రాహుల్ గాందీ గారు ఒక చెంప పగలగొడితే, కిరణ్ కుమార్ గారు రెండో చెంప పగల గొట్టారు!.
నిన్న కేంద్ర సర్కార్ వారికి రెండు చెంప దెబ్బలు తగిలినట్లైంది! అయితే ఈ చెంప దెబ్బలు కొట్టిన వారు ప్రతిపక్ష పార్టీలో, సుప్రీం కోర్టు వారో కాదు. సాక్షాత్తు ఆల్ ఇండియా కాంగ్రెస్ ఉపాద్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ బావి ప్రదాని అభ్యర్దీ శ్రీ రాహుల్ గాందీ గారు కాగా, రెండవ వారు తమ పార్టీ ఏలుబడిలో ఉన్న ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఒక విదంగా చెప్పాలంటే రాహుల్ గాంది గారి స్టెట్మెంట్ పరిశిలిస్తే కేంద్ర ప్రభుత్వం నైతిక బాద్యత వహించి స్వచ్చందంగా రాజీనామ చేయతగిన తప్పిదం చేసినట్లే లెఖ్ఖ.
ఈ దేశ సర్వోన్నత న్యాయస్తానం, నేర గాళ్లు చట్టనిర్మాతలుగా ఉండే దౌర్బాగ్య పరిస్తితి నుండి జాతిని రక్షించడానికి చారితాత్మక తీర్పులను వెలువరించింది. అందులో ఒకటి ఏ ప్రజా ప్రతినిది అయినా సరే కోర్టుల చేత నేరస్తుడిగా నిర్దారించబడిన మరుక్షణం నుండే పదవీచ్యుతులవడమే కాక బవిష్యతులో ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి కూడా అనర్హులు. . అలగే క్రిమినల్ కేసుల వలన పోలిస్ కష్టడీ కానీ, జుడిషియల్ రిమాండ్ లో కానీ ఉంటే అట్టి వారు ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అనర్హులు అని కూడా స్పష్టంగా తెలిపింది.అయితే నేర నిర్దారణ కాకుండ కేవలం నిందితులుగా పోలిస్ కస్టడీలో ఉన్నవారిని ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించడం కానీ, అప్పీల్ అవకాశం ఉన్న నేరస్తులను చట్టసభలకు ఎన్నిక కాకుండ నిరోదించడం అన్యాయమని, దీని మీద పునర్ పరిశిలన చేయాల్సీందిగా కేంద్ర ప్రభుత్వం సుప్రీమ్ కోర్టు వారిని కోరితే అందుకు సుప్రీం కోర్టు వారు నిందితుల ఎన్నిక విషయాన్ని పునర్ పరిశిలనకు స్వీకరిస్తూ, శిక్ష పడిన నేరస్తులు మాత్రం ఎట్టి పరిస్తితిలోను చట్ట సభలకు ఎన్నిక కావడానికి కానీ, పదవిలో కొన సాగడానికి కానీ వీలులేదని రివ్యూ పిటిషన్ ని కొట్టి వేసింది. సుప్రీం కోర్టు వారి నిర్ణయాన్ని జాతి యావత్తు స్వాగతించీంది.
కానీ నేర పూరిత చరిత్ర లేనిదే రాజకీయాలలో నెగ్గడం కష్టమని ప్రాక్టికల్ గా అనుబవమున్న రాజకీయ నాయకులకు గానీ వారికి వత్తాసు పలికే పార్టిలకు కానీ సుప్రీం కోర్టు తీర్పు రుచించ లేదు అందుకే కేంద్ర సర్కార్ మీద ఒత్తిడితో ఆగమేఘాల మీద నేరస్తులకు చట్ట సబలలో కూర్చునే వెసులుబాటు కల్పిస్తూ, ఆర్డినెన్స్ తెచ్చారు. దీని మీద ప్రజా సంఘాలు అబ్యంతరం చెప్పగా ప్రతిపక్షాలు రాష్ట్రపతికి పిర్యాదు చేసాయి. పరిస్తితి ఇలా ఉంటే నిన్న కాంగ్రెస్ పార్టీ ఉపాద్యక్షుడు అయిన రాహుల్ గాందీ గారు ఒక మీడియా సమావేశం లో మాట్లాడుతూ" నేరస్తులను చట్ట సభలలోకి అనుమతించే ఆర్డినెన్స్ ని చించివేసి చెత్త బుట్టలో పడెయ్యండి" అని అనటమే కాక ఈ విషయం లో తమ సర్కార్ చేసింది తప్పే అన్నారు. శభాశ్! వయసుకు చిన్న అయినా మహా పండితులు అయిన వారు కూడా అనలేని మాటను దైర్యంగా అన్నారు శ్రీ రాహుల్ గాందీ. ప్రతిపక్షాలు ఎందుకో సరిగా స్పందించలేదు కానీ, ఈ ఆర్డినెన్స్ జారీని అధికార దుర్వినియోగంగా నిరూపించవచ్చు. తద్వారా కేంద్ర సర్కార్ లో ఉన్న మన్మోహన్ గారి రాజీనామను కోరవచ్చు.అందుకు రాహుల్ గారి స్టెట్మెంట్ ఉపయోగపడుతుంది. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయం లో ఈ విషయం వారికి పెద్దదిగా తోచి ఉండక పోవచ్చు.
ఇక పోతే మన రాష్ట్ర విషయానికి వస్తే మన ముఖ్య మంత్రి గారు నిన్న సాయంత్రం మీడియా సమావేశం లో రాష్ట్రాన్ని విబజిస్తే వచ్చే సమస్యలను ముఖ్యంగా జలవనరుల పంపిణీలో ఏర్పడే వాటిని,పవర్ పాఇంట్ ప్రెసెంటేషన్ ద్వారా, ఒక ఉపాద్యాయుడి లాగా అర్దమయ్యెలా వివరిస్తూ కేంద్ర సర్కారు వారు తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం అనాలోచితమయిందె కాక పూర్తీగా పొలిటికల్ లబ్ది కోసమేనని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని,తన హయాం లో తెలుగు ప్రజలకు నష్టం కలిగించే ఒక చారిత్రక తప్పిదం జరుగుతున్నపుడు దాని గురించి ప్రజలకు కానీ , కేంద్ర సర్కార్ కి చెప్పక పోతే బవిష్యత్ తరాలు తనని క్షమించవని ఆయన చెప్పిన మాటలు, ఆయనలోని నిజాయితిని, ప్రజల కోసం తపించే నిజమైన ప్రజా నాయకున్ని బయట పెట్టాయి. ఆయన మాటలలోని ఖచ్చిత తత్వం, ముఖ్యమంత్రి పదవి కంటే యావత్ తెలుగు జాతి ప్రయోజనమే తనకు ముఖ్యమని చెపుతున్న ఏ మాత్రం కల్మషం కనిపించని ఆయన ముఖం చూస్తుంటే, ఒక ప్రాంతం వారీ లబ్ది కోసం మరొక ప్రాంత ప్రజల ఆసక్తులు బలిపెడుతున్నారు అని కొంతమంది చేసే వాదనలో యదార్దం ఉన్నట్లు అనిపించదు.
చేతి కందింది నోటి కందక పోతే ఎవరి కైనాబాదే.ముఖ్యమంత్రి గారి మటలు తెలంగాణా రాజకీయ నాయకులు వ్యతిరేకించడానికి కారణం అదే. కానీ ముఖ్యమంత్రి గారు లేవనెత్తిన అంశాలను రోటిన్ విమర్శలతో ఎదుర్కునే బదులు ఒక వేదిక ద్వారా ఆయన చెప్పిన అంశాలకు పాయింట్ టూ పాయింట్ పరిష్కారం చూపుతూ ప్రజలకు వివరించి, తాము కోరే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు వల్ల కలిగే లాబాలను వివరిస్తే మంచిది. ఆ పని కే.సి.ఆర్ గారు చేస్తే తెలంగాణా ప్రజలు సంతోషిస్తారు.ఈ రాష్ట్రానికి కావాల్సింది ప్రజలను రెచ్చగొట్టె నాయకత్వాలు కాదు, ఆలోచింపచేసే నాయకత్వాలు. అటువంటి లక్షణాలు కలిగిన వారు అటు తెలంగాణాలో, ఇటు సిమాంద్రలోను ఉన్నారు. వారు చొరవ తీసుకుని కొన్నాళ్లు రాజకీయాలను ప్రక్కన పెట్టి, రాష్ట్ర విబజన ద్వారా ఏర్పడే ప్రయోజనాలు, నష్టాలు గురించి కూలకషంగ చర్చించై తెలుగు జాతి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే మంచిది.
కేంద్రం వారు తీసుకున్న పై రెండు నిర్ణయాల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా చెంప పెట్టు లాంటివే అని చెప్పవచ్చు.
Comments
Post a Comment