సమైక్యాంద్ర గురించి ఏమి చేపుతావో చెప్పు " అనే సరికి అ డాక్టర్ గారికి కోపం వచ్చి, చైతన్య యాత్రను తాత్కాలికంగా అపుచేసాడట ! అదీ విషయం !.
J .P గారి గురించి అంచనా వేసే స్తాయి ప్రజలకు లేదు . ప్రజల స్తాయి ఆలోచించి J.P గారే అందుకు తగిన విదంగా ఆలోచన చేయాలి . J.P గారు ఎంత మేదావి అన్నది ముక్యం కాదు . అయన ఆలోచనలు ప్రజల మెదళ్ల లోకి ఎలా ఎక్కించాలన్నదే పాయింట్ . దానిలో J.P గారు విపల మయ్యారు అని చెప్పడానికి ప్రభల ఉదాహరణ "తెలుగు తేజం "ని సీమాంద్రులు తిరస్కరించడం . కాబట్టి ఒక మేధావిగా j.p. గారు కూలంకషంగా తన విదానాల మిద పునర్విమర్స చేసుకుని ముందుకు సాగడం మంచిది అని నా అభిప్రాయం .
Comments
Post a Comment